STOCKS

News


మూడోరోజూ లాభాలే..!

Tuesday 11th June 2019
Markets_main1560248953.png-26230

సానుకూల జాతీయ, అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్‌ వరుసగా మూడోరోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 166  పాయింట్లు పెరిగి 39,950.46 వద్ద, నిఫ్టీ 43 పాయింట్ల పెరిగి 11,965.60 వద్ద ముగిశాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, మీడియా, అటో, ఫైనాన్స్‌, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 231 పాయింట్లు(0.75శాతం) లాభపడి 31,265.45 వద్ద స్థిరపడింది. మరోవైపు ఎఫ్‌ఎంజీసీ, ఫార్మా రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. వచ్చే వారంలో జరగనున్న అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌  సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో పాటు వాణిజ్య యుద్ద ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో సానుకూల వాతవరణం నెలకొంది. ఇక దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు క్రమంగా పెరగడటం తదితర అంశాలు మార్కెట్‌ సెటిమెంట్‌ను బలపరిచాయి. ఇన్వెస్టర్లు రేపు(బుధవారం) విడుదల కానున్న పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం రేటు గణాంకాలపై దృష్టి సారించారు. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే కట్టుబడటంతో ఇంట్రాడేలో నిఫ్టీ 78 పాయింట్లు పెరిగి 12,000 స్థాయిని, సెన్సెక్స్‌ 281 పాయింట్లు లాభపడి 40,066 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. 
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జీ లిమిటెడ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటామోటర్స్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. టెక్‌ మహీంద్రా, బీపీసీఎల్‌, ఎం​అండ్‌ ఎం, సన్‌ఫార్మా, ఇండియాబుల్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 1శాతం నుంచి 8శాతం నష్టపోయాయి. 



You may be interested

మే నెలలో తగ్గిన వాహన విక్రయాలు

Tuesday 11th June 2019

 గత ఏడాది మే నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది మే నెలలో వాహనాల విక్రయాలు  తగ్గాయని  సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫాక్చర్‌( సియామ్‌) మంగళవారం తెలిపింది.  ప్రయాణికుల వాహనాల దేశీయ విక్రయాలు 20.55శాతం తగ్గాయని, 2018 మే లో 3,01,238 యూనిట్లుగా ఉన్న ఈ అమ్మకాలు 2019 మే లో 2,39,347 యూనిట్లగా నమోదైందనట్లు  వివరించింది. సియామ్‌ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశియంగా కార్ల అమ్మకాలు 26.03 శాతం తగ్గాయి. 2018 మే

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Tuesday 11th June 2019

బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో మంళవారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతానికి పైగా లాభపడింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 31,172ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ఇండెక్స్‌ 1.15శాతం(365 పాయింట్లు) పెరిగి 31,399.35ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(31,034.00)తో పోలిస్తే 1శాతం

Most from this category