STOCKS

News


అక్కడక్కడే ముగిసిన మార్కెట్‌

Friday 22nd February 2019
Markets_main1550831271.png-24283

దేశీయ మార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితులు సూచీల ర్యాలీని రెండురోజులకే పరిమితం చేశాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు అక్కడిక్కడే ముగిశాయి. సెన్సెక్స్‌ 27 పాయింట్ల నష్టంతో 35,871 వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 10,792 వద్ద స్థిరపడ్డాయి. అమెరికాలో ఆర్థిక గణాంకాలు బలహీన నమోదు కావడంతో నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ ప్రతికూల ప్రభావం ప్రపంచమార్కెట్లను వెంటాడింది. ఫలితంగా నేడు ఆసియాలో చైనాతో పాటు పలు ప్రధాన మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అలాగే యూరప్‌ మార్కెట్లు సైతం స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రాంరంభించాయి. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీలు స్తబ్ధుగా కదిలాయి. అలాగే నేడు ఈ వారంతపు రోజు కావడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ మరింత బలహీనపడింది. ఫైనాన్షియల్‌, ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు జరిగాయి. కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ బ్యాంక్‌ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 184 పాయింట్లను నష్టపోయి 26,867.55 వద్ద స్థిరపడింది. మరోవైపు మెటల్‌ షేర్లు వరుసగా 4వరోజూ ర్యాలీ చేయడంతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం, అటో రంగ ఇండెక్స్‌ సైతం 1.50శాతం పడింది.  అలాగే ఫార్మా, పీఎస్‌యూ ఇండెక్స్‌లు సైతం అరశాతం పెరిగాయి. 

బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, గెయిల్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 1శాతం నుంచి 4శాతం నష్టపోగా, వేదాంత, బీపీసీఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్పీసీఎల్‌, ఐఓసీ షేర్లు 3శాతం నుంచి 5శాతం లాభపడ్డాయి. 



You may be interested

స్మాల్‌క్యాప్‌లో ఒక వంతు కంటే ఎక్కువొద్దు!

Saturday 23rd February 2019

స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో ఒక వంతు కంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం సూచనీయం కాదని హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీఐవో ప్రశాంత్‌జైన్‌ తెలిపారు. ముంబైలో  జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సాధారణ ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై సూచనలు చేశారు. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో పావు శాతం లేదా ఒక వంతు (33 శాతం) వరకు స్మాల్‌ క్యాప్‌ కంపెనీల్లో పెట్టబడులు పెట్టుకోవచ్చన్నారు. ప్రతీ రంగంలో పెద్ద కంపెనీలు

ఆదాయంపై భరోసా ఇస్తేనే ఆర్థిక సాయం..

Friday 22nd February 2019

- బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు తేల్చి చెప్పిన డీసీసీ న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి ఆర్థికపరమైన సహాయం పొందాలంటే సరైన టర్న్‌ అరౌండ్ వ్యూహాన్ని సమర్పించాలని, ఆదాయ వృద్ధిపై భరోసానివ్వాలని ప్రభుత్వ రంగ టెల్కోలు బీఎస్‌ఎన్ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌కు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) స్పష్టం చేసింది. "ఆర్థిక సహాయం గానీ అందజేస్తే... ఈ రెండు కంపెనీలూ మళ్లీ ఎప్పటికల్లా లాభాల్లోకి వస్తాయి? అందుకోసం ఏయే వ్యూహాలు అమలు చేయాలనుకుంటున్నాయి? వంటి వివరాలు చెప్పాలని

Most from this category