STOCKS

News


సెన్సెక్స్‌ 200 పాయింట్లు గ్యాప్‌అప్‌

Wednesday 9th January 2019
Markets_main1547006449.png-23474

నిఫ్టీ 10,850 పాయింట్ల పైకి

తాజా అమెరికా-చైనా చర్చలతో ఏడాదికాలంగా ఇన్వెస్టర్లను కలవరపెడుతున్న ట్రేడ్‌వార్‌. ముగుస్తుందన్న అంచనాల ఫలితంగా బుధవారం భారత్‌ సూచీలు భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్లు జంప్‌ చేసి 36,180 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 10,862 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. 7,8 తేదీల్లో ఇరు దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చల కాలపరిమితిని అనూహ్యంగా మూడోరోజుకు సైతం పొడిగించడంతో ఒక ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలు మార్కెట్లో పెరిగాయి. దాంతో ఈక్విటీ మార్కెట్లు పెద్ద పెట్టున ర్యాలీ జరిపాయి. ఇక ఇక్కడ ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీలు ట్రేడింగ్‌ ప్రారంభంలో 1-2 శాతం మధ్య పెరిగాయి. మరోవైపు ఇన్‌ఫ్రాటెల్‌, బీపీసీఎల్‌, హింద్‌ పెట్రో, బజాజ్‌ ఆటోలు 1 శాతం వరకూ క్షీణించాయి. 

ప్రపంచ మార్కెట్ల జోరు...

ట్రేడ్‌ డీల్‌ కుదరవచ్చన్న అంచనాలతో క్రితం రోజు అమెరికా సూచీలు మరో 1 శాతం పెరగ్గా, బుధవారం ఉదయం ఆసియా సూచీలు కూడా సానుకూలంగా స్పందించాయి. జపాన్‌ నికాయ్‌ 1 శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 2.5 శాతం, తైవాన్‌ వెయిటెడ్‌, చైనా షాంఘై సూచీలు 1.5 శాతం చొప్పున ఎగిసాయి. సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌, కొరియా కోస్పిలు సైతం 1 శాతం మేర పెరిగాయి. 



You may be interested

భారత ఈక్విటీలపై ఎఫ్‌పీఐలకు తగ్గుతున్న మోజు

Wednesday 9th January 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) భాగస్వామ్యం తగ్గుముఖం పడుతోంది. డిసెంబర్‌లో దేశీయ ఈక్విటీల్లోకి  విదేశీ నిధుల ప్రవాహం(మొత్తం మార్కెట్‌ క్యాప్‌తో పోలిస్తే) ఒక శాతం దిగువకు పడిపోయిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఇదే విదేశీ నిధుల ప్రవాహం మొత్తం మార్కెట్‌ క్యాప్‌లో 3 శాతం ఉండేది. దీంతో పాటు మార్కెట్‌ మొత్తం వాల్యూంల్లో ఎఫ్‌పీఐల ట్రేడింగ్‌ వాల్యూంలు డిసెంబర్‌లో 30 శాతానికి పడిపోయాయి. మూడేళ్ల క్రితం

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 9th January 2019

వివిధ వార్తలకు బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు ఇండియన్‌ బ్యాంక్‌:- ఎప్లాయిస్‌ షేర్‌ పర్చేజ్‌ స్కీమ్‌, ఏటీ1, టైర్‌ 2 బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ఎన్‌ఎమ్‌డీసీ:- ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం రూ.1000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ ఇష్యూకు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 3.23శాతానికి సమానమైన 10.20 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.98ల వద్ద తిరిగి కొనుగోలు

Most from this category