STOCKS

News


ఏయే షేర్లు...ఎన్నెన్ని పాయింట్లు.?

Thursday 31st January 2019
Markets_main1548930724.png-23932

హెవీవెయిట్‌ షేర్లలో జరిగిన భారీ కొనుగోళ్లు, షార్ట్‌ కవరింగ్‌ కారణంగా గురువారం భారత్‌ మార్కెట్‌ పెద్ద ర్యాలీ జరిపింది. నిఫ్టీ ఇండెక్స్‌ ఆర్జించిన 179 పాయింట్ల లాభంతో రిలయన్స్‌ ఇండస్ట్రీట్‌ లిమిటెడ్‌ షేరు అత్యధికంగా 27 పాయింట్లను సమకూర్చింది. అదే బాటలో ఇన్ఫోసిస్‌ 21 పాయిం‍ట్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 16 పాయింట్లను హెచ్‌డీఎఫ్‌సీ 14 పాయింట్లను, ఐటీసీ షేరు 11పాయింట్ల, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 10పాయింట్లను అందజేశాయి. అలాగే టీసీఎస్‌, ఎస్‌బీఐ, ఎల్‌ అండ్‌ టీ, హిందూస్థాన్‌ యూనిలివర్‌ షేర్లు 9 నుంచి 5పాయింట్లను ఆర్జించాయి. మారుతి సుజుకీ ఇండియా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌ లిమిటెడ్‌, బజాజ్‌ అటో, టెక్‌ మహీంద్రా, ఐఓసీ, ఏషియన్‌ పేయింట్స్‌, టాటామోటర్స్‌, అల్టా‍్రటెక్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, గెయిల్‌ షేర్లు దాదాపు 4 నుంచి 2 పాయింట్లను అందజేశాయి.

సెన్సెక్స్‌ సాధించిన 665 పాయింట్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ 103 పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 96 పాయింట్లను, ఇన్ఫోసిన్‌ 87 పాయింట్లను, యాక్సిస్‌ బ్యాంక్‌ 60 పాయింట్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 52 పాయింట్లను సమకూర్చాయి.  కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 46 పాయింట్లు, ఐటీసీ 45 పాయింట్లు, టీసీఎస్‌ 31 పాయింట్లు, ఎస్‌బీఐ బ్యాంక్‌ 25 పాయింట్లు, ఎల్‌అండ్‌టీ 23 పాయింట్లు, హిందూస్థాన్‌ యూనిలివర్‌ షేర్లు 20పాయిం‍ట్లను అందజేశాయి.



You may be interested

బడ్జెట్‌ రోజు బెట్టింగ్‌ ఎందులో...?

Friday 1st February 2019

బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్లో రంగాల వారీగా కంపెనీల షేర్ల ధరల్లో భారీ హెచ్చు తగ్గులు చోటు చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసకునే నిర్ణయాలు ఇందుకు కారణం అవుతాయి. కొన్నింటికి పాజిటివ్‌గా, కొన్ని రంగాలకు నెగెటివ్‌గా, మరికొన్నింటికి తటస్థమైన నిర్ణయాలు బడ్జెట్‌లో ఉంటుంటాయి. ఈ నిర్ణయాల ఆధారంగా ఆ రోజు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పొజిషన్లకు మొగ్గు చూపుతుంటారు. మరి ఈ దఫా కేంద్రంలోని మోదీ సర్కారు లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న

ఏప్రిల్‌ నాటికి నిఫ్టీ@12,000!

Thursday 31st January 2019

సంజీవ్‌ భాసిన్‌, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఫిబ్రవరిలో నిఫ్టీ 11000- 11200 పాయింట్ల వరకు, ఏప్రిల్‌నాటికి దాదాపు 12,000 పాయింట్ల వరకు దూసుకుపోవచ్చని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి సంజీవ్‌ భాసిన్‌ అంచనా వేశారు. దేశీయ మార్కెట్‌పై పాజిటివ్‌గా ఉన్నామన్నారు. కొన్ని కంపెనీల ఫలితాలు పేలవంగా ఉన్నా, కొన్ని నెగిటివ్‌ వార్తలు చుట్టుముట్టినా ఇవన్నీ రాబోయే బుల్‌ర్యాలీలో సమసిపోతాయన్నారు. ఏప్రిల్‌ నాటికి కొత్త గరిష్ఠాలను చూస్తామని అభిప్రాయపడ్డారు. ఈ దఫా ర్యాలీలో మిడ్‌క్యాప్స్‌, కొన్ని

Most from this category