STOCKS

News


10,950 పైన నిఫ్టీ ముగింపు

Wednesday 19th December 2018
Markets_main1545214076.png-23085

మార్కెట్‌ ర్యాలీ బుధవారం కూడా ఆగలేదు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, అటో, ఎఫ్‌ఎంసీసీ షేర్ల అండతో సూచీలు వరుసగా ఏడోరోజూ లాభాలతో ముగిశాయి.  నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 10,967 వద్ద, సెన్సెక్స్‌ 137 పాయింట్ల లాభంతో 36484 వద్ద స్థిరపడ్డాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ర్యాలీ రెండోరోజూ కొనసాగడం, బాండ్ల బైబ్యాక్‌ ఇష్యూ ద్వారా ఈ నెలలో అదనంగా మరో రూ.10,000 కోట్ల నిధులను ఆర్థిక వ్యవస్థలోకి విడుదల చేయాలనే ఆర్‌బీఐ నిర్ణయం ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురిగొల్పాయి. దేశీయ మార్కెట్‌లోకి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల వెల్లువ కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది. ఆర్‌బీఐ బాండ్ల బైబ్యాక్‌ ఇష్యూతో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యత్వ కొరత తగ్గుతుందనే అంచనాలతో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, అటో రంగ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. మరోవైపు రూపాయి ర్యాలీ ఐటీ, ఫార్మా రంగ షేర్లను నష్టాల్లోకి నెట్టింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే కీలక వడ్డీరేట్లపై నేడు ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియుగా, ఐరోపా మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.
డాలర్‌ మారకంలో రూపాయి రెండో రోజూ లాభాల ప్రారంభంతో పాటు ఆర్‌బీఐ బాండ్ల బైబ్యాక్‌ అంశంతో నేడు సెన్సెక్స్‌ 94 పాయింట్ల లాభంతో 36,441 వద్ద, నిప్టీ 22 పాయింట్ల లాభంతో 10,930ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో స్థిరమైన కొనుగోళ్లతో సూచీలు సాఫీగా ర్యాలీ చేశాయి. ఒకానోక దశలో 208 పాయింట్ల లాభపడి 36,555 వద్ద, నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 10,985.15 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి.
ఇన్ఫ్రాటెల్‌, ఏషియన్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ఫిన్‌ సర్వీసెస్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 3శాతం నుంచి 8శాతం లాభపడగా, కోటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌, ఇన్ఫోసిస్‌, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్‌టెక్‌ 1శాతం నుంచి 2.75శాతం నష్టపోయాయి.



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పతనం..

Thursday 20th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:40 సమయంలో 88 పాయింట్ల నష్టంతో 10,898 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,986 పాయింట్లతో పోలిస్తే 88 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ గురువారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ దాదాపు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.

వచ్చే ఏడాది 40000 స్థాయికి సెన్సెక్స్‌

Wednesday 19th December 2018

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ బీఎన్‌పీ పారిబాస్‌.. భారత్‌ వృద్ధిపై తటస్థంగా ఉంది. 2019లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40,000 మార్క్‌ను అందుకుంటుందని అంచనా వేసింది. మంగళవారం నాటి ముగింపు స్థాయి 36,347 పాయింట్లతో పోలిస్తే 10 శాతానికి పైగా అప్‌సైడ్‌ ఉంటుందని పేర్కొంది. అయితే కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ వృద్ధిపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఇంకా పుంజుకోలేదని పేర్కొంది. ఇకపోతే రాజకీయ పరిస్థితుల వల్ల తలెత్తే అస్థిరతల విషయంలో

Most from this category