STOCKS

News


కీలక మద్దతు 35,120

Monday 10th December 2018
Markets_main1544417752.png-22795

ట్రేడ్‌ వార్‌ ముగింపునకు అమెరికా-చైనాల మధ్య ఒప్పందం కుదిరినా, ఆ డీల్‌ పట్ల మార్కెట్లకు ఏర్పడిన సందేహాలుతో పాటు చైనా ఫోన్ల కంపెనీ హువాయ్‌ సీఎఫ్‌ఓను అమెరికా ప్రోద్భలంతో కెనడా అరెస్టు చేసినందున, గతవారం ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. గత వారాంతంలో అమెరికా సూచీలు కేవలం మూడు ట్రేడింగ్‌ సెషన్లలో 6 శాతం వరకూ పడిపోవడం ఆందోళనకారకం. ఈ నేపథ్యంలో మన దేశంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఫలితాలు...నరేంద్ర మోదీకి పూర్తిసానుకూలంగా వుంటే తప్ప, మన మార్కెట్‌ ప్రపంచ ట్రెండ్‌నే అనుసరించవచ్చు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, 

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
డిసెంబర్‌ 7తో ముగిసిన వారంలో తొలిరోజున 36,466 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ..అటుతర్వాత గత మార్కెట్‌ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా 35,277 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంత క్రితం వారంతో పోల్చితే 521 పాయింట్ల నష్టంతో 35,673 పాయిం‍ట్ల​వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్‌ భారీగా నష్టపోయిన ప్రభావం....ఎగ్జిట్‌ పోల్స్‌..అటుపై ఎన్నికల ఫలితాలు వెలువడనున్న  నేపథ్యంలో ఈ వారం గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 50 రోజుల చలన సగటు రేఖ కదులుతున్న 35,120 పాయింట్ల సమీపంలో కీలక మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును పరిరక్షించుకున్నా, ప్రారంభ క్షీణత నుంచి కోలుకున్నా 35,780 పాయింట్ల వద్ద కీలక అవరోధం కలగవచ్చు. ఈ వారంలో మార్కెట్‌ దిశను నిర్దేశించేవి ఈ స్థాయిలే. 35,780 పాయింట్లపైన ముగిస్తే వేగంగా 36,240 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై తిరిగి 36,460 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. తొలి అవరోధస్థాయిపైన ముగియలేకపోయినా, తొలి మద్దతును కోల్పోయినా...34,900 పాయింట్ల వద్ద మరో మద్దతు లభిస్తున్నది. ఈ లోపున 34,600-34,280 పాయింట్ల శ్రేణి వరకూ పతనం కొనసాగవచ్చు. 

నిఫ్టీ కీలక మద్దతు 10,570
గతవారం 10,941 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గత కాలమ్‌లో సూచించిన రీతిలో 10,588 పాయింట్ల వద్దకు పడిపోయింది. చివరకు అంతక్రితంవారంకంటే 183 పాయింట్ల నష్టంతో 10,694 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీకి ఈ వారం కీలక మద్దతుస్థాయి 10,570 పాయింట్లుకాగా, కీలక అవరోధస్థాయి 10,750 పాయింట్లు. ఈ వారం 200 డీఎంఏ అయిన 10,750 పాయింట్ల స్థాయిపైన ముగిస్తే 10,840 పాయింట్ల వరకూ వేగంగా పెరగవచ్చు. అటుపై 10,940 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. 50 డీఎంఏ అయిన 10,570 పాయింట్ల మద్దతు కోల్పోతే వెనువెంటనే 10,510 పాయింట్ల వద్దకు క్షీణింవచ్చు. ఈ లోపున 10,400-10,320 పాయింట్ల శ్రేణిని పరీక్షించవచ్చు. 
 You may be interested

డైవర్సిఫికేషన్‌ కోసం ఎన్ని ఫండ్స్‌ ఉండాలి ?  

Monday 10th December 2018

ప్ర: బ్యాంక్‌ నుంచి గృహ రుణం తీసుకొని ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను.  ఈఎమ్‌ఐ ఎంత ఉండాలి? ఎంత మొత్తానికి రుణం తీసుకోవాలి  తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి  ఏఏ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి ? -శ్రీధర్‌, విశాఖపట్టణం  జ: బ్యాంక్‌ నుంచి గృహ రుణం తీసుకునేటప్పుడు ముఖ్యంగా మూడు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. గృహ రుణం ద్వారా మీరు కొనుగోలు చేసే ఇల్లు వల్ల అద్దె డబ్బులు ఆదా అవుతాయా? లేదా అనే విషయాన్ని

నోట్ల రద్దు సరిగ్గా అమలు కాలేదు

Monday 10th December 2018

ముంబై: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా.. మోదీ ప్రభుత్వంపై అసంతృప్తి సెగలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ప్రముఖ బ్యాంకర్‌ ఉదయ్‌ కోటక్‌ కూడా దీనిపై గళమెత్తారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని సరిగ్గా అమలు చేయలేదని.. దీన్ని మెరుగైన ప్రణాళికతో చేసిఉంటే ఫలితాలు విభిన్నంగా ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ‘డీమో’పై

Most from this category