News


స్వల్ప లాభంతో ముగింపు

Tuesday 5th February 2019
Markets_main1549361591.png-24026

నేటి నుంచి ప్రారంభమైన ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాలతో పాటు ప్రధాన కంపెనీల క్యూ3 పలితాల ప్రకటన నేపధ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా మార్కెట్‌ మంగళవారం  స్వల్పలాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 34 పాయింట్ల లాభంతో 36,617 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 22 పాయింట్లు పెరిగి 10,934 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీలు లాభాలతో ముగియడం వరుసగా ఇది నాలుగో రోజు. అటో, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. మరోవైపు మెటల్‌, ఎఫ్‌ఎంజీసీ, ఐటీ, ఫార్మా, రియల్టీ షేర్లలో అమ్మకాలు జరిగాయి. ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్ల ర్యాలీతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ దాదాపు అరశాతం ర్యాలీ జరిపి 27,271 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 232 పాయింట్ల రేంజ్‌లో 36,495.83 - 36,727.83 స్థాయిల వద్ద ట్రేడవ్వగా, నిఫ్టీ ఇండెక్స​ 71 పాయింట్ల స్థాయిలో 10,886.70 - 10,956.70 రేంజ్‌లో కదలాడింది.
హీరోమోటోకార్ప్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, యూపీఎల్‌, టైటాన్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 3శాతం నుంచి 5శాతం లాభపడగా, ఓఎన్‌జీసీ, యస్‌ బ్యాంక్‌, టాటామోటర్స్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టపోయాయి.



You may be interested

ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌

Tuesday 5th February 2019

ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం తాజాగా 50కిపైగా షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది.  మూమెంటమ్‌ ఇండికేటర్‌ అయిన మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జెన్స్‌ డైవర్జన్స్‌ (ఎంఏసీడీ) ఆధారంగా కొన్ని షేర్లు ర్యాలీ చేయడానికి సిద్ధంగా వున్నాయని టెక్నికల్‌ అనలిస్టులు సూచిస్తున్నారు. వీటిలో పీఎస్‌యూలైన ఓఎన్‌జీసీ, ఎన్‌హెచ్‌పీసీ, ఎంఓఐఎల్‌లు, బ్లూచిప్‌ షేర్లయిన హీరో మోటో కార్‌‍్ప, అంబూజా సిమెంట్స్‌, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌లు వున్నాయి. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, సన్‌నెట్‌వర్క్‌, జస్డ్‌ డయిల్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, కన్సాయి నెరోలాక్‌, బజాజ్‌ ఎలక్రి‍్టకల్స్‌, టాటా

ఫలితాలతో పీఎన్‌బీ కౌంటర్లో ఒడుదుడుకులు

Tuesday 5th February 2019

తొలుత ర్యాలీ...అటుపై అమ్మకాలు ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ3లో బ్యాంక్‌ రూ.246.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ3లో సాధించిన రూ.230.11 కోట్లతో పోలిస్తే ఇది 7శాతం అధికం. అలాగే గత రెండు క్వార్టర్లలో (క్యూ1, క్యూ2)  నికర నష్టాల్ని చవిచూసిన బ్యాంక్‌, తాజా క్వార్టర్లో లాభాన్నిఆర్జించడం విశేషం. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 8శాతం వృద్ధిని సాధించింది. గత

Most from this category