STOCKS

News


11500 పైన నిఫ్టీ

Friday 14th September 2018
Markets_main1536921445.png-20256

  • 38వేల పైన సెన్సెక్స్‌
  • రాణించిన బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా షేర్లు

మార్కెట్‌  వారంతపు రోజైన శుక్రవారం లాభంతో ముగిసింది. రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరల దిగిరావడంతో పాటు టోకు ద్రవ్యోల్బణ సూచీ 4నెలల కనిష్టానికి చేరుకుందనే వార్తలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. బ్యాంకింగ్‌, అటోమొబైల్‌, మెటల్‌, ఫార్మా రంగ షేర్లలో కొనుగోలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 38వేల స్థాయిని, నిఫ్టీ 11500 మార్కును అందుకున్నాయి. చివరికి సెన్సెక్స్‌ 373 పాయింట్ల లాభంతో 38090 వద్ద, నిఫ్టీ 145 పాయింట్ల భారీ లాభంతో 11515 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో రంగాలకు చెందిన సూచీలు లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్‌ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచి 2శాతం వరకూ లాభపడింది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.50శాతం (344 పాయింట్లు) లాభపడి 27,163.85 వద్ద ముగిసింది. నిఫ్టీ -50 సూచీలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి.
గెయిల్‌, ఇన్ఫోసిస్‌, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌టెక్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి. వేదాంత, హెచ్‌పీసీఎల్‌, బజాజ్‌ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్స్‌ఫైనాన్స్‌ షేర్లు 5నుంచి7శాతం లాభపడ్డాయి.



You may be interested

42,000లకు సెన్సెక్స్-మోర్గాన్‌స్టాన్లీ అంచనా

Friday 14th September 2018

ప్రముఖ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ తాజాగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టార్గెట్‌ను పెంచింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ నాటికి సెన్సెక్స్‌ 42,000 పాయింట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.  కాగా మోర్గాన్‌ స్టాన్లీ ఇదివరకు 2019 జూన్‌ నాటికి సెన్సెక్స్‌ 36,000 పాయింట్లకు వెళ్తుందని అంచనా వేసింది. అయితే 2018 జూలైలోనే సెన్సెక్స్‌ ఈ మార్క్‌ను అధిగమించేసింది. ఇండెక్స్‌ ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు దాదాపు 11 శాతంమేర ర్యాలీ చేసింది.

2020లో ఆర్థిక సంక్షోభం

Friday 14th September 2018

జేపీ మోర్గాన్‌ అంచనా దశాబ్ద కాలం కిందటి లెహ్‌మాన్‌ బ్రదర్స్‌ సంక్షోభం గుర్తుందా? అంతర్జాతీయంగా స్టాక్‌ మార్కెట్లు పేకమేడళ్ల కూలిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు కకావికలం అయ్యాయి. అలనాటి సంక్షోభ ఛాయలు మళ్లీ కనిపిస్తున్నాయని, అప్పటి పరిస్థితుల ఆధారంగా చూస్తే 2020లో మరోమారు ఆర్థిక సంక్షోభం రావొచ్చని అంచనా వేస్తోంది దిగ్గజ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ జేపీ మోర్గాన్‌ చేజ్‌ అండ్‌ కో. ఇక్కడ మంచి విషయం ఏంటంటే.. గతంలో మాదిరిగా భయానక వాతావరణం

Most from this category