STOCKS

News


35వేల దిగువకు సెన్సెక్స్‌

Monday 5th November 2018
Markets_main1541414440.png-21728

ఆర్థిక, ఔషధ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, అటో షేర్ల పతనంతో మార్కెట్‌ సోమవారం నష్టాల్లో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 61 పాయింట్ల కోల్పోయి 34,951 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 25 పాయింట్ల నష్టపోయి 10,528 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలోని ప్రభుత్వరంగబ్యాంక్‌, రియల్టీ, మెటల్‌, ఐటీ రంగాలకు చెంది సూచీలు లాభాల్లో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రెండో విడుత మూలధన సాయం కింద రూ.54వేల కోట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైందనే వార్త వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 3.30శాతం లాభపడింది. మరోవైపు ఆర్థిక, ఔషధ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, అటో రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత కారణంగా ఐటీ ఇండెక్స్‌ అత్యధికంగా అరశాతం నష్టపోయింది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు తోడు డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత కారణంగా మార్కెట్‌ ట్రేడింగ్‌ ఆద్యంతం
ఇంట్రాడే ట్రేడింగ్‌ ఇలా:-
నేడు సూచీలు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించాయి. సెన్సెక్స్‌ సూచీ 107 పాయింట్ల లాభంతో 35,118 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 10,558 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు తోడు డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత తదితర కారణాలతో సూచీలు క్షణాల్లో నష్టాల్లోకి మళ్లాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం నష్టాల్లోకి ట్రేడైన సూచీలు... ఒకానోక దశలు అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 201 పాయింట్లను కోల్పోయి 34811 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 10477 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసింది. అయితే మార్కెట్‌ చివరి గంటలో ఎస్‌బీఐ ప్రకటించిన ఫలితాలను మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా సూచీలు తమ నష్టాలను తగ్గించుకోగలిగాయి.
బీపీసీఎల్‌, ఇండస్‌ఇండ్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, ఐఓసీ, సిప్లా షేర్లు 3.50శాతం నుంచి 7.50శాతం నష్టపోగా, హెచ్‌సీఎల్‌టెక్‌, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, యూపీఎల్‌, ఎస్‌బీఐ షేర్లు 1.50శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి.



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Tuesday 6th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 21 పాయింట్ల లాభంతో 10,581 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,550 పాయింట్లతో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఇక

ఈ 10 షేర్లు తారాజువ్వలు..!

Monday 5th November 2018

గతవారం మార్కెట్‌ ట్రేడింగ్‌లో బుల్స్‌ పట్టు ఒక్కసారిగా పెరిగింది. సెన్సెక్స్‌ 1,662 పాయింట్లు (5 శాతం) పెరిగి 35,011 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 523 పాయింట్లు (5 శాతం) పెరిగి 10,553 పాయిం‍ట్లకు చేరుకుంది. మొదటి వారంలో స్మార్ట్‌ రికవరీని సాధించిన సూచీలు.. ఈ నెలలో ఇదే స్థాయి జోరును ప్రదర్శించవచ్చని, దీపావళి సందర్భంగా 10 షేర్లు మంచి రాబడిని అందించగలవని పలువురు దలాల్‌ స్ట్రీట్‌ పండితులు సూచిస్తున్నారు. 10,700-10,840

Most from this category