STOCKS

News


ఐదు రోజుల ర్యాలీకి బ్రేక్‌

Friday 13th July 2018
Markets_main1531479463.png-18288

  • 11వేల మార్కును నిలుపుకున్న నిఫ్టీ

చివరి అరగంటలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో  5రోజుల ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌ పడింది. లాభాల స్వీకరణతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకు, ఎఫ్‌ఎంజీసీ షేర్ల అమ్మకాల ఒత్తిడితో సూచీలు సూచీలు స్వల్పంగా నష్టపోయాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల 2శాతం ర్యాలీ సూచీల నష్టాలను తగ్గించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 7పాయింట్ల నష్టంతో 36,542 వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు నష్టంతో 11,019 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. నేటి ట్రేడింగ్‌లో నిఫ్టీ సూచి 11వేల మార్కును నిలబెట్టుకోవడం విశేషం. కిత్రం ట్రేడింగ్‌లో 27వేల పాయింట్ల మార్కును అందుకున్న బ్యాంకు నిఫ్టీ నేటి ట్రేడింగ్‌లో ఆ మార్కును కోల్పోయింది. నేడు 91 పాయింట్లు నష్టపోయి 26,936 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది.
సెన్సెక్స్‌ మరో సరికొత్త రికార్డు
అటు అమెరికా, ఇటు ఆసియా మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో దేశీ స్టాక్‌ మార్కెట్‌ సానుకూలంగా ఆరంభించాయి. సెన్సెక్స్‌ 87 పాయింట్ల లాభంతో  36635 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు లాభంతో 11,057 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో పాటు ఐటీ, ఇంధన షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ మరోసారి తన ఆల్‌హైని మెరుగుపర్చుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ సూచి 192 పాయింట్ల లాభపడి 36740 వద్ద తన జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. మరోసూచి నిఫ్టీ సూచి 48 పాయింట్లు లాభపడి 11,071వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.

చివర్లో అమ్మకాలు:-
అంతర్జాతీయంగా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ మిడ్‌ సెషన్‌ అనంతరం సూచీలు స్తబ్దుగా కదిలాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లతో పాటు, ఎఫ్‌ఎంజీసీ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు జరగాయి. మే నెల పారిశ్రామిక గణాంకాలు నిరుత్సాహపరచడంతో పాటు, జూన్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం 5నెలల గరిష్టానికి చేరుకోవడం తదితర అంశాల మార్కెట్లను ప్రతికూలంగా మారాయి. వీటితో పాటు ఇటీవల బాగా లాభపడిన షేర్ల అమ్మకాలతో సూచీలతో నష్టాలతో ముగిశాయి.

గ్రాసిమ్‌, ఓఎన్‌జీసీ, యాక్సిక్‌ బ్యాంక్‌, ఇన్ఫ్రాటెల్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 3నుంచి 4శాతం నష్టపోగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, టైటాన్‌ షేర్లు 2నుంచి 4శాతం లాభపడ్డాయి.



You may be interested

వచ్చే ఏడాది ఐదో స్థానానికి చేరుకుంటాం

Friday 13th July 2018

న్యూఢిల్లీ: అనుకున్న విధంగా ఆర్థిక వృద్ధి విస్తరణ కొనసాగితే వచ్చే ఏడాది భారత్‌ బ్రిటన్‌ అధిగమించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, వాణిజ్య ఘర్షణల రూపంలో సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. నాలుగేళ్ల నుంచి వేగవంతమైన వృద్ధిని నమోదు చేసిన భారత్‌, ఆర్థిక విస్తరణ

ఆ ‘ఐదు షేర్లు’ వున్నవి మెరిశాయి!

Friday 13th July 2018

నిఫ్టీని మించి రాబడినిచ్చిన ఎంఎఫ్‌లు నిఫ్టీ ఆపకుండా పరుగులు తీస్తున్నా అన్ని షేర్లు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడం లేదు. పలు లార్జ్‌క్యాప్స్‌ నిఫ్టీ వేగాన్ని అందుకోలేకపోతున్నాయి. అయితే కేవలం ఐదు కీలకమైన షేర్లు నిఫ్టీని పరుగులు పెట్టిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది కాలంలో నిఫ్టీ ఇచ్చిన రాబడిలో ఈ ఐదు షేర్ల వాటా 66 శాతం. గతేడాది నిఫ్టీ దాదాపు 13 శాతం రాబడినిచ్చింది. ఇదే సమయంలో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌,

Most from this category