News


సెన్సెక్స్‌ తక్షణ అవరోధం 40,030

Monday 10th June 2019
Markets_main1560149774.png-26193

మార్కెట్‌ అంచనాల్ని మించి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిప్పటి నుంచి స్టాక్‌ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్నప్పటికీ, ఆ రికార్డుస్థాయికి ఒక్కరోజుకూడా నిలుపుకోలేక అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో మూడు దఫాలు రికార్డుస్థాయికి చేరిన తర్వాత వెనువెంటనే 2-3 శాతం మేర పతనాల్ని చవిచూసాయి. గతవారం రిజర్వుబ్యాంక్‌ వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత కూడా ఎన్‌బీఎఫ్‌సీల లిక్విడిటీ సంక్షోభం మార్కెట్‌ క్షీణతకు కారణమయ్యింది. ఇదేతరహా ట్రెండ్‌ మరికొద్దిరోజులు కొనసాగవచ్చని టెక్నికల్‌ చార్టులు వెల్లడిస్తున్నాయి. ఈ వారం సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... 

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
జూన్‌ 7తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్‌వారంలో మరో కొత్త రికార్డుస్థాయి 40,312 పాయింట్ల వరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌..అటుతర్వాత 39,280 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 98 పాయింట్ల నష్టంతో 39,616 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మే 31తో ముగిసినవారంలో 2 శాతం శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకాగా, ఈ ఒడిదుడుకుల శ్రేణి గతవారం 3 శాతానికి పెరిగింది. ఈ వారం కూడా ఇదేతరహాలో హెచ్చుతగ్గులకు లోనైతే తొలుత 40,030 పాయింట్లస్థాయి అవరోధం కల్పించవచ్చు. అటుపైన ముగిస్తే మరోదఫా 40,310 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఆపైన ముగింపు 40,650 పాయింట్ల స్థాయికి చేర్చవచ్చు. ఈ వారం తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 39,300 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతుస్థాయిని ముగింపులో కోల్పోతే 38,825 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ లోపున 38,570 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. 

నిఫ్టీ తక్షణ అవరోధం 12,005
గతవారం 12,103 పాయింట్ల వద్ద మరో కొత్త రికార్డుస్థాయిని నెలకొల్పిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, అటుతర్వాత అమ్మకాల ఒత్తిడికి తలొగ్గి 11,770 పాయింట్ల వద్దకు పడిపోయింది. ఈ స్థాయి నుంచి వెనువెంటనే కొంతవరకూ కోలుకుని, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 52 పాయింట్ల నష్టంతో 11,871 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా స్టాక్‌ సూచీలు జరుపుతున్న భారీ ర్యాలీ ప్రభావంతో ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే 12,005 పాయింట్ల స్థాయి తొలుత అవరోధం కల్పించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 12,120 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపై 12,210 పాయింట్ల స్థాయి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం తొలి నిరోధస్థాయిని అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా  11,770 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభ్యమవుతున్నది. ఈ మద్దతుస్థాయిలోపున ముగిస్తే, 11,655 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు.  ఈ స్థాయిని సైతం కోల్పోతే 11,615 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. 



You may be interested

వాణిజ్య ఉద్రిక్తతలు ... ప్రపంచ ఆర్థికానికి ముప్పు

Monday 10th June 2019

జీ 20 ప్రకటన ఫుకోవా (జపాన్‌): వాణిజ్య ఉద్రిక్తతలు అధ్వానంగా మారాయని, ఇవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు అని జీ20 దేశాలు అంగీకరించాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధి ఇప్పటికే తక్కువగా ఉండగా, వాణిజ్య ఉద్రిక్తతల రిస్క్‌తో ఇది ఇంకా తగ్గిపోతుందన్న ఆందోళన జీ20 దేశాల ప్రకటనలో వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా వాణిజ్య, భౌగోళిక ఉద్రిక్తతలు తీత్రతరం అయ్యాయని, అవసరమైన తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. వాణిజ్య ఉద్రిక్తతలు

పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం కీలకం

Monday 10th June 2019

వాణిజ్య యుద్ధ భయాలు, క్రూడాయిల్‌ ధరలూ ప్రధానమే ఈ వారం మార్కెట్లకు దిశా నిర్దేశం చేసే అంశాలు పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధాలు, క్రూడాయిల్‌ ధరలు తదితర అంతర్జాతీయ అంశాలు ఈ వారం దేశీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో నిధుల సంక్షోభ పరిస్థితులు గత వారం ఈక్విటీ మార్కెట్లను కలవరపర్చాయి. ఈ వారం కూడా ఇన్వెస్టర్లు ఈ అంశంపై దృష్టి

Most from this category