STOCKS

News


నష్టాల ప్రారంభం​

Thursday 3rd January 2019
Markets_main1546489470.png-23376

ప్రపంచమార్కెట్లో నెలకొన్న బలహీన పరిస్థితుల నేపథ్యంలో దేశీయ మార్కెట్‌ గురువారం నష్టాలతో ప్రారంభమైంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదించడంతో పాటు చైనా ఉత్పాదక రంగం మందగించడంతో ఈ తొలిత్రైమాసికంలో తమ ఐఫోన్‌ మోడళ్ల ఉత్పత్తులను తగ్గిస్తున్నట్లు ఆపిల్‌ ప్రకటనతో ఆసియా మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. జపాన్‌ మార్కెట్‌ నేడు కూడా సెలవులో ఉంది. అయితే ఈ దేశ కరెన్సీ యెన్‌ ర్యాలీ చేయడంతో నికాయ్‌ ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత సైతం సూచీల ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 75 పాయింట్లు కోల్పోయి 35,816.71 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  40 పాయింట్లు నష్టపోయి 10,752.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మెటల్, ఫైనాన్స్‌, పార్మా రంగ షేర్లలో అమ్మకాలు నెలకొన్నాయి. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి.
ఓఎన్‌జీసీ, ఐఓసీ, బీపీసీఎల్‌, ఐషర్‌మోటర్స్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, వేదాంత, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, సిప్లా, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది.You may be interested

గురువారం వార్తల్లో షేర్లు

Thursday 3rd January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా గురువారం ప్రభావిత‌య్యే షేర్లు ఇవి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనకు కేంద్రం క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. విలీన ప్రతిపాదన ప్రకారం.. విజయ బ్యాంక్‌ షేర్‌హోల్డర్లకు సంబంధించి ప్రతి 1000 షేర్లుకు బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అటు దేనా బ్యాంక్‌ విషయానికొస్తే..  ప్రతి 1000 షేర్లకు 110 బీవోబీ షేర్లు లభిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ:- జ‌న‌వ‌రి 29న ఎన్‌సీడీల ద్వారా రూ.45వేల

ఓపిక పడితే లాభాలు ఎందుకు రావు... ఇదే నిదర్శనం

Thursday 3rd January 2019

స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసి, చేతులు కాల్చుకోవడం చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్లకు అనుభవమే. ఎందుకంటే అటువంటి వారి దృష్టంతా రాబడులపైనే కానీ, సరైన కంపెనీలను గుర్తించడంపై శ్రద్ధ ఉండదు. మంచి యాజమాన్యం, వ్యాపార ఫండమెంటల్స్‌, నగదు ప్రవాహాలు, ఏటేటా వ్యాపారంలో వృద్ధి ఇలా ఎన్నో అంశాల ఆధారంగా మంచి స్టాక్స్‌లో ఇన్వె‍స్ట్‌ చేస్తే దీర్ఘకాలంలో భారీ రాబడులు వస్తాయని ఎన్నో కంపెనీలు నిరూపించాయి. ఆ జాబితాలోనిదే కోటక్‌ మహీంద్రా

Most from this category