STOCKS

News


సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌

Tuesday 11th September 2018
Markets_main1536662353.png-20169

 

  • 11300 దిగువకు నిఫ్టీ
  • నెలరోజుల కనిష్టానికి సూచీలు

ముంబై:- రూపాయి పతనం... మార్కెట్‌ను రెండో రోజూ ముంచింది. మార్కెట్‌ మరో అరగంటలో ముగుస్తుందనగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ 29 పైసలు నష్టపోయి 72.74 వద్ద కొత్త కనిష్టానికి పతనమైంది. దీనికి తోడు అంతర్జాతీయంగా ముడిచమురు ధర పెరగడం, వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో ట్రేడింగ్‌ చివరి గంటలో మార్కెట్‌లో హఠాత్తుగా అమ్మకాల సునామి వెల్లువెత్తింది. ఇండెక్స్ హెవీవెయిట్ షేర్లు ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఐసీఐసీఐ 1-3 శాతం మధ్య క్షీణించాయి. చివరికి సెన్సెక్స్‌ 509 పాయింట్లు కోల్పోయి 37413 వద్ద ముగిసింది. రెండు (సోమ, మంగళ) ట్రేడింగ్‌ సెషన్స్‌లో కలిపి 977 పాయింట్లను నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 11,287 వద్ద ముగిసింది. నేటి ట్రేడింగ్‌లో 11300 స్థాయిని కోల్పోగా, రెండు ట్రేడింగ్‌ సెషన్స్‌లో కలిపి 302 పాయింట్లను కోల్పోయింది. నేటి ముగింపు స్థాయిలు ఈ సూచీలకు నెలరోజుల కనిష్టాలు కావడం గమనార్హం. ఎన్‌ఎస్‌ఈలోని ప్రధాన సూచీలన్నీ నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ సూచి 2.50శాతం నష్టపోయింది. మరో కీలకమైన నిప్టీ బ్యాంకు సూచీ 394 పాయింట్లు క్షీణించి 27వేల దిగువకు 26,807 వద్ద ముగిసింది.
హెవీ వెయిట్‌ షేర్ల పతనం:-
హెవీ వెయిట్‌ షేర్లైన ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 3నుంచి 1 పతనం సూచీలకు తీవ్రమైన నష్టాలను కలిగించింది. రెండు రోజులు ఎఫ్‌ఎంజీసీ షేర్ల పతనంలో భాగంగా ఈ రంగంలో హెవీ వెయిట్‌ షేరైన ఐటీసీ నేటి ట్రేడింగ్‌లో 3శాతం వరకూ నష్టపోయింది.
పవర్‌గ్రిడ్‌, టాటామోటర్స్‌, ఐటీసీ, టాటాస్టీల్‌, టైటాన్‌ షేర్లు 3.50శాతం నుంచి 4.50శాతం నష్టపోగా, బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, ఎం అండ్‌ ఎం, కోల్‌ ఇండియా షేర్లు అరశాతం నుంచి 1.70శాతం లాభపడ్డాయి.



You may be interested

థైరోకేర్‌ షేర్ల బైబ్యాక్‌ వెనుక కారణం?

Wednesday 12th September 2018

రోగ నిర్ధారణ పరీక్షల సేవలను అందించే ప్రముఖ సంస్థ  థైరోకేర్‌ టెక్నాలజీస్‌ షేర్ల బైబ్యాక్‌ ప్రకటించింది. స్టాక్‌ ఎక్సేంజ్‌ల ద్వారా రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును గరిష్టంగా రూ.730 వరకు చెల్లించి కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు రూ.63 కోట్లను కేటాయించింది. 8,63,013 షేర్ల వరకు కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. ఈ బైబ్యాక్‌కు కారణాల గురించి కంపెనీ సీఎండీ, సీఈవో ఏ వేలుమణి ఓ మీడియా

క్రూడ్‌ ధరలు పరిగెడతాయ్‌

Tuesday 11th September 2018

        ఇరాన్‌పై ఆంక్షలు అమల్లోకి వస్తే.. 150 డాలర్లకు క్రూడ్‌ ప్రభుత్వానికి అంచనా వేయడం చేతకాలేదు ధరలు తగ్గుతాయని చెబుతోంది.. కానీ కచ్చితంగా పెరుగుతాయి చమురు ధరలు పెరిగితే ఏం చేయాలో కేంద్రం వద్ద సరైన ప్రణాళికలు లేవు అంతర్జాతీయ మార్కెట్లను నిందిస్తూ, ఏం పర్వాలేదని చెబితే సరిపోదు..  భరోసానిచ్చే ప్రకటనతో కన్సూమర్ల ముందుకు రావాలి కేంద్రం ఓఎన్‌జీసీని నిర్వీర్యం చేస్తోంది.. కంపెనీ విషయంలో సరిగ్గా వ్యవహరించడం లేదు ఓఎన్‌జీసీ మాజీ సీఎండీ ఆర్‌.ఎస్‌.శర్మ క్రూడ్‌ ధరలు పెరగడం తప్ప

Most from this category