STOCKS

News


ఫ్లాట్‌ ముగిసిన సూచీలు

Thursday 14th March 2019
Markets_main1552558995.png-24610

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులకు లోనై సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్‌ 3పాయింట్ల లాభంతో 37,755 వద్ద, నిఫ్టీ 1.50 పాయింట్లు పెరిగి 11,343 వద్ద స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో సూచీలు కొంతమేర లాభాల్ని ఆర్జించినప్పటికీ.., ఈ లాభాల్ని చివరి వరకు నిలుపుకోవడంలో విఫలయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 186 పాయింట్ల లాభపడి 29,028.90 వద్ద కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 39 పాయింట్ల స్వల్ప లాభంతో 28,923.10 వద్ద ముగిసింది. ఫార్మా, మెటల్‌, రియల్టీ, బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. రూపాయి బలహీనత కారణంగా ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, అదే బాటలో అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లలో విక్రయాలు జరిగాయి. ఇంట్రాడేలో నిఫ్టీ 11,313 - 11,383 (69 పాయింట్లు) స్థాయిలో కదలాడగా, సెన్సెక్స్‌ 37,693 - 37,907 (215 పాయింట్లు) రేంజ్‌లో ట్రేడైంది. ఈ వారంలో సూచీలకు ఇది వరుసగా 4వ లాభాల ముగింపు.
సన్‌ఫార్మా, యస్‌ బ్యాంక్‌, భారతీఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌, ఎన్‌టీపీసీ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం లాభపడగా, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటామోటర్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హీరోమోటోకార్ప్‌, హెచ్‌సీఎల్‌టెక్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం ర్యాలీ నష్టపోయాయి. 



You may be interested

40 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలకు భారీ వాటాలు

Thursday 14th March 2019

ఇటీవలి మార్కె్‌ట్‌ ర్యాలీ ప్రధానంగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల కారణంగానే అని చెప్పొచ్చు. గతేడాది నుంచి మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ గణనీయంగా నష్టపోయి ఉన్నాయి. తాజాగా విదేశీ పెట్టుబడులతో మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌ నెలకొంది. మళ్లీ మోదీ సర్కారే వస్తుందని, బలమైన సంస్కరణలకు అవకాశం ఉంటుందన్న అంచనాలతో వారు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మిడ్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో రికవరీ ఆరంభమైంది. చాలా వరకు స్టాక్స్‌ 10-40

ఎన్నికల తర్వాతే ఇండియాలోకి వస్తాం!

Thursday 14th March 2019

జులియస్‌ బేర్‌ అండ్‌ కో ప్రస్తుతానికి భారత్‌ కన్నా చైనా మార్కెట్‌ మంచి ప్రదర్శన చూపగలదని ప్రముఖ బ్యాంకింగ్‌ దిగ్గజం జూలియస్‌ బేర్‌ అండ్‌ కో అభిప్రాయపడుతోంది. ఇండియా మార్కెట్లో కొనుగోళ్లకు తాము ఆసక్తిగానే ఉన్నామని, కానీ మేలో ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో? చూసిన తర్వాతే ఇండియాలోకి ఎంటరవుతామని బ్యాంకు ప్రతినిధి మార్క్‌ మాథ్యూస్‌ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల కేంద్రబ్యాంకులు రేట్ల తగ్గింపు వాతావరణాన్ని నిర్వహిస్తున్నాయన్నారు. అయితే కంపెనీ

Most from this category