STOCKS

News


సెన్సెక్స్‌ మైనస్‌ : నిఫ్టీ ప్లస్‌

Thursday 7th February 2019
Markets_main1549535907.png-24073

ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయంతో మార్కెట్‌ గురువారం మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్‌ 4పాయింట్ల స్వల్ప నష్టంతో 36,971 వద్ద, నిఫ్టీ 7పాయింట్ల స్వల్ప లాభంతో 11,069 వద్ద స్థిరపడ్డాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల తగ్గింపు నేపథ్యంలో అటో, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ రంగ షేర్లలో కొనుగోళ్లు జరగ్గా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రియల్టీ రంగ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 27,387 వద్ద ముగిసింది.
లాభాల్లోంచి నష్టాల్లోకి:-
రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీరేట్ల కోత ఉండవచ్చనే అంచనాలతో నేడు సూచీలు ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 51 పాయింట్ల లాభంతో 37,026 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8 పాయింట్ల పెరుగుదలతో 11,070 వద్ద మొదలయ్యాయి. ఇన్వెస్టర్లు ఫార్మా, ఆటో, ఐటీ షేర్లలో కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు స్థిరంగా ర్యాలీని సాగించాయి. మిడ్‌సెషన్‌ సమయానికి ముందు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) కీలక వడ్డీరేట్లపై వైఖరిని ప్రకటించింది.  రెపో రేటును 6.5శాతం నుంచి 6.25శాతానికి, రివర్స్‌ రెపోరేటును సైతం 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వడ్డీ రేట్లను ప్రభావితం చేసే రెపో రేటు కోత నేపథ్యంలో మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో సూచీల మరింత జోరును పెంచాయి. మిడ్‌సెషన్‌ అనంతరం సెన్సెక్స్‌ అటో, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ రంగ షేర్ల ర్యాలీ కారణంగా సెన్సెక్స్‌ సూచీ 200పాయింట్లు పెరిగి 37,172 వద్దకు, నిఫ్టీ ఇండెక్స్‌ 56 పాయింట్ల లాభంతో 11,118 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అయితే మార్కెట్‌ మరో గంటలో ముగుస్తుందనగా... ఒక్కసారిగా అ‍మ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ షేర్లలో విక్రయాలు జరిగాయి. ఫలితంగా మార్కెట్‌ ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఆర్జించిన లాభాలన్నీ హరించుకుపోయాయి. ఒకానొకదశలో సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు మిశ్రమంగా ట్రేడింగ్‌ను ముగించాయి.

గ్రాసీం, బజాజ్‌ - అటో, ఐషర్‌మోటర్స్‌, సన్‌ఫార్మా, జీలిమిటెడ్‌ షేర్లు 3శాతం నుంచి 4.50శాతం లాభపడగా, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి.


RBI

You may be interested

21 కంపెనీలపై ఎన్‌ఎస్‌ఈ అదనపు నిఘా

Friday 8th February 2019

ప్రముఖ స్టాక్‌ ఎక్సేంజ్‌ ఎన్‌ఎస్‌ఈ 21 కంపెనీలను అదనపు నిఘా చర్యల కార్యాచరణ (ఏఎస్‌ఎం) పరిధిలోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ జాబితాలో రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, రిలయన్స్‌ నేవల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, బినానీ ఇండస్ట్రీస్‌, బల్లార్‌పూర్‌ ఇండస్ట్రీస్‌, జీటీఎల్‌ ఇన్‌ఫ్రా, మంధన ఇండస్ట్రీస్‌, శ్రీ అధికారి బద్రర్స్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ ఉన్నాయి. ఓ కంపెనీ షేరు ధరల్లో గరిష్ట, కనిష్ట ధరల మధ్య వ్యత్యాసం, ఇంట్రాడే పొజిషన్లు, క్లయింట్లు, ఎన్ని సార్లు

రెపోరేటు కోత : అటో షేర్ల ర్యాలీ

Thursday 7th February 2019

బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేట్ల(రెపో రేటు)ను తగ్గించడంతో గురువారం మిడ్‌సెషన్‌ అనంతరం అటో షేర్లు లాభాల బాట పట్టాయి. రెపో రేట్ల తగ్గింపుతో వాహన రుణాలపై బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గవచ్చనే అంచనాలు అటో షేర్ల కొనుగోళ్లకు కారణమవుతున్నాయి.  ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఇండెక్స్‌లో అత్యధిక అశోక్‌లేలాండ్‌ 6శాతానికి పైగా ర్యాలీ

Most from this category