STOCKS

News


ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్‌

Wednesday 11th July 2018
Markets_main1531282386.png-18195

  • 26,919 వద్ద బ్యాంక్‌ నిఫ్టీ
  • ఒక శాతం లాభంతో ఐటీ
  • 1.40 శాతం నష్టాల్లో నిఫ్టీ మెటల్‌

ముంబై: దేశీయ స్టాక్‌ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 13 పాయింట్లు నష్టపోయి 36,226 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 9 పాయిం‍ట్లు నష్టపోయి 10,938 వద్ద ప్రారంభమయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో నష్టాలతోనే మొదలైనప్పటికీ.. క్రమంగా పుంజుకున్న సూచీలు 9 గంటల 40 నిమిషాల సమయానికి స్వల్ప లాభాలను నమోదుచేశాయి. ఈ సమయానికి నిఫ్టీ 16 పాయింట్లు (0.15 శాతం) లాభపడి 10,963 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయానికి సెన్సెక్స్‌ 60 పాయింట్లు (0.17 శాతం) లాభపడి 36,299 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ ఇండీసెస్‌లో ఐటీ అత్యధికంగా ఒక శాతం లాభాల్లో ట్రేడవుతుండగా.. రియల్టీ 0.36 శాతం, ప్రైవేట్‌ బ్యాంక్‌ 0.15 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఫ్లాట్‌గా 26,919 వద్ద ట్రేడవుతోంది. నష్టపోతున్న రంగాలలో మెటల్‌ అత్యధికంగా 1.41 శాతం నష్టాల్లో ఉండగా.. పీఎస్‌యూ బ్యాంక్‌ 0.48 శాతం, ఫార్మా 0.38 శాతం, ఆటో 0.14 శాతం, ఎఫ్‌ఎమ్‌సీజీ 0.12 శాతం నష్టాల్లో ఉన్నాయి. 

అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా స్టాక్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. డోజోన్స్‌ 0.58 శాతం లాభాల్లో ముగియగా.. నాస్‌డాక్‌ 0.04 శాతం లాభపడింది. ఎస్‌ అండ్‌ పీ 0.35 శాతం లాభాల్లో ముగిసింది. మన మార్కెట్‌ ప్రారంభసమయానికి ఆసియా మార్కెట్లు ఒక శాతానికి మించి నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనా స్టాక్‌ సూచీ షాంఘై కాంపోజిట్‌ ఇండెక్స్‌ 1.87 శాతం నష్టాల్లో ఉండగా.. జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 1.08 శాతం నష్టాల్లో ట్రేడవుతోంది. హాంగ్‌కాంగ్‌ సూచీ హాంగ్‌ సెంగ్‌ 1.44 శాతం నష్టాల్లో ఉంది.



You may be interested

5 పైసలు బలహీనపడిన రూపాయి

Wednesday 11th July 2018

10 గంటల సమయానికి 68.83 వద్ద ట్రేడింగ్‌ ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ ఎక్స్ఛేంజ్‌లో 9 గంటల సమయానికి రూపాయి విలువ 5 పైసలు నష్టపోయి 68.87 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. మరోసారి 69 దిశగా కదలాడుతోంది. బ్యాంకులు, దిగుమతిదారులు అమెరికా డాలర్లను కొనుగోలు చేసేందుకు క్యూ కట్టిన నేపథ్యంలో రూపాయి మారకం విలువ కోల్పోయిందని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు

పన్ను రిటర్నుల్లో ఈ ఆదాయాన్ని విస్మరించొద్దు

Wednesday 11th July 2018

ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారిలో చాలా మంది తమకు వచ్చే కొన్ని ఆదాయాలను రిటర్నుల్లో వెల్లడించరు. బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ, బాండ్లు, పలు పోస్టాఫీసు పథకాలపై వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ‘ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌’ అనే సెక్షన్‌లో ఈ ఆదాయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. కానీ రిటర్నులు దాఖలు చేసే వారిలో 80 శాతం మంది ఈ ఆదాయాన్ని చూపించకపోవడం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తోంది.

Most from this category