STOCKS

News


37,585 మద్దతు కీలకం

Monday 13th August 2018
news_main1534136859.png-19206

ఇక్కడి నిఫ్టీ-50...అమెరికా బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ ఎస్‌ అండ్‌ పీ-500 ఇండెక్స్‌ను అనుసరిస్తున్నట్లు గత కొద్దివారాల ట్రెండ్‌ స్పష్టంచేస్తున్నదని, ఆ సూచీలో తీవ్రమైన కరెక‌్షన్‌ వస్తేనే..మన మార్కెట్‌ కూడా పతనమయ్యే ప్రమాదం వుంటుందని భావించాల్సివుంటుంటూ గత కాలమ్‌లో సూచించాం. క్రితం వారం ఎస్‌ అండ్‌ పీ-500 వరుసగా మూడురోజులపాటు కొత్త గరిష్టస్థాయిని తాకడానికి చేసిన ప్రయత్నాలు విఫలంకావడంతో శుక్రవారం 20 పాయింట్లు నష్టపోయింది. అంటే...అమెరికా ప్రధాన సూచీలో డబుల్‌టాప్‌ సంకేతాలు కన్పిస్తున్నట్లు పరిగణించవచ్చు. మరి నిఫ్టీ కూడా ఇదే ట్రెండ్‌ను ఈ వారం అనుసరిస్తుందా...లేదా అనేది సాంకేతికంగా కీలకాంశం. మరోవైపు ఎస్‌బీఐ ఫలితాల వెల్లడితో దాదాపు ప్రధాన కంపెనీల ఫలితాల సీజన్‌ ముగిసినట్లే. మొత్తంమీద ఫలితాలు నిరుత్సాహపర్చనప్పటికీ, రూపాయి విలువ, ప్రపంచ ట్రెండ్‌ ప్రభావమే మన మార్కెట్‌పై అధికంగా వుంటుందన్నది అనలిస్టుల అంచనా. ఇక మన ప్రధాన సూచీల సాంకేతికాంశాలు ఇలా వున్నాయి.... 

సెన్సెక్స్ సాంకేతికాలు..
ఆగస్టు 10తో ముగిసిన వారంలో గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించినట్లు 37,720 పాయింట్ల స్థాయిని దాటినంతనే వేగంగా 38, 076 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. అటుతర్వాత కరెక‌్షన్‌కు లోనైనా,  చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 213 పాయింట్లు లాభపడి 37,869 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం ప్రపంచ ట్రెండ్‌కు అనుగుణంగా మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 37,585 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ కీలకమైన స్వల్పకాలిక మద్దతు దిగువన ముగిస్తే 37,320 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 37,135-37,060  పాయింట్ల శ్రేణి వరకూ క్షీణించవచ్చు. సమీప భవిష్యత్తులో తొలి మద్దతును పరిరక్షించుకోగలిగితే తిరిగి 38,050 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిని సైతం ఛేదిస్తే 38,150-38,250 పాయింట్ల శ్రేణి వరకూ పెరగవచ్చు. 

నిఫ్టీ కీలక మద్దతు11,360 ...
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ గత కాలమ్‌లో సూచించిన రెండో నిరోధం సమీపస్థాయి 11,495 వద్దకు చేరిన తర్వాత స్వల్ప దిద్దుబాటుకు లోనై చివ‌ర‌కు 11,429 పాయింట్ల వద్ద ముగిసింది. అంత‌క్రితం వారంతో పోలిస్తే 68 పాయింట్లు లాభపడింది. గత శుక్రవారం అమెరికా సూచీలు క్షీణించిన నేపథ్యంలో ఈ సోమవారం మార్కెట్‌ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే నిఫ్టీకీ 11,360 పాయింట్ల సమీపంలో కీలక మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోయి, ముగిస్తే 11, 295 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే  క్రమేపీ 11,210-11,185 శ్రేణి (జూలై 27 నాటి గ్యాప్‌అప్‌ శ్రేణి) వరకూ తగ్గవచ్చు. ఈ వారం తొలి మద్దతును పరిరక్షించుకోగలిగితే మరోదఫా 11,495 పాయింట్ల వరకూ పెరగవచ్చు. . ఈ స్థాయిని కూడా ఛేదించగలిగితే 11,540 పాయింట్ల వరకూ పెరిగే ఛాన్స్‌ వుంటుంది. You may be interested

స్వల్ప కాల పెట్టుబడుల కోసం ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ షార్ట్‌టర్మ్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌

Monday 13th August 2018

సెబీ ఆదేశాల మేరకు షార్ట్‌ డ్యురేషన్‌ కేటగిరీ ఫండ్స్‌ ఏడాది నుంచి మూడేళ్లు కాల వ్యవధి కలిగిన డెట్‌ సెక్యూరిటీల్లోనే ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. పెద్దగా రిస్క్‌ తీసుకోని వారు, స్వల్ప స్థాయి నుంచి మోస్తరు రిస్క్‌ను తట్టుకునేవారు, ఏడాది నుంచి మూడేళ్ల కాల వ్యవధి కోసం పెట్టుబడుల కోసం షార్ట్‌ డ్యురేషన్‌ లేదా షార్ట్‌ టర్మ్‌ అపార్చునిటీస్‌ పథకాలను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ షార్ట్‌

మరింత మెరుగుపడనున్న ఆర్థిక వృద్ధి

Monday 13th August 2018

న్యూఢిల్లీ: దేశీయంగా డిమాండ్‌తో పాటు పెట్టుబడులూ మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో భారత ఆర్థిక వృద్ధి మరింత మెరుగుపడగలదని పరిశ్రమలపై నిర్వహించిన సీఐఐ-ఆస్కాన్ సర్వేలో వెల్లడైంది. మెరుగైన వర్షపాతం, ఒక మోస్తరు ద్రవ్యోల్బణం, పండుగల సీజన్ మొదలైన సానుకూల అంశాలతో వినియోగం పెరుగుతుందని.. డిమాండ్‌, పెట్టుబడుల రికవరీకి ఇది తోడ్పడనుందని సర్వే నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 70

Most from this category