STOCKS

News


కీలకస్థాయి 38,525 పాయింట్లు

Monday 10th September 2018
Markets_main1536556517.png-20109

ఇతర దేశాల సూచీలతో పోలిస్తే కొద్దివారాల నుంచి పటిష్టమైన అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తూ కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్న భారత్‌, అమెరికా సూచీలు, మొత్తంమీద గతవారం కుదుపునకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో చైనాపై ట్రేడ్‌వార్‌ను తీవ్రతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు మరో 267 బిలియన్‌ డాలర్ల సుంకాల్ని విధిస్తామని గత శుక్రవారం ప్రకటించడం, ఈ నెలాకర్లో జరిగే సమీక్షా సమావేశంలో మరోదఫా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపునకు మార్గం సుగమం చేస్తూ పటిష్టమైన అమెరికా జాబ్స్‌ వెలువడటం జరిగింది. ఇటువంటి ప్రతికూలాంశాల నడుమ కూడా భారత్‌, అమెరికా మార్కెట్లు ఇప్పటివరకూ ర్యాలీ సాగిస్తూ వచ్చాయి. ఇక ముందు కూడా ఈ ట్రెండ్‌ కొనసాగుతుందా? లేదా అనేది ఈ వారం తేటతెల్లంకాగలదు. అలాగే మన మార్కెట్లో కరెక్షన్‌ జరగాలంటే ముందుగా హెవీవెయిట్‌ షేర్ల ర్యాలీ నిలిచిపోవాలని, అటుతర్వాత అవి ఒక్కొటొక్కటే తగ్గుతూ వుంటేనే మార్కెట్‌ క్షీణించే ప్రమాదం వుంటుందని గత కాలమ్స్‌లో ప్రస్తావించాం. క్రితంవారం హెవీవెయిట్‌ షేర్లు పెద్దగా ముందడుగు వేయలేకపోయాయి. అవి ఈ వారం వ్యవహరించే తీరు..మన సూచీల ట్రెండ్‌ను నిర్దేశించవచ్చు. ఇక మన ప్రధాన సూచీల సాంకేతికాంశాలు ఇలా వున్నాయి.... 

సెన్సెక్స్ సాంకేతికాలు..
సెప్టెంబర్‌ 7తో ముగిసినవారం తొలిరోజున బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 38,934 గరిష్టస్థాయిని నమోదుచేసినంతనే కేవలం మూడు రోజుల్లో 37,774 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. అటుతర్వాత వేగంగా కోలుకుని 38,390 పాయింట్ల వద్ద ముగిసింది. అంతక్రితంవారంతో పోలిస్తే 255 పాయింట్ల నష్టపోయింది. ఈ వారం సెన్సెక్స్‌కు 38,525 పాయింట్ల స్థాయి కీలకమైనది. గతవారంలో జరిగిన పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 38,525 పాయింట్లను అధిగమిస్తే మరోమారు 38,980 పాయింట్ల గరిష్ఠాన్ని చేరే ఛాన్స్‌ వుంటుంది. మధ్యలో 38,700 పాయింట్ల వద్ద చిన్నపాటి అవరోధం ఏర్పడవచ్చు. ఈ వారం తొలి కీలకస్థాయిని దాటలేకపోయినా, గ్యాప్‌డౌన్‌తో మొదలైనా 38,320-38,250 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ లోపున 38,060 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే మరోదఫా 37,770 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.  

నిఫ్టీ కీలక అవరోధం 11,620
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ గతవారం 11,752 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 11,394 పాయింట్ల కనిష్టస్థాయి వద్దకు పతనమయ్యింది. అటుతర్వాత నష్టాల్లో కొంతవరకూ పూడ్చుకుని 11,589 పాయింట్ల వద్ద ముగిసింది. వారంలో మొత్తంమీద 101 పాయింట్లు నష్టపోయింది.  ఈ వారం మార్కెట్‌ రికవరీ కొనసాగితే నిఫ్టీకి 11,620 పాయింట్ల వద్ద కీలక నిరోధం కలుగుతున్నది. గతవారపు పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి అయిన 11,620 పాయింట్లను దాటితే 11,680 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. అటుపైన తిరిగి 11,750 పాయింట్ల స్థా
యిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, గ్యాప్‌డౌన్‌తో మొదలైనా, 11,560-11,540 శ్రేణి మధ్య తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 11,480 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ స్థాయిని సైతం ముగింపులో కోల్పోతే, తిరిగి 11,390 పాయింట్ల వద్దకు పతనంకావొచ్చు. You may be interested

ఈ స్టాక్స్‌ కొనొచ్చు

Monday 10th September 2018

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.92 టార్గెట్‌ ధర: రూ.120 ఎందుకంటే:  రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థల కోసం భారత రక్షణ శాఖ కొత్త ధరల నిర్ణాయక విధానాన్ని రూపొందించింది. రక్షణరంగ పీఎస్‌యూల సమర్థతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ విధానాన్ని రక్షణ శాఖ రూపొందించింది. నామినేషన్‌ ప్రాతిపదికగా లభించిన ప్రాజెక్ట్‌లో మార్జిన్లను 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. ఈ  కొత్త ధరల నిర్ణాయక విధాన

1200 దిగువన పసిడి

Monday 10th September 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం 1200 డాలర్ల దిగువున ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియా మార్కెట్లో భారతవర్తమాన కాలం గం.10:15ని.లకు ఔన్స్‌ పసిడి 2.20 డాలర్లు నష్టపోయి రూ.1,197.90 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  చైనా-అమెరికా దేశాల మధ్య వీడని వాణిజ్య యుద్ధ భయాలు, అమెరికాలో ఆగస్ట్‌లో అంచనాలకు మించి ఉద్యోగ కల్పన జరగడంతో డాలర్‌ బలపడింది. నేడు ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌  95.44 వద్ద

Most from this category