STOCKS

News


సెన్సెక్స్‌ కీలకస్థాయి 36,470

Monday 21st January 2019
Markets_main1548051307.png-23695

ఈ నెల తొలి రెండు వారాల్లో పరిమితశ్రేణిలో కదలిన ప్రపంచ ప్రధాన మార్కెట్లు...ముఖ్యంగా అమెరికా, యూరప్‌లు గతవారం బ్రేక్‌అవుట్‌ను సాధించి, ముందడుగు వేసాయి. ఇదేబాటలో భారత్‌ సూచీలు కొంత పెరిగినప్పటికీ, మూడు వారాల నిరోధాన్ని అధిగమించడంలో ఇబ్బంది పడుతున్నాయి.  అయితే ఇన్ఫోసిస్‌, ఐటీసీలకు తోడు ఇతర హెవీవెయిట్‌ షేర్లయిన టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు క్రితం వారం ర్యాలీ జరపడం ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే అంశం. మరో వారం రోజుల్లో వెల్లడికానున్న కేంద్ర బడ్జెట్లో...ప్రభుత్వ ద్రవ్యలోటును పెంచే ప్రతిపాదనలుంటాయన్న అంచనాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు వ్యవహరించే పెట్టుబడుల శైలికి అనుగుణంగా సమీప భవిష్యత్తులో మన మార్కెట్‌ కదలికలు వుండవచ్చు.  ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే,

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
జనవరి 18తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సె్‌‍క్స్‌  తొలిరోజున 35,692 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత క్రమేపీ పెరిగి చివరి మూడురోజులూ 36,470 పాయింట్ల సమీపంలో అవరోధాన్ని చవిచూసింది. చివరకు అంతక్రితంవారంకంటే 377 పాయింట్లు లాభపడి 36,387 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం వరుసగా మూడురోజులపాటు నిరోధాన్ని కల్పించిన 36,470 పాయింట్ల స్థాయి ఈ వారం కీలకమైనది. ఈ స్థాయిపైన సోమవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమై, స్థిరపడితే తొలుత 36,560 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. అటుపై ముగిస్తే 36,800-37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు.  ఈ వారం పైన ప్రస్తావించిన తొలి నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్‌ నిస్తేజంగా ప్రారంభమైనా 36,200 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 35,950 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఈ లోపున తిరిగి 35,690 పాయింట్ల స్థాయికి పరీక్షించవచ్చు.

నిఫ్టీ కీలకస్థాయి 10,930
గతవారం తొలుత 10,692 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ వారంలో చివరి మూడు రోజులూ 10,930 పాయింట్ల సమీపంలో నిరోధాన్ని ఎదుర్కొని, ముందుకు సాగలేకపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 112 పాయింట్ల లాభంతో 10,907 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీకి 10,930 పాయింట్ల స్థాయి కీలకమైనది. ఈ స్థాయిపైన మార్కెట్‌ బుల్లిష్‌గానూ, ఈ స్థాయిలోపున బేరిష్‌గానూ ట్రేడ్‌కావొచ్చు. అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో ఈ సోమవారం 10,930పైన నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలై, నిలదొక్కుకుంటే 10,985 స్థాయి వరకూ పెరిగే అవకాశం వుంది. ఈ మూడువారాల గరిష్టస్థాయిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుంది. అటుపై 11,020-11,110 పాయింట్ల శ్రేణివరకూ పెరగవచ్చు.  ఈ వారం పైన సూచించిన కీలకస్థాయిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,850 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిలోపున ముగిస్తే  10,775 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున క్రమేపీ తిరిగి 10,690 పాయింట్ల స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు.You may be interested

నికో.. తప్పుకో!!

Monday 21st January 2019

- భాగస్వామ్య సంస్థకు రిలయన్స్ నోటీసులు - చెల్లింపుల్లో డిఫాల్ట్ అవఽడమే కారణం న్యూఢిల్లీ: కేజీ-డీ6 గ్యాస్ బ్లాక్‌ క్షేత్ర అభివృద్ధి వ్యయాల చెల్లింపుల్లో విఫలమైన నేపథ్యంలో వెంచర్ నుంచి తప్పుకోవాల్సిందిగా కెనడాకు చెందిన భాగస్వామ్య సంస్థ నికో రిసోర్సెస్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌) నోటీసులిచ్చింది. ఆర్‌-క్లస్టర్‌, శాటిలైట్ క్లస్టర్ వంటి వాటి అభివృద్ధికి తన వంతుగా 5-6 బిలియన్ డాలర్లను సమకూర్చలేకపోవడం, రుణదాతలకు చెల్లింపుల్లో డిఫాల్ట్ కావడం, కేజీ-డీ6 వెంచర్‌లో తన

హెచ్‌డీఎఫ్‌సీబ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Monday 21st January 2019

మూడో త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఫలితాలపై బ్రోకరేజ్‌ సంస్థలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే ఆస్తుల నాణ్యత కొంత క్షీణించడంపై స్వల్ప ఆందోళన వ్యక్తం చేశాయి. పలు బ్రోకింగ్‌ సంస్థలు బ్యాంకు షేరుపై బుల్లిష్‌గా ఉన్నాయి. 1. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 2670 నుంచి 2730 రూపాయలకు పెంచింది. లాభాలు అంచనాలకు తగినట్లే ఉన్నాయి. అయితే కాసా గ్రోత్‌ కొంత మందగించడంపై అసంతృప్తి. అసెట్‌ క్వాలిటీ కాస్త తగ్గినా

Most from this category