STOCKS

News


ప్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

Wednesday 11th July 2018
Markets_main1531306073.png-18210

మరోసారి తెరపైకి ట్రేడ్‌వార్‌ భయాలు
సూచీలకు అండగా టీసీఎస్‌

వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో బుధవారం మార్కెట్‌ దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్‌ 26 పాయింట్లు లాభంతో 36,266 వద్ద, నిఫ్టీ 1 పాయింటు పెరిగి 10,948 వద్ద ముగిశాయి. చైనా నుంచి దిగుమతిమయ్యే 200 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై అమెరికా తాజాగా మరో 10శాతం సుంకాలను పెంచనున్నట్లు స్పష్టం చేసింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా బలహీన సంకేతాలు నెలకొనడంతో ట్రేడింగ్‌ తొలిదశలో స్వల్ప హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ,  హెవీ వెయిట్‌ షేర్లైన టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, షేర్ల అండతో సూచీలు...మరో ఐదు నెలల కొత్త గరిష్టస్థాయికి చేరాయి. సెన్సెక్స్‌ 120 పాయింట్లకుపైగా లాభపడి 36,362 పాయింట్ల వద్దకు, నిఫ్టీ 30 పాయింట్లకుపైగా పెరిగి 10,977 పాయింట్ల వద్దకు చేరాయి. అయితే అటు తర్వాత యూరప్‌ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభంకావడం, అమెరికా ఫ్యూచర్లు క్షీణతతో ట్రేడ్‌కావడంతో మన సూచీలు చివరకు ఇంట్రాడే లాభాల్ని చాలావరకూ కోల్పోయాయి. టీసీఎస్‌ సాయంతో ఐటీ రంగ షేర్లు, హిందూస్థాన్‌ యూనిలివర్‌ అండతో ఎఫ్‌ఎంజీసీ రంగ షేర్లు లాభాల్లో ముగియగా, ట్రేడ్‌ వార్‌ భయాలతో మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టపోయాయి. అత్యధికంగా మెటల్‌ షేర్ల నష్టపోయాయి. కీలకమైన నిఫ్టీ బ్యాంకు 78 పాయింట్లు నష్టపోయి 26,816 వద్ద ముగిసింది.
ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడిదుడుకులే..!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ట్రేడ్‌ వార్‌ నేపథ్యంలో నేటి ఉదయం దేశీ మార్కెట్‌ స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 59 పాయింట్లు లాభంతో 36299 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 10,956 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే మన మార్కెట్‌ ఓపెనింగ్‌ సమయానికి వాణిజ్య యుద్ధ భయాలతో ఆసియా మార్కెట్లు నష్టాల ట్రేడింగ్‌ మన సూచీలపై ప్రభావాన్ని చూపాయి. పలితంగా దేశీయ మార్కెట్‌ నష్టాల బాట పట్టింది. అయితే ఇన్వెస్టర్లు క్యూ1 ఫలితాల ఆశాజనకంగా ఉండంటంతో పాటు  టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ లాభాల ట్రేడింగ్‌ మార్కెట్‌ను తిరిగి లాభాల వైపు నడిపించాయి.

సూచీలకు అండగా టీసీఎస్‌:- 

తొలి త్రైమాసిక ఫలితాల సీజన్‌కు అదిరిపోయే ఆరంభానిచ్చిన ఐటీ దిగ్గజం టీసీఎస్‌ షేరు నేటి ఇంట్రాడేలోనూ మార్కెట్‌కు అండగా నిలిచింది. అద్భుతమైన ఆర్థిక ఫలితాల ప్రకటనతో ఇన్వెస్టర్లు ఇంట్రాడేలో టీసీఎస్‌ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా టీసీఎస్‌ షేరు 6 శాతానికి లాభపడి రూ.1995.00ల వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. ఈ ‍క్రమంలో ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.7.55 లక్షల కోట్లకు చేరింది. ట్రేడ్‌వార్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బలహీనమైన సంకేతాలతో తీవ్ర బడిదుడుకులను ఎదుర్కోంటున్న మన మార్కెట్‌కు అండగా నిలిచింది. నేటి సెన్సెక్స్‌ 192 పాయింట్ల రేంజ్‌ ట్రేడింగ్‌లో 103 పాయింట్లు ఒక్క టీసీఎస్‌ షేరువి కావడం విశేషం. ట్రేడింగ్‌ ఆద్యంతం మార్కెట్‌కు అండగా నిలిచిన టీసీఎస్‌ చివరకు గత ముగింపు(రూ.1877)తో పోలిస్తే 5.50శాతం లాభపడి రూ.1979.60ల వద్ద ముగిసింది.
టాటామోటర్స్‌, వేదాంత, హిందాల్కో, కోల్‌ ఇండియా, యూపీఎల్‌ షేర్లు 3నుంచి 5శాతం నష్టపోగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హిందూస్థాన్‌ యూనీలివర్‌, బజాజ్‌ అటో, ఇన్ఫ్రాటెల్‌, టీసీఎస్‌ షేర్లు 1నుంచి 5శాతం లాభపడ్డాయి.

 



You may be interested

ఫారెక్స్‌ సేవల్లోకి పేటీఎం

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీ ‘పేటీఎం’ తాజాగా ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ సేవల్లోకి అడుగుపెట్టింది. 20 అంతర్జాతీయ కరెన్సీల్లో మల్టీ కరెన్సీ ఫారెక్స్‌ కార్డ్‌, ఫారెక్స్‌ క్యాష్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం కస్టమర్లు ఈ సేవలను సంస్థ వెబ్‌సైట్‌లో మాత్రమే పొందగలరు. త్వరలోనే పేటీఎం యాప్‌లో కూడా అందుబాటులోకి వస్తాయి. కేవలం 2 శాతం (ఆర్డర్‌ విలువలో) పాక్షిక చెల్లింపుతో ప్రస్తుత ఎక్స్చేంజ్‌ రేట్లను లాక్‌ చేసుకుని ఆర్డర్‌

కన్సూమర్‌ షేర్లపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషణ

Wednesday 11th July 2018

ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ కంపెనీల ఫలితాలు ఆకర్షణీయంగా ఉండేందుకు అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ విశ్లేషించింది. దేశీయ అమ్మకాలు బలంగా ఉన్నాయని, అంతర్జాతీయంగా కూడా మెరుగుదల నమోదవుతుందని వివరించింది. హెచ్‌యూఎల్‌, బ్రిటానియా అవుట్‌పెర్ఫార్మ్‌ చేసేందుకు అవకాశం ఉందని విశ్లేషించింది. ఐటీసీ క్యూ1 ఫలితాలుపై యావరేజ్‌ అవుట్‌లుక్‌ ఇచ్చిన బ్రోకింగ్‌ సంస్థ.. సిగరెట్‌ అమ్మకాలు, ఎఫ్‌ఎమ్‌సీజీ ఎబిటా మార్జిన్లతో పాటు అగ్రి, హోటల్‌ వ్యాపారం ప్రధాన అంశాలుగా

Most from this category