గ్యాప్‌అప్‌తో ఆరంభం..
By Sakshi

ఇండియన్ స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 34,733 పాయింట్లతో పోలిస్తే 238 పాయింట్ల లాభంతో 34,971 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,472 పాయింట్లతో పోలిస్తే 52 పాయింట్ల లాభంతో 10,524 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు రెండూ వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 9:31 సమయంలో సెన్సెక్స్ 29 పాయింట్ల నష్టంతో 34,705 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 10,457 వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్ శుక్రవారం రీబౌండ్ అయ్యి లాభాల్లో ముగియడం, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాల్లో ట్రేడవుతుండటం, ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధి రేటు 4.3 శాతంగా నమోదవ్వడం, సెప్టెంబర్‌లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.77 శాతంగా ఉండటం, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి శుక్రవారం ఒకేరోజు 55 పైసలు లాభపడి 73.57 వద్ద ముగియడం, సౌదీ విలేకరి అదృశ్యం నేపథ్యంలో నెలకొన్న భూగోళ రాజకీయ ఉద్రిక్తతలు సరఫరాపైన ఆందోళనలు పెంచడంతో క్రూడ్ ధరలు సోమవారం పెరగడం, దేశీ ఫారెక్స్ నిల్వలు అక్టోబర్ 5వ తేదీతో ముగిసిన వారంలో 915.8 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 399.6 బిలియన్ డాలర్లకు క్షీణించడం, విదేశీ ఇన్వెస్టర్లు ప్రస్తుత నెల తొలి రెండు వారాల కాలంలో ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ.26,600 కోట్ల నిధులను వెనక్కు తీసుకెళ్లడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని నిపుణులు పేర్కొన్నారు. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగానే ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ ఐటీ 1 శాతానికిపైగా పెరిగాయి.
You may be interested
సోమవారం వార్తల్లోని షేర్లు
Monday 15th October 2018వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఐఎల్&ఎఫ్ఎస్ ఇంజనీరింగ్స్ అండ్ కార్పోరేషన్:- కంపెనీ డెరెక్టర్‌గా సీఎస్ రాజన్‌ను నియమితులయ్యారు. నాట్కో ఫార్మా:- కోపాక్సోన్ ఔషధాలపై కంపెనీ ఎలాంటి పేటెంట్ రైట్స్ లేవని యూఎస్ కోర్టు తీర్పు వెల్లడించింది. నితేశ్ ఎస్టేట్స్:- తన అనుబంధ సంస్థ నితేశ్ పూణే మాల్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని 100శాతం వాటాను ఏబీఎల్ గ్రూప్‌కు విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పీవీఆర్:- చెన్నైలోని పీవీఆర్ ఐకాన్‌లో 10 మల్టీఫ్లెక్స్ స్క్రీన్స్లను ప్రారంభించింది. దన్షిక
మార్కెట్ ఎటు?
Monday 15th October 2018సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. అమెరికా మార్కెట్ రీబౌండ్ అయ్యింది. శుక్రవారం లాభాల్లో ముగిసింది. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ ఏకంగా 287 పాయింట్ల (1.15 శాతం) లాభంతో 25,340 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 500.. 39 పాయింట్ల (1.42 శాతం) లాభంతో 2,767 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్డాక్ కంపొసిట్ 168 పాయింట్ల (2.29 శాతం) లాభంతో 7,496 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే వారం