News


మార్కెట్‌ యూ టర్న్‌

Friday 11th January 2019
Markets_main1547192717.png-23532

ఐటీ, అటో, ఇన్ఫ్రా, షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌ నష్టాల బాట పట్టింది. నిఫ్టీ 10800 మార్కును, సెన్సెక్స్‌ 36వేల మార్కును కోల్పోయాయి. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన టీసీఎస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్ల క్షీణత సూచీలను నష్టాల్లోకి నెట్టాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల ట్రేడింగ్‌ను అందుకున్న సూచీలు నేడు లాభాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్యూ3లో నిర్వహణ మార్జిన్లు విశ్లేషకులు అంచనాలను అందుకోలేకపోవడంతో టీసీఎస్‌ 2.50శాతం నష్టపోగా, సాధారణ నిర్వహణ కార్యకలాపాల్లో భాగంగా జామ్నానగర్‌ రీఫైనరీలోని రెండు యూనిట్లను నెలరోజుల పాటు మూసివేస్తున్న నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2శాతం క్షీణించింది. అలాగే మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ రంగాలకు చెందిన షేర్లలో సైతం అమ్మకాలు సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫలితంగా మధ్యాహ్నం గం.1:00లకు నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 10,770.60 వద్ద, సెన్సెక్స్‌ 160 పాయింట్లు క్షీణించి 35,950 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు నేడు మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత సైతం సూచీలపై ఒత్తిడిని పెంచుతుంది. అయితే మెటల్‌, ఎఫ్‌ఎంజీసీ రంగ షేర్లు మాత్రం స్వల్పంగా లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

టీసీఎస్‌ షేరు కొనొచ్చు.. కానీ ఎప్పుడు?

Friday 11th January 2019

క్యు3 ఫలితాల అనంతరం షేరుపై రివ్యూ బలమైన డీల్స్‌ గెలుచుకోవడం, డిజిటల్‌ విభాగంలో మంచి వృద్ది నమోదు కావడంతో టీసీఎస్‌ క్యు3 ఫలితాలు ఆకట్టుకున్నాయి. అయితే మార్జిన్లు క్రమానుగతంగా బలహీనపడడం ఆందోళనకరమని అనలిస్టుల అభిప్రాయం. మార్జిన్లపై భయాలతో పలు బ్రోకింగ్‌ సంస్థలు టీసీఎస్‌ ఎర్నింగ్స్‌ అంచనాలను తగ్గించాయి. యూఎస్‌లో మందగమనం వస్తే రెవెన్యూ వృద్ధి బలహీనపడవచ్చంటున్నాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్‌ షేరు పోర్టుఫోలియోలో ఉండాల్సిన స్టాకే కానీ ప్రస్తుత ధరల వద్ద

బడ్జెట్‌ ముందు బేర్స్‌దే హవా!

Friday 11th January 2019

గణాంకాల వెల్లడి పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే బడ్జెట్‌కు ముందు మార్కెట్లో ఎక్కువమార్లు బేర్స్‌ పట్టు బిగించినట్లు తెలుస్తోంది. పదేళ్లలో 12 మార్లు బడ్జెట్‌ సెషన్స్‌ వచ్చాయి. వీటిలో 9 సెషన్స్‌కు ముందు మార్కెట్లపై బేర్‌ పంజా విసిరాయి. ముఖ్యంగా 2016లో బడ్జెట్‌కు ఒకనెల ముందు సూచీలు దాదాపు 7 శాతం బేర్‌ మన్నాయి. బడ్జెట్‌కు ముందు 2013లో 6.1 శాతం, 2011లో 6 శాతం మేర సూచీలు నష్టపోయాయి. కేవలం 2010,

Most from this category