STOCKS

News


35,540 దిగువన డౌన్‌ట్రెండ్‌

Monday 24th December 2018
Markets_main1545625802.png-23192

మూడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్‌డీఏ ఓటమిచెందడం, రిజర్వుబ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌పటేల్‌ రాజీనామా, ప్రపంచ మార్కెట్లలో అమ్మకాలు వంటి పలు ప్రతికూలాంశాల నడుమ వరుసగా ఏడురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ మార్కెట్‌...శుక్రవారం అంతర్జాతీయ ట్రెండ్‌కు తలొగ్గింది. అమెరికా మార్కెట్లయితే ఊపిరి పీల్చుకోకుండా పడుతున్నాయి. జపాన్‌లో సైతం ఇదే తంతు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లో ట్రేడింగ్‌ పరిమాణం రెట్టింపయ్యింది. అక్కడ ఇదే ట్రెండ్‌ కొనసాగితే ఇండియాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ తీవ్రమైన బేర్‌కక్ష్యలోకి మళ్లే ప్రమాదం వుంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్‌ రెండోవారం నుంచి విదేశీ, స్వదేశీ ఫండ్స్‌ మన మార్కెట్లో తీసుకున్న భారీ లాంగ్‌ పొజిషన్లను జనవరికి రోలోవర్‌ చేస్తారా లేదా వారి పొజిషన్లను పూర్తిగా ఆఫ్‌లోడ్‌ చేస్తారా అనే అంశం ఇక్కడ కీలకం.  ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే, 

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
డిసెంబర్‌ 21తో ముగిసిన వారంలో గత మార్కెట్‌ పంచాంగంలో ప్రస్తావించి 35,800 మద్దతును పరిరక్షించుకుని వేగంగా 36,555 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం భారీ పతనాన్ని చవిచూసి 35,695 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 221 పాయింట్ల నష్టంతో 35,742 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 200 రోజుల చలనసగటు రేఖ (200 డీఎంఏ) కదులుతున్న 35,540 పాయింట్ల స్థాయి కీలకం. ఈ స్థాయి దిగువన సోమవారం గ్యాప్‌డౌన్‌తో మార్కెట్‌ మొదలైతే వేగంగా 35,445 పాయింట్ల స్థాయికి పడిపోవొచ్చు. ఈ లోపున  50 డీఎంఏ రేఖ చలిస్తున్న 35,175 పాయింట్ల వరకూ సెన్సెక్స్‌కు సాంకేతిక మద్దతు ఏదీ లేదు. ఈ లోపున ముగిస్తే 34,420 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే 36,050 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 36,200 పాయింట్ల స్థాయిని అందుకునే వీలుంటుంది. ఆపైన ముగింపు..సెన్సెక్స్‌ను 36,480 పాయింట్ల స్థాయికి చేర్చవచ్చు. 

10,765 దిగువన నిఫ్టీ బలహీనం
గతవారం ప్రధామార్థంలో 10,985 పాయింట్ల వరకూ పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో 10,738 పాయింట్ల స్థాయికి పతనమయ్యింది. చివరకు అంతక్రితంవారంకంటే 51 పాయింట్ల లాభంతో 10,754 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 200 డీఎంఏ రేఖ 10,765 పాయింట్ల వద్ద కదులుతున్నది. ఈ రేఖ ఎగువకు గత నెలరోజుల్లో రెండోదఫా నిఫ్టీ చేరినప్పటికీ, ఈ రెండు సందర్భాల్లో ఆపైన నిలదొక్కుకోలేకపోయింది. ఈ కీలక స్థాయి దిగువన నిఫ్టీ తిరిగి డౌన్‌ట్రెండ్‌లోకి మళ్లే ప్రమాదం వుంది. ఈ స్థాయి దిగువన సోమవారం నిఫ్టీ మొదలైతే వేగంగా 10,650 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున 50 డీఎంఏ రేఖ సంచరిస్తున్న 10,565 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 10,330 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ 10,765 పాయింట్ల స్థాయి ఎగువన స్థిరపడితే 10,820 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపై 10,880 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన కీలక అవరోధస్థాయి 10,965 పాయింట్లు. 
 You may be interested

ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రముఖ నేతలు

Monday 24th December 2018

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వార్షిక సమావేశాలు వచ్చే నెల 21 నుంచి 25వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పట్టణంలో జరగనున్నాయి. దీనికి మన దేశం నుంచి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతోపాటు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కంపెనీల సీఈవోలు పాల్గొననున్నారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్‌ కిమ్‌ సహా ఆరుగురు సంయుక్తంగా అధ్యక్షత వహంచనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం పాల్గొనవచ్చని అంచనా

ఈ రెండు షేర్లు కొనచ్చు

Monday 24th December 2018

ఓల్టాస్‌        కొనొచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: బొనంజా పోర్ట్‌ఫోలియో  ప్రస్తుత ధర: రూ.570 టార్గెట్‌ ధర: రూ.708 ఎందుకంటే: టాటా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ మూడు విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యూసీపీ (యూనిటరీ కూలింగ్‌ ప్రొడక్ట్స్‌), ఎలక్ట్రో మెకానికల్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ సర్వీసెస్‌(ఈఎమ్‌పీఎస్‌), ఇంజినీరింగ్‌ ప్రొడక్ట్స్‌ అండ్‌ సర్వీసెస్‌ (ఈపీఎస్‌) విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వాతావరణ పరిస్థితులు బాగా లేకపోవడం, వరదల కారణంగా కేరళలో ఓనమ్‌ పండుగ అమ్మకాలు బాగా దెబ్బతినడంతో యూసీపీ సెగ్మెంట్‌

Most from this category