STOCKS

News


స్వల్ప లాభంతో ముగింపు

Tuesday 6th November 2018
Markets_main1541500835.png-21763

ముంబై:- ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు...రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీఎసీస్‌, ఐసీఐసీఐ షేర్ల ర్యాలీతో మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అయిన్పటికీ, సెన్సెక్స్‌ 35వేల మార్కును కోల్పోయి 41 పాయింట్ల స్వల్పలాభంతో 34,992 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 6 పాయింట్లు పెరిగి 10,530 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, మీడియా, రియల్టీ రంగాలకు చెందిన సూచీలు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో, మెటల్‌, ఫార్మా రంగాలకు చెందిన సూచీలు నష్టపోయాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. ఇదే ఎస్‌ఎస్‌ఈలో మరో ప్రధాన సూచీ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 134 పాయింట్ల లాభంతో 25,598.00 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 34,890 - 35,196 రేంజ్‌లో ట్రేడవ్వగా, నిఫ్టీ ఇండెక్స్‌ 10,491.45 - 10,600.25 స్థాయిలో కదలాడింది.
ఇంట్రాడే ట్రేడింగ్‌ సాగిందిలా:-
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన మిశ్రమ స్పందనతో నేడు దేశీయ మార్కెట్‌ స్వల్ప లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ సూచీ 125 పాయింట్ల లాభంతో 35వేల పైన 35,076 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 10550పైన 10552 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో అటో, ఎనర్జీ, కన్జ్యూమర్‌, మెటల్‌ షేర్ల ర్యాలీకి తోడు డాలర్‌ మారకంలో రూపాయి బలపడంతో ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చింది. ఫలితంగా మార్కెట్లో కొనుగోళ్లు పెరిగాయి. రిలయన్స్‌, టీసీఎస్‌ షేర్ల అండతో సెన్సెక్స్‌ సూచీ 245 పాయింట్ల లాభంతో 35,196 వద్ద, నిఫ్టీ సూచీ 76 పాయింట్లు పెరిగి 10,600 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే మిడ్‌ సెషన్‌లో మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకు, మెటల్‌ ఫార్మా రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా స్టే్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌, టాటా స్టీల్‌ షేర్ల క్షీణతతో... సూచీలు ఆర్జించిన లాభాలను కోల్పోయాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం 35,196 నుంచి ఏకంగా 300 పాయింట్లు నష్టపోయి 34,890 వద్ద చేరుకుంది. నిఫ్టీ సూచీ డే గరిష్టస్థాయి 10,600.25 నుంచి 109 పాయింట్లు నష్టపోయి 10,491.45 వద్దకు చేరుకుంది. అటుతర్వాత టీసీఎస్‌, సన్‌ఫార్మా, టాటామోటర్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్ల అండతో సూచీలు స్వల్పలాభాలతో ముగిశాయి.

టాటామోటర్స్‌, సన్‌ఫార్మా, టీసీఎస్‌, యస్‌బ్యాంక్‌, జీలిమిటెడ్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. బీపీసీఎల్‌, యాక్సి్‌స్‌ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌, యస్‌బీఐ, సిప్లా షేర్ల 2శాతం నుంచి 6శాతం నష్టపోయాయి.



You may be interested

అమెజాన్‌ ఫ్యూచర్‌ షాపింగ్‌

Wednesday 7th November 2018

 - ఫ్యూచర్‌ రిటైల్‌లో 9.5 శాతం వాటా కొనుగోలు? - త్వరలో డీల్‌; దీనికోసం రూ.2,500 కోట్ల వ్యయం - ఆన్‌లైన్‌ గ్రోసరీ మార్కెట్లో దూసుకెళ్లడమే లక్ష్యం... - ఇప్పటికే ‘మోర్‌’ కోనుగోలుతో దూకుడు... న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ‘షాపింగ్‌’లో దూకుడు పెంచుతోంది. ఆన్‌లైన్‌ గ్రోసరీ (కిరాణా, ఆహారోత్పత్తులు ఇతరత్రా) మార్కెట్లో మరింత మార్కెట్‌ను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. బిగ్‌బజార్‌, నీల్‌గిరీస్‌ బ్రాండ్‌లతో సూపర్‌మార్కెట్‌లను నిర్వహిస్తున్న ఫ్యూచర్‌ రిటైల్‌లో అమెజాన్‌ పాగా వేసేందుకు

సంవత్‌ ‘2075’ కలిసొస్తుంది..

Tuesday 6th November 2018

సంవత్‌ 2075 ఇన్వెస్టర్లకు లాభాలను అందిస్తుందని ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా ఫౌండర్‌, సీఈవో పొరింజు వెలియత్‌ తెలిపారు. కరెక‌్షన్‌కు గురైన, బాగా పడిపోయిన స్టాక్స్‌ మళ్లీ పెరుగుతాయని ధీమా వ్యక్తంచేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల ఈ విషయాలు వెల్లడించారు. ‘సంవత్‌ 2075 ప్రారంభమౌతోంది. మంచి ఆరంభం ఉంటుందని భావిస్తున్నా. ప్రస్తుతం మనం ఓవర్‌సోల్డ్‌ మార్కెట్‌లో ఉన్నాం. గత దీపావళి రోజున మార్కెట్‌లో ఓవర్‌బాట్‌, అధిక వ్యాల్యుయేషన్స్‌

Most from this category