STOCKS

News


ఎనిమిదో రోజూ నష్టాలే..!

Monday 18th February 2019
Markets_main1550488044.png-24249

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా 8వ రోజూ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 10650 మార్కును కోల్పోయింది. ముడిచమురు ధరలు ఈ ఏడాది గరిష్టాన్ని తాకడం, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగడం, దేశీయ మార్కెట్లో నెలకొన్న బలహీన ధోరణి, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్‌, అటో రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరగడంతో సెన్సెక్స్‌ 310 పాయింట్లను నష్టపోయి 35,498.44 వద్ద, నిఫ్టీ 83 పాయింట్లను నష్టపోయి 10,641 వద్ద స్థిరపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 140 పాయింట్లను కోల్పోయి (అరశాతం) 26,654.25 వద్ద ముగిసింది. నేటి ఉదయం మార్కెట్‌ ఫ్లాట్‌ ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.., దేశీయ మార్కెట్లో నెలకొన్న అస్థిరత వాతావరణం సూచీల ర్యాలీకి ప్రతికూలమైంది. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే సూచీలు నష్టాల బాట పట్టాయి. ట్రేడింగ్‌ ఆద్యంతం ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గుచూపడంతో సూచీలు ఏదశలో కోలుకోలేకపోయాయి. మిడ్‌సెషన్‌ అనంతరం ఆసియా మార్కెట్లు లాభాలతో ముగిసినప్పటికీ, యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం, అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడింగ్‌ అవ్వడంతో సూచీలు మరింత నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్‌  339 పాయింట్లను నష్టపోయి 35,470.76 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లను కోల్పోయి 10,628.40 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. 
నిఫ్టీ- 50 సూచీలో యస్‌బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్‌ సర్వీసెస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 2.50శాతం నుంచి 3.50 శాతం నష్టపోగా, యాక్సి్‌స్‌ బ్యాంక్‌, టాటామోటర్స్‌, జీలిమిటెడ్‌, ఓఎన్‌జీసీ, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి. 

రూపీ ర్యాలీ: ఐటీ షేర్లకు కష్టాలు
డాలర్‌ మారకంలో రూపాయి బలపడంతో నేటి ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. ఇంట్రాడేలో రూపాయి 30 పైసలు బలపడంతో డాలర్ల మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎన్‌ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం నష్టపోయింది. ఈ రంగానికి టీసీఎస్‌ అ‍త్యధికంగా 3శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1శాతం, ఇన్ఫోసిస్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. 



You may be interested

ఈ ఫార్మా కంపెనీలకు ప్రాధాన్యం: సెంట్రమ్‌

Monday 18th February 2019

జనరిక్‌ ఫార్మా కంపెనీల కంటే సముచిత స్థానంలో ఉన్న బహుళజాతి ఫార్మా కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఈక్విటీ అడ్వైజరీ హెడ్‌ దేవాంగ్‌ మెహతా తెలిపారు. కన్జ్యూమర్‌ వ్యాపారంలో పెట్టుబడులకు మంచి కంపెనీలు ఉన్నట్టు చెప్పారు. వివిధ అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు.   ఫార్మాలో అవకాశాలు... చాలా వరకు లార్జ్‌క్యాప్‌ ఫార్మా కంపెనీలు గత నాలుగైదేళ్ల కాలంలో లార్జ్‌క్యాప్‌లోనే ఉండిపోలేదు. సన్‌ఫార్మా, లుపిన్‌, డాక్టర్‌

వాటా విక్రయ వార్తలతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్ల ర్యాలీ

Monday 18th February 2019

గృహ రుణ సంస్థ దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్ప్‌ లిమిటెడ్‌ షేర్లు సోమవారం 10శాతం లాభపడ్డాయి. బారింగ్‌ ప్రైవేట్‌ ఈక్విటీ, బైన్‌ క్యాపిటల్‌, హీరోపిన్ కార్ప్‌ కంపెనీలు వివిధ మార్గాల ద్వారా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కంపెనీలోని 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. వాటా విక్రయ వార్తలతో నేడు బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 10శాతం ర్యాలీ చేసి రూ.135.40ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని

Most from this category