STOCKS

News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Thursday 31st January 2019
Markets_main1548906953.png-23910

సెన్సెక్స్‌ 250 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లు అప్‌

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపుపై వెనకడుగువేసిన కారణంగా ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో గురువారం స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్ల జంప్‌చేసి 35,840 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 10,708 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, టెక్‌ మహింద్రా, గెయిల్‌లు 1-2 శాతం మధ్య పెరుగుదలతో ప్రారంభంకాగా, అదాని పోర్ట్స్‌, ఇండియాబుల్స్‌, బీపీసీఎల్‌లు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది వడ్డీ రేట్ల పెంపుపై ఆచితూచి వ్యవహరిస్తామంటూ బుధవారం రాత్రి ఫెడ్‌ సమీక్షా సమావేశం అనంతరం ప్రకటించడంతో అమెరికా స్టాక్‌ సూచీలు 2 శాతం వరకూ ర్యాలీ జరిపాయి. ఇదే క్రమంలో తాజాగా హాంకాంగ్‌, చైనా సూచీలు 1 శాతం ఎగిసాయి. జపాన్‌ నికాయ్‌ 0.7 శాతం, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ 0.6 శాతం మేర పెరిగాయి. కొరియా, తైవాన్‌ సూచీలు స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

ఐవోసీకి నిల్వల సెగ..

Thursday 31st January 2019

క్యూ3లో లాభం 91 శాతం క్షీణత రూ. 717 కోట్లకు డౌన్‌ న్యూఢిల్లీ: చమురు రేట్లు క్షీణించడం, అధిక ధరలకు ఖరీదు చేసిన ఇంధన నిల్వల విలువ పడిపోవడం తదితర కారణాలు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ లాభం ఏకంగా 91 శాతం క్షీణించి రూ. 717 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే

చందా కొచర్‌ దోషే!!

Thursday 31st January 2019

నిబంధనలు ఉల్లంఘించిన మాట నిజమే తేల్చిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఆమెను తొలగించినట్లే పరిగణిస్తాం ఇచ్చిన బోనస్‌లన్నీ వెనక్కి తీసుకుంటాం ఐసీఐసీఐ బ్యాంక్‌ వెల్లడి న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల వివాదంపై విచారణ జరిపిన జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ కమిటీ... ఈ వ్యవహారంలో ప్రైవేట్‌ రంగ ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచర్‌ని దోషిగా తేల్చింది. బ్యాంకు నిబంధనలను ఆమె ఉల్లంఘించారని స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ బుధవారం ఈ విషయాలు వెల్లడించింది. చందా కొచర్‌ ఇప్పటికే

Most from this category