STOCKS

News


10,700 దిగువన నిఫ్టీ ముగింపు

Thursday 3rd January 2019
Markets_main1546511264.png-23388

  • 377 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌
  • రెండో రోజూ నష్టాల ముగింపే

అంతర్జాతీయ మార్కెట్లలలో నెలకొన్న బలహీన పరిస్థితలకు, డాలర్‌ మారకంలో రూపాయి పతనం తోడవ్వడంతో మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. గత ట్రేడింగ్‌ భారీ నష్టపోయి సూచీలను నష్టాల బాట పట్టించిన మెటల్‌, అటో రంగ షేర్లకు నేడు తాజాగా ఫార్మా రంగ పతనం జతకలవడంతో సెన్సెక్స్‌ 377 పాయింట్లు నష్టపోయి 35,513 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 10700 మార్కును కోల్పోయి 120 పాయింట్ల నష్టంతో 10,672 వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న మన మార్కెట్‌ నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనూ నష్టాలతో బాట పట్టింది. ఇంట్రాడేలో క్రమంగా అమ్మకాలు పెరగడంతో సమయం పెరిగే కొద్ది సూచీల నష్టాలు పెరుగుతూ వచ్చాయి. మన మార్కెట్లకు మిడ్‌సెషన్‌ అనంతరం మొదలైన యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్ల విశ్వాస్నాన్ని దెబ్బతీసింది. ఒక దశలో సెనెక్స్‌ 416 పాయింట్లు నష్టపోయి 35,475.57 వద్ద, నిఫ్టీ సూచీ 131 పాయింట్లను కోల్పోయి 10,661.25 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఇంట్రాడేలో మెటల్‌, ఫార్మా, అటో, ఫైనాన్సియల్‌ రంగాలకు చెందిన మిడ్‌క్యాప్‌ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 214 పాయింట్ల నష్టంతో 26,959.85 వద్ద ముగిసింది. అత్యధికం‍గా మెటల్‌ ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ స్వల్పంగా(0.02శాతం) నష్టపోయింది. 
ఐఓసీ, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌సీఎల్‌, ఐషర్‌మోటర్స్‌ కంపెనీ షేర్లు 3.30శాతం నుంచి 4.50శాతం నష్టపోగా, బజాజ్‌ అటో, ఏషియన్‌ పేయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టైటాన్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు అరశాతం నుంచి 3.50శాతం లాభాల్లో ముగిశాయి.



You may be interested

మార్కెట్లు ముందుకా... లేదంటే వెనక్కా?: ఏంజెల్‌ బ్రోకింగ్‌

Thursday 3rd January 2019

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సామాన్య ఇన్వెస్టర్లకు అర్థం కావడం లేదు. డిసెంబర్‌ నెలలో రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందు నిఫ్టీ 10,000 మార్క్‌ వరకు వెళ్లగా... ఫలితాల తర్వాత నుంచి ప్రధాన సూచీలు పైకే పరుగులు తీశాయి. దీంతో నిఫ్టీ 11,000మార్క్‌ సమీపానికి చేరుకుంది. ఇంకేముందు ఈ మార్క్‌ను దాటిపోతుందన్న అంచనాలతో ఉండగా... అనూహ్యంగా దిగువ వైపునకు పడిపోవడం ఆరంభించింది. గత రెండు సెషన్లలో మార్కెట్లు రెండు శాతం

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా...కొనొచ్చు: బ్రోకరేజ్‌లు

Thursday 3rd January 2019

బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ల మార్పిడి నిష్పత్తి ద్వారా విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌లను విలీనం చేసుకోడానికి సిద్ధమైంది. ఈ రెండు బ్యాంకులను విలీనం చేసుకున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. విలీన ప్రతిపాదన ప్రకారం.. విజయా బ్యాంక్ షేర్‌హోల్డర్లకు సంబంధించి ప్రతి 1,000 షేర్లకు బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అటు దేనా బ్యాంక్ విషయానికొస్తే.. ప్రతి 1,000 షేర్లకు 110 బీవోబీ

Most from this category