STOCKS

News


మళ్లీ 38000 పైకి సెన్సెక్స్‌

Tuesday 26th March 2019
Markets_main1553595967.png-24807

- సెన్సెక్స్‌ 424 పాయింట్ల పరుగు
- 129 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

రెండు రోజులపాటు నష్టాలు చవి చూసిన భారత స్టాక్‌ మార్కెట్లకు మంగళవారం పటిష్టంగా కోలుకున్నాయి.  బ్యాంకింగ్‌, ఆర్థిక, మెటల్‌, ఫార్మా రంగ షేర్లతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 38వేల స్థాయిని, నిఫ్టీ 11450 స్థాయిని తిరిగి అందుకున్నాయి. మార్కెట్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 425 పాయింట్ల లాభంతో 38,233 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 11,483 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల భారీ ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ 601 పాయింట్లు లాభపడి 29,882 వద్ద ముగిసింది.  డాలర్‌ మారకంలో రూపాయి బలపడంతో ఐటీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ పరిమాణాలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. నేడు ఆసియాలో ప్రధాన మార్కెట్లు లాభాలతో ముగిశాయి.  ఆర్థిక మాంద్య ఆందోళన భయాలు తగ్గడంతో, అమెరికా 10 పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ పెరగడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు రికవరీకీ బాట పట్టాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీయ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, గత రెండు రోజులుగా భారీగా నష్టపోయి షేర్లు తక్కువ విలువ వద్ద లభిస్తుండంతో ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 511 పాయింట్లు లాభపడి 38,298ల వద్ద, నిఫ్టీ 142 పాయింట్లు లాభపడి 11,496.75 ఇంట్రాడే గరిష్టాలను నమోదుచేశాయి.

విప్రో, ఇన్ఫోసిస్‌, యుపీఎల్‌, ఐఓసీ, టెక్‌మహీంద్రా షేర్లు అరశాతం నుంచి 2.50శాతం నష్టపోగా, బజాజ్‌ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్టీ‍్రస్‌, వేదాంత, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, షేర్లు 3శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి. 



You may be interested

మే14న మైండ్‌ట్రీ- ఎల్‌అండ్‌టీ ఓపెన్‌ఆఫర్‌ ఆరంభం

Tuesday 26th March 2019

మైండ్‌ట్రీలో అదనంగా 31 శాతం వాటా కొనేందుకు ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌ మే 14న ఆరంభమవుతుందని ఎల్‌అండ్‌టీ ప్రకటించింది. ఈ ఆఫర్‌ మే 27న ముగుస్తుందని వాటాదారులకు తెలియజేసింది. ఓపెన్‌ ఆఫర్‌లో 5.13 కోట్ల షేర్లను రూ. 5030 కోట్లకు సొంతం చేసుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ముందుగా ప్రకటించినట్లే ఓపెన్‌ఆఫర్‌ ధర రూ. 980గా నిర్ణయించింది. అయితే మే 13లోపు ఈ ధర, ఆఫర్‌ సైజును మార్చేందుకు ఎల్‌అండ్‌టీకి అవకాశం

బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ

Tuesday 26th March 2019

మార్కెట్‌ లాభాలకు బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ  తోడ్పాటునిస్తుంది. ట్రేడింగ్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లలో చెప్పుకోదగ్గ కోనుగోళ్లు జరిగాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సెక్టార్‌లో అధిక వెయిటేజీ గల ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టే్‌ట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు ర్యాలీ ఇండెక్స్‌ ఆయా ఇండెక్స్‌లను పరుగులెత్తించాయి. గతరెండు రోజులుగా మార్కెట్‌ భారీ పతనంలో

Most from this category