News


సూచీలకు రూపాయి షాక్‌..!

Monday 10th September 2018
Markets_main1536576291.png-20133

 

  • నిఫ్టీకి 150 పాయింట్ల నష్టం
  • 38వేల దిగువకు సెన్సెక్స్‌

ముంబై:- సూచీలకు రూపాయి పతనం షాక్‌నిచ్చింది. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు పెరుగుదల, దేశీయ కరెంట్‌ ఖాతా లోటు తగ్గిపోవడం, బాండ్‌ ఈల్డ్‌ నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పాటు బలహీన అంతర్జాతీయ సంకేతాలు సూచీలపై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ఇంట్రాడేలో అటో, బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, మెటల్‌ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల సునామి నెలకొంది. దీంతో మార్కెట్‌ ముగిసే సమాయానికి ప్రధాన సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 468 పాయింట్ల నష్టంతో 37922 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 11438 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌  ఏకంగా 500 పాయింట్లు పతనమనమగా, నిఫ్టీ 162 పాయింట్ల వరుకు నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.16శాతం నష్టంతో ముగిసింది. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 280 పాయింట్లు నష్టపోయి 27,202 వద్ద ముగిసింది.
ఇంట్రాడే ట్రేడింగ్‌ సాగిందిలా:-
అటు అంతర్జాతీయంగానూ, ఇటు దేశీయంగానూ నెలకొన్న బలహీన సంకేతాల నడుమ నేడు భారత మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 41 పాయింట్ల తగ్గుదలతో 38438 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19పాయింట్ల నష్టంతో 11570 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలకు రూపాయి క్షీణత మరింత షాక్‌నిచ్చింది. డాలర్‌ మారకంలో రూపాయి ఇంట్రాడేలో ఏకంగా 93.5 పైసలు పతనమైన 72.67 వద్ద కొత్త కనిష్టానికి చేరుకుంది. ఫలితంగా ఇన్వెస్టర్లలో తీవ్ర అందోళనలు రేకెత్తడంతో అమ్మకాలకు మొగ్గుచూపారు.  అటోమొబెల్స్‌, బ్యాంకింగ్‌, ఇంధన రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు తీవ్రంగా నష్టాలపాలయ్యాయి. మిడ్‌ సెషన్‌ సమయాని కల్లా సెన్సెక్స్‌ 400 పాయింట్ల నష్టపోయి 37వేల దిగువకు, నిఫ్టీ 130 పాయింట్లు నష్టపోయి 11450 దిగువకు చేరుకుంది. మిడ్‌సెషన్‌ అనంతరం పతననాన్ని కొంతసేపు ఆపినప్పటికీ.., చివరి గంటలో అమ్మకాలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో అటో మొబెల్స్‌, బ్యాంకింగ్‌, ఇంధన రంగ షేర్లలో అమ్మకాలు జరగ్గా చివరి సెషన్‌లో ఎఫ్‌ఎంసీసీ, ఫార్మా షేర్లల్లో అమ్మకాల జరిగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 507 పాయింట్లు నష్టపోయి 37,883 వద్ద,  నిఫ్టీ 162 పాయింట్లు నష్టపోయి 11,427 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసాయి.
సూచీల నష్టాలకు ఐదు కారణాలు:-
1.ముడిచమరు మంటలు:- అమెరికా కొత్తగా చమురు ఉత్పత్తులను నిలివేయడంతో పాటు​ ఇరాన్‌ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరల మంటలు మరింత వేడెక్కాయి. ఫలితంగా నేటి ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ చముర బ్యారెల్‌ ధర 77 డాలర్లకు చేరుకుంది.
2. రూపాయి పతనం:- అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదలతో పాటు, డాలర్‌ పుంజుకోవడంతో వర్థమాన దేశాల్లో నెలకొన్న కరెన్సీ సంక్షోభం తదితర కారణాలతో డాలర్‌ మారకంలో రూపాయి కొత్త కనిష్టానికి చేరుకుంది. ఇం‍ట్రాడేలో ఏకంగా 93.5 పైసలు పతనమైన 72.67 స్థాయికి చేరుకుంది.
3.తగ్గిన దేశీయ కరెంట్‌ ఖాతా లోటు:- ఏడాది కాలంగా రూపాయి ఒడిదుడుకుల కారణంగా తొలి త్రైమాసికంలో వాణిజ్యలోటు బాగా పెరిగింది. ఫలితంగా ఈ క్యూ1లో దేశీయ కరెంట్‌ ఖాతా లోటు(సీడీఏ) తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో సీడీఏ 2.4శాతానికి తగ్గింది.
4.నాలుగేళ్ల గరిష్టానికి బాండ్‌ ఈల్డ్‌:- ముడిచమురు ధరల పెరుగుదల, రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలతో పాటు, బలహీనమై ఆర్థిక గణాంకాల నమోదు నేపథ్యంలో భారత్‌ పదేళ్ల ఈల్డ్‌ నాలుగేళ్ల గరిష్ట స్థాయి 8.11శాతానికి ఎగసింది.
5. మరోసారి తెరపైకి ట్రేడ్‌వార్‌ :- చైనా దిగుమతులపై అదనంగా మరో 267 బిలియన్‌ డాలర్ల సుంకం విధింపునకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సిద్ధమతున్నాడనే వార్తలతో వాణిజ్యయుద్ధ భయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఫలితంగా నేడు ఆసియా పలు ప్రధాన మార్కెట్లు నష్టాలతో ముగియగా, యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. గతరాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిసిన సంగతి తెలిసిందే.
బీపీసీఎల్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌, జజాజ్‌ఫైనాన్స్‌ సర్వీసెస్‌ షేర్లు 4నుంచి 5శాతం నష్టపోగా, టీసీఎస్‌, సిప్లా, జీలిమిటెడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి.You may be interested

లుపిన్‌, జేఎస్‌డబ్ల్యూ విషయంలో ఏం చేయవచ్చు?

Tuesday 11th September 2018

నిఫ్టీ50లోకి కొత్తగా జేఎస్‌డబ్ల్యూ రానుండగా, దీనికి బదులు సూచీ నుంచి లుపిన్‌ బయటకు వెళ్లిపోనుంది. ఈ నెల 28 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అనుసరించాల్సిన విధానం ఏమిటో నిపుణుల సూచనల ఆధారంగా తెలుసుకుందాం.   ఆగస్ట్‌ 28న నిఫ్టీ ఇండెక్స్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 10 శాతం వరకు ర్యాలీ చేసింది. అయితే, ఇదంతా తాత్కాలిక

ఫార్మా షేర్లు.. అండర్‌వ్యాల్యూనే!!

Monday 10th September 2018

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లపై ఒత్తిడి నెలకొని ఉంది. కన్సాలిడేషన్‌ కొనసాగుతోంది. తొలి రోజే ఈ విషయం అర్ధమైంది. రూపాయి పతనం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. ‘వర్ధమాన మార్కెట్లకు ఇది పరీక్షలాంటి సమయం. అమెరికాకు నిధులు వెళ్లిపోతున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్‌ రేట్ల పెంపు ఇందుకు కారణం. అందువల్ల వర్ధమాన మార్కెట్లపై దీని ప్రభావం ఉంటుంది’ అని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫౌండర్‌ సౌరభ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. ఆయన ఒక

Most from this category