STOCKS

News


డిసెంబరుకల్లా 42,000 స్థాయికి సెన్సెక్స్‌

Thursday 7th March 2019
Markets_main1551954976.png-24473

మోర్గాన్‌స్టాన్లీ అంచనా

జీడీపీ డేటాతో సహా ఆర్థిక గణాంకాలన్నీ నిరుత్సాహకరంగా వున్నా, ఇండో–పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినా కీలకమైన స్థాయిల్ని సూచీలు పరిరక్షించుకున్నాయని, ఇప్పుడు ఎన్నికల ముందస్తు ర్యాలీ జరుగుతున్నదని నిపుణులు చెపుతున్నారు. నెలరోజుల తర్వాత ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కీలకమైన 11,000 స్థాయిని అధిగమించి, మూమెంటమ్‌ కనపరుస్తుందని, ఎన్నికలకు ముందుగానే మరిన్ని అవరోధాల్ని సూచీలు అధిగమిస్తాయని వారు అంచనావేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా సెన్సెక్స్‌ 42,000 పాయింట్ల స్థాయికి చేరుతుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అంచనావేసింది. లోక్‌సభ ఎన్నికల్లో బలమైన ఫలితం వస్తుందన్న అంచనాల్ని వచ్చే కొద్దిరోజుల్లో మార్కెట్‌ డిస్కౌంట్‌చేసుకుంటూ ర్యాలీ సాగిస్తుందని మోర్గాన్‌స్టాన్లీ విశ్లేషకుడు రిథమ్‌ దేశాయ్‌ చెప్పారు. 2020 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ లాభాలు 29 శాతం మేర వృద్ధిసాధిస్తాయని, ఈ రాబడులకు అనుగుణంగా సెన్సెక్స్‌ ఈ ఏడాది డిసెంబర్‌కల్లా 42,000 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చని ఆయన అంచనావేశారు. మార్కెట్‌ ర్యాలీ విస్త్రతంగా వుంటుందని, సూచీల్లోని షేర్లను ఇతర షేర్లు అవుట్‌పెర్‌ఫార్మ్‌ చేస్తాయని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. బ్యాంకులు, వినియోగరంగం, ఇండస్ట్రియల్స్‌ రంగాల షేర్లు బావుంటాయని మోర్గాన్‌స్టాన్లీ పేర్కొంది. ఇంద్రప్రస్థ గ్యాస్, అపోలో హాస్పిటల్స్, సైయ్యంట్, ఇప్కాల్యాబ్, ఇండియన్‌ హోటల్స్, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్, జుబిలెంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ను తమ టాప్‌ మిడ్‌క్యాప్‌ బెట్స్‌గా మోర్గాన్‌స్టాన్లీ ప్రకటించింది. 
 



You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ

Thursday 7th March 2019

బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంజీసీ, ఆర్థిక రంగ షేర్ల అండతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ వరుసగా 4వరోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 89పాయింట్లు పెరిగి 36,725 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 11,058 వద్ద ముగిసింది. ఈ నాలుగురోజుల్లో సెన్సెక్స్‌ 850 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ 266 పాయింట్లను ఆర్జించింది.  ప్రపంచమార్కెట్లలో ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ.., ముడిచమురు ధరలు పతనం, రూపాయి ర్యాలీ, దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడుల ప్రవాహం పెరగడం

ఆగని ర్యాలీ...70 స్థాయికి రూపాయి

Thursday 7th March 2019

డాలర్‌ మారకంలో రూపాయి ర్యాలీ కొనసాగుతూనే ఉంది. ఫారెక్స్‌ మార్కెట్లో గురువారం ఇంట్రాడేలో మరో 33పైసలు బలపడింది. నేడు రూపాయి గత ముగింపు(70.27)తో పోలిస్తే 19 బలపడి 70.08 వద్ద ప్రారంభమైంది. అమెరికా క్రూడాయిల్‌ ఉత్పత్తి, నిల్వలు రికార్డు చేరుకోవడంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల క్షీణించడటం, ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనత, దేశీయ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో పాటు భారత్‌-పాక్‌ల మధ్య యుద్ధ

Most from this category