STOCKS

News


ఫ్లాట్‌ ముగింపుతో 2018కు వీడ్కోలు

Monday 31st December 2018
Markets_main1546255757.png-23335

మార్కెట్‌ 2018 సంవత్సరానికి ఫ్లాట్‌ ముగింపుతో వీడ్కోలు పలికింది. ఈ ఏడాదిలో మార్కెట్లకు చివరిరోజైన నేటి ట్రేడింగ్‌ సెషన్‌లో సూచీలు ఆద్యంతం ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను సాగించిన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రపంచ‌మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో ఉదయం భారీ లాభంతో మార్కెట్‌ ప్రారంభమైనప్పటికీ.., ఆసియా, ఐరోపా మార్కెట్ల మిశ్రమ ముగింపు, ముడిచమురు ధరల పెరుగుదల మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.మిశ్రమంగా ముగిశాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 8పాయింట్లు నష్టపోయి 36,068 వద్ద, నిఫ్టీ 3పాయింట్ల స్వల్ప లాభంతో 10,862 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 200 పాయింట్లను లాభాలను కోల్పోగా, నిఫ్టీ ఇండెక్స్‌ 10900 మార్కును నిలబెట్టుకోలేకపోయింది. ఇంట్రాడేలో అత్యధికంగా మెటల్‌ ఇండెక్స్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌, ఫార్మా రంగాల్లో కొనుగోళ్లు జరిగాయి. టెలికాం, ఎనర్జీ, ఎఫ్‌ఎంజీసీ, రియల్టీ రంగ షేర్ల షేర్లలో అమ్మకాలు జరిగాయి. ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిసినప్పటికీ.., మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌, స్మాల్‌ ఇండెక్స్‌లు షేర్లు జోరుగా ర్యాలీ చేశాయి. ఈ ఏడాదిలో సెన్సెక్స్‌ సూచీ 2220 పాయింట్లను, నిఫ్టీ సూచీ 331 పాయింట్లను ఆర్జించింది.
సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభం ఆవిరి:-
ప్రపంచమార్కెట్లలలో నెలకొన్న సానుకూల ట్రెండ్‌కు, రూపాయి విలువ బలపడటంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సెన్సెక్స్‌ 163 పాయింట్ల లాభంతోనూ, నిఫ్టీ సూచీ 10900లపైన ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలకు ఇది వరుసుగా నాలుగోరోజూ లాభాల ప్రారంభం కావడం విశేషం. ఆటోమొబైల్స్‌, లోహ, ఫార్మా తదితర రంగాల్లో కొనుగోళ్ల అండతో సూచీలు ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే సెన్సెక్స్‌ సూచీ 208 పాయింట్ల ఆర్జించి 36,285 వద్ద, 63 పాయింట్లు పెరిగి 10,923 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. నమోదు చేశాయి. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు ముడిచమురు ధరలు పెరగడటం, డాలర్‌ మారకంలో రూపాయి బలహీనపడటం, నేడు నవంబర్ నెల మౌలిక వసతుల రంగం వృద్ధి వివరాలు వెల్లడికానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత తదితర అంశాలను సూచీల ర్యాలీకి అవరోధంగా నిలిచాయి. ముఖ్యంగా ఇంధన, టెలికాం, ఎఫ్‌ఎంసీజీ రంగాలకు చెందిన రంగాల్లోత అమ్మకాలు జరగడంతో మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు ఆరంభలాభాల్ని కొల్పోయిన నష్టాల్లో ట్రేడయ్యాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌ సూచీ 43 పాయింట్ల మేర నష్టపోయి 36,034 వద్ద, నిఫ్టీ సూచీ 10 పాయింట్ల క్షీణించి 10,853 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే మిడ్‌సెషన్ అనంతరం యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల జోరుతో సూచీలు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. అయితే మన మార్కెట్‌ ముగింపు సమయానికి యూరప్‌ మార్కెట్లు నష్టాల్లోకి మళ్లడటంతో పాటు, మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలేమిలేకపోవడంతో సూచీ స్తబ్దుగా ట్రేడై చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ సూచీ 36వేల స్థాయిని నిలుపుకోగా, నిఫ్టీ ఇండెక్స్‌ 10900 పాయింట్లను నిలుపోలేకపోవడం గమనార్హం.

హీరోమోటోకార్ప్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1నుంచి 3శాతం నష్టపోగా, సన్‌ఫార్మా, టాటామోటర్స్‌, వేదాంత, టాటాస్టీల్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి.



You may be interested

2019 కోసం బోటమ్‌అప్‌ విధానం: పొరింజు

Monday 31st December 2018

గత ఆర్థిక సంవత్సరంలో చిన్న, మధ్య స్థాయి మార్కె్‌ట్‌ విలువ కలిగిన కంపెనీలు ఎక్కువగా నష్టపోయాయి. అయితే, ఇవి 2019లో మంచి లాభాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారు ప్రముఖ ఇన్వెస్టర్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ సంస్థ సీఈవో పొరింజు వెలియాత్‌. నూతన సంవత్సరంలో ఏ తరహా విధానం అనుసరణీయమన్నది ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ వివరాలు...    ‘‘చాలా మంది మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇరుక్కుపోయామని, బ్లూచిప్‌

మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల ర్యాలీ

Monday 31st December 2018

ముంబై:- ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ నిఫ్టీ స్వల్ప నష్టాలతో ముగిసినప్పటికీ..,  ఇంట్రాడేలో మిడ్‌ క్యాప్‌, స్మాల్మ్‌ క్యాప్‌ షేర్లు లాభాల మోత మోగించాయి. బీఎస్‌ మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ దాదాపు 1శాతం వరకు లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌:- నేడు 15,406 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో దాదాపు 1శాతం లాభపడి 15,481 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 78 పాయింట్లు లాభపడి 15,438.45

Most from this category