STOCKS

News


లాభాల ప్రారంభం- వెంటనే నష్టాల్లోకి...

Thursday 25th April 2019
Markets_main1556164742.png-25342

ప్రపంచమార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 48 పాయింట్ల లాభంతో 39,101.78 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 11,735.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే నేడు ఏప్రిల్‌ డెరివేటివ్స్‌ ప్యూచర్‌ కాంట్రాక్టు ముగింపు తేది కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో పాటు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 15 పైసలు బలహీనపడి 70.01 స్థాయి వద్ద ప్రారంభం కావడం సూచీల ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో సూచీలు మళ్లీ నష్టాల్లోకి మళ్లా‍యి. ఫలితంగా ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 50 పాయింట్లను నష్టపోయి 39010 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 11715 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. అటో, మెటల్‌, ఫార్మా ప్రభుత్వరంగ బ్యాంక్‌ రంగ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఐటీ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక రంగ షేర్లలో స్వల్పంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. 
బజాజ్‌ అటో, అదానీపోర్ట్స్‌, మారుతి, టాటామోటర్స్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 0.75శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, పవర్‌గ్రిడ్‌, బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌, గ్రాసీం షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

డాలర్‌ ఎఫెక్ట్‌ - స్వల్పంగా తగ్గిన పసిడి

Thursday 25th April 2019

డాలర్‌ ఇండెక్స్‌ రెండేళ్ల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో పసిడి ధర గురువారం తగ్గుముఖం పట్టింది. ఆసియా ట్రేడింగ్‌లో గురువారం ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2.50డాలర్లు నష్టపోయి 1,277.25డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అయితే, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌, జర్మనీ విడుదల చేసిన బలహీన ఆర్థిక గణాంకాలు పసిడి ధర మరింత నష్టపోకుండా అడ్డుకట్ట వేస్తున్నాయి. అమెరికారిలో గృహ కొనుగోళ్ల గణాంకాలు ఆశించినస్థాయిలో నమోదుకావడం

‘లీలా’హోటళ్ల విక్రయానికి సెబీ బ్రేక్‌

Thursday 25th April 2019

హోటల్‌ లీలా వెంచర్‌ హోటళ్ల  అమ్మకం వ్యవహారం  న్యూఢిల్లీ: హోటల్‌ లీలా వెంచర్‌ హోటళ్ల, ఇతర ఆస్తుల విక్రయాన్ని మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నిలిపేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ఈ విక్రయాలను నిలిపేయాలని  సెబీ ఆదేశాలు జారీ చేసిందని హోటల్‌ లీలా వెంచర్‌ బుధవారం వెల్లడించింది. మరోవైపు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ముంబై ధర్మాసనం హోటల్‌ లీలా వెంచర్‌కు, ఈ కంపెనీ ప్రమోటర్లకు, ఈ కంపెనీ రుణదాత జేఎమ్‌

Most from this category