News


636 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్‌ హెచ్చుతగ్గులు

Wednesday 27th February 2019
Markets_main1551263725.png-24361

  • రెండో రోజూ నష్టాలే..!

భారత్‌ - పాకిస్థాన్‌ల సరిహద్దు యుద్ధభయాలతో బుధవారం స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ గరిష్టస్థాయి 36,371 నుంచి 636 పాయింట్ల శ్రేణిలో కదలాడగా, నిఫ్టీ 10,940 స్థాయి నుంచి 189 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం పాటు బలహీన అంతర్జాతీయ సంకేతాలు, ముడిచమురు ధరలు పెరగడటం తదితర ప్రతికూలాంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మెటల్‌ షేర్లలో అ‍మ్మకాలతో సెన్సెక్స్‌ 70పాయింట్లను నష్టపోయి 35,905.43 వద్ద, నిఫ్టీ 28.65 పాయింట్ల నష్టంతో 10,806 వద్ద స్థిరపడ్డాయి. వడ్డీరేట్ల పెంపుపై మరికొంత కాలం సహనం వహిస్తామని గతరాత్రి ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ ప్రకటనతో ప్రపంచమార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. నేడు ఆసియా మార్కెట్ల లాభాల ప్రారంభాన్ని అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 165 పాయింట్ల లాభంతో 36,123 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు పెరిగి 10,879 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో కొనుగోళ్లకు మద్దతు పెరగడంతో సూచీలు క్రమంగా లాభాల్ని ఆర్జించసాగాయి. సెన్సెక్స్‌ దాదాపు 400 పాయింట్లు లాభపడి 36,371 వద్ద, నిఫ్టీ 189 పాయింట్లు పెరిగి 10,934ల వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. కొనుగోళ్లతో మార్కెట్‌ సాజావుగా సాగుతున్న తరుణంలో భారత్‌, పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయి చేరాయన్న వార్తలు కలకలం రేపాయి. కాశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లోకి ప్రవేశించి పలుచోట్ల బాంబులు జారవిడిచిన పాకిస్తాన్ ఎఫ్‌-16 ఫైటర్‌జెట్‌ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కూల్చేవేసినట్లు భారత్‌ ప్రకటించింది. మరోవైపు  ఎల్‌వోసీ దాటివచ్చిన రెండు భారత విమానాలను తాము కూల్చినట్లు పాకిస్తాన్ ప్రకటించుకుంది. ఈ యుద్ధ పరిణామాలు ఇన్వెస్టర్లను తీవ్రంగా కలవపరిచాయి. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చని ఆందోళనతో ఇన్వెస్టర్లు మార్కెట్‌లోంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.  ఫలితంగా సూచీలు ఉదయం ట్రేడింగ్‌లో ఆర్జించిన లాభాలను కోల్పోయి గరిష్టస్థాయిల నుంచి వేగంగా వెనక్కివచ్చాయి. యుద్ధ పరిణామాలు గంట గంటకు తీవ్రతరం అవుతుడంతో సూచీలు సైతం భారీగా నష్టపోయాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 238 పాయింట్లను కోల్పోయి 35,735 వద్ద, నిఫ్టీ 84పాయింట్లను నష్టపోయి 10,751 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల నష్టాలు కొంత వరకు రికవరీ అయ్యాయి. 
హిందూస్థాన్‌ యూనిలివర్‌, టాటామోటర్స్‌, విప్రో, వేదాంత, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 2శాతం నుంచి 4శాతం నష్టపోగా, సన్‌ఫార్మా, బజాజ్‌ అటో, ఎల్‌ అండ్‌ టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి.You may be interested

భారీ డివిడెండ్‌ వీటి నుంచే..!

Thursday 28th February 2019

రానున్న ఆర్థిక సంవత్సరంలో అధిక డివిడెండ్‌ ఆదాయం ప్రభుత్వరంగ కంపెనీల నుంచి వాటాదారులకు రానుంది. నిఫ్టీ-50 కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే 5 శాతం అధికంగా వివిడెండ్‌ పంపిణీ చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లో డివిడెండ్‌ ఈల్డ్‌ 1.8 శాతంగా ఉంటుందని అంచనా. అస్థిర మార్కెట్లలో షేర్ల ధరలు కకావికలం అవుతుంటాయి. ఈ సమయాల్లో వాటాదారులకు కంపెనీల పట్ల భరోసాకు డివిడెండ్‌ ఉపకరిస్తుంది. మంచి డివిడెండ్‌ను

విప్రోకు డౌన్‌గ్రేడ్‌ షాక్‌

Wednesday 27th February 2019

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ విప్రో షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 3.50 శాతం నష్టపోయాయి. ఈ కంపెనీ షేరును గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం క్రెడిట్‌ సూసీ డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో విప్రో షేర్లు రూ.380.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. రానున్న రోజుల్లో కంపెనీ మార్జిన్లతో పాటు ఆదాయాలు సైతం ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ విశ్లేషకులు అంచనావేశారు. దీంతో బ్రోకరేజ్‌ సంస్థ షేరు రేటింగ్‌ను ‘‘అవుట్‌ ఫెర్మామింగ్‌ నుంచి

Most from this category