STOCKS

News


మరో కొత్త రికార్డు ముగింపు

Wednesday 8th August 2018
Markets_main1533725040.png-19056

  • 11450 వద్ద నిఫ్టీ

ముంబై:- ఒక రోజు మిశ్రమ ముగింపు అనంతరం సూచీలు మళ్లీ సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టాయి. బ్యాంకింగ్‌, ఇంధన, ఫైనాన్షియల్‌ సర్వీసెస్ రంగ షేర్ల అండతో సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డులను సృష్టించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు రోజంతా లాభాల ర్యాలీ చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 221 పాయింట్ల లాభపడి 37,887 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60.55 పాయింట్లు లాభపడి 11,450 వద్ద ముగిశాయి. సూచీలు ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎస్‌జీసీ, ఎస్‌బీఐ షేర్ల అండతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ మొత్తం 265 పాయింట్ల లాభపడగా, నిఫ్టీ 71 పాయింట్లను ఆర్జించింది. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌ రంగాలకు చెందిన సూచీలు లాభపడగా, ఫార్మా, అటో, ఐటీ రంగ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ 186 పాయింట్లు లాభపడి మొదటిసారిగా 28వేల మార్కుపైన ముగిసింది.
ఇంట్రాడే ట్రేడింగ్‌ సాగిందిలా..!
క్రితం రోజు మిశ్రమ ముగింపు అనంతరం నేడు మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైమంది. 90 పాయింట్ల లాభంతో 37756  వద్ద, నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో 11,412.50 వద్ద ట్రేడింగ్‌ను షురూ చేశాయి. సూచీలు లాభాల్లో ప్రారంభమైనప్పటికీ ఫార్మా రంగంలో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు స్వల్ప నష్టాలోకి​ జారుకున్నాయి.  సెన్సెక్స్‌ 25 పాయింట్ల నష్టంతో 37641 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 11,379 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అనంతరం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో జరిగిన కొనుగోళ్లతో సూచీలు మళ్లీ లాభాల్లో మళ్లాయి. మిడ్‌ సెషన్‌ అనంతరం యూరప్‌లో పలు మార్కెట్లు లాభాల ఓపెనింగ్‌ ఇన్వెస్టర్లకు మరింత ఉత్సాహానిచ్చాయి. చివరి గంటలో కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్‌ 37931 వద్ద, నిఫ్టీ 11,460  పాయింట్ల వద్ద కొత్త మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. 
ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, సిప్లా, ఇన్‌ఫ్రాటెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 3 నుంచి 1శాతం లాభపడగా, గ్రాసీం, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, మారుతి, లుపిన్‌ షేర్లు 1నుంచి 5శాతం నష్టపోయాయి.



You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు మర్చిపోయారా?

Wednesday 8th August 2018

ఎప్పుడో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఆ విషయమే మర్చిపోయారా? లేదంటే మీ పెద్దలు ఇన్వెస్ట్‌ చేసి ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయి అయినా ఉండొచ్చు. ఎందుకంటే మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల వద్ద ఆచూకీ లేని ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.44,000 కోట్లు ఉండిపోయాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ వద్ద ఉన్న మొత్తం పెట్టుబడుల్లో ఇవి రెండు శాతం. వీటిలో అధిక శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లవే అయి ఉంటాయి. ఇదే నిజమైతే

ఎంఅండ్‌ఎంపై బుల్లిష్‌

Wednesday 8th August 2018

ఆటోమొబైల్‌ రంగానికి చెందిన మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎంఅండ్‌ఎం స్టాక్‌పై బ్రోకరేజ్‌ సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.. బ్రోకరేజ్‌: మెక్వైరీ రేటింగ్‌: ఔట్‌పర్ఫార్మ్‌ టార్గెట్‌: రూ.1,050 ఈ గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ ఎంఅండ్‌ఎం టార్గెట్‌ ధరను రూ.940 నుంచి రూ.1,050కి పెంచింది. కొత్త మోడళ్ల వల్ల 2018-19 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో యుటిలిటీ వాహన విక్రయాలు పెరగొచ్చని

Most from this category