STOCKS

News


నాలుగో రోజూ లాభాలే..!

Wednesday 9th January 2019
Markets_main1547030107.png-23489

  • 36వేలపైన సెన్సెక్స్‌
  • 10850పైన నిఫ్టీ

ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ ఆర్థిక రంగ షేర్ల అండతో మార్కెట్‌ నాలుగో రోజూ లాభాలతో ముగిసింది. మిడ్‌సెషన్‌ తరువాత సాగిన ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో చివరకు సెన్సెక్స్‌ 36వేల పైన, నిఫ్టీ 10850 పాయింట్లపై ముగిశాయి. ఇటీవల ప్రపంచ వాణిజ్యరంగాన్ని కలవరపెడుతున్న అమెరికా-చైనా దేశాల వాణిజ్య యుద్ధ నివారణ చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో నేడు సూచీలు భారీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 200 పాయింట్లు పెరిగి 36,180 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 10,862 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాంటి అధిక వెయిటేజ్‌ కలిగిన షేర్ల అండతో మిడ్‌సెషన్‌ వరకు సూచీల ర్యాలీ సజావుగా జరిగింది. అయితే మిడ్‌సెషన్‌ అనంతరం మార్కెట్లో అమ్మకాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లలో అ‍మ్మకాల సునామి నెలకొనడంతో సూచీలు ఒక్కసారిగా నష్టాల్లో మళ్లాయి. ఒకానొక దశలో నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 10750 మార్కును కోల్పోయి 10749 వద్దకు పతమైంది. మరోప్రధాన సూచీ సెన్సెక్స్‌ సైతం 120 పాయింట్లను నష్టపోయింది. అయితే యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం, దేశీయ మార్కెట్లో ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ ఆర్థిక రంగ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్‌ 232 పాయింట్లు పెరిగి36,213 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 10,855 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.75 శాతం (211 పాయింట్లు) పెరిగి 27,720.40 వద్ద ముగిసింది. మరోవైపు మెటల్‌, ప్రభుత్వరంగ ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి.
హెచ్‌డీఎఫ్‌సీ, యూపీఎల్‌, టాటామోటర్స్‌, ఐటీసీ, యాక్సి్‌స్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం లాభపడగా, అల్ట్రాటెక్‌, యస్‌బ్యాంక్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 3శాతం నుంచి 4శాతం నష్టపోయాయి.



You may be interested

విద్యుత్‌, బ్యాంకు స్టాక్స్‌ను కొంటున్నదెవరు? 

Thursday 10th January 2019

బ్యాంకు, విద్యుత్‌స్టాక్స్‌కు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దేశంలో ఆస్తుల పరంగా అతిపెద్ద అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణ సంస్థ) హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కొన్ని విద్యుత్‌, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకుల స్టాక్స్‌ను డిసెంబర్‌ నెలలో కొనుగోలు చేసింది. ఆర్‌ఈసీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. 2.05 కోట్ల ఆర్‌ఈసీ షేర్లను హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ కొనుగోలు చేసింది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ)కు

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ ఫలితాలు బాగుంటాయి!

Wednesday 9th January 2019

సీఎల్‌ఎస్‌ఏ అంచనా మూడో త్రైమాసికంలో పీఎస్‌యూ బ్యాంకుల ఫలితాలు గాడిన పడతాయని అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అంచనా వేసింది. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకుల క్యు3 ఫలితాలు అంచనాలను మించవచ్చని తెలిపింది. ముఖ్యంగా స్లిపేజ్‌లు, ఆపరేటింగ్‌ ప్రదర్శన విషయాల్లో ఈ బ్యాంకులు మెరుగుపడతాయని తెలిపింది. యస్‌బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌లాంటి బ్యాంకుల ఫలితాలపై ప్రొవిజనింగ్స్‌ భారం పడుతుందని అంచనా వేసింది. హెచ్‌డీఎఫ్‌సీ కోర్‌ ప్రాఫిట్‌లో వృద్ది ఉండొచ్చు కానీ, నికరలాభంలో మాత్రం

Most from this category