STOCKS

News


ప్రపంచ మార్కెట్ల కల్లోలం...సెన్సెక్స్‌ 344 పాయింట్లు డౌన్‌

Thursday 25th October 2018
Markets_main1540462955.png-21484

  • 10150 దిగువకు నిఫ్టీ

ముంబై:- ప్రపంచ మార్కెట్లు తీవ్ర పతనం చవిచూసిన నేపథ్యంలో భారత్‌ సూచీలు గురువారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. గత రాత్రి అమెరికా సూచీలు 2-3 శాతం, నేడు ఆసియాలో ప్రధాన సూచీలు 1-4 శాతం మధ్య పతనమైన నేపథ్యంలో గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన భారత్‌ సూచీలు...ప్రతీ చిన్న పెరుగుదలలోనూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. నేడు అక్టోబర్‌ సిరీస్‌ డెరివేటివ్స్‌ గడువు నేపథ్యంలో ట్రేడర్లు...వారి పొజిషన్ల స్క్వేర్‌ఆఫ్‌ కార్యకలాపాల్లో నిమగ్నంకావడంతో దిగువస్థాయిలోనే సూచీలు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. పైగా కొన్ని ప్రధాన కంపెనీలు విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించకపోవడం కూడా మార్కెట్‌ నష్టాలకు ముగింపునకు కారణమయ్యాయి. ఒక్క ఐటీ రంగ షేర్లు తప్ప, మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ మళ్లీ 34వేల దిగువకు, నిఫ్టీ 10150 దిగువకు వచ్చాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మార్కెట్‌ ముగింపు వరకు సాగిన అమ్మకాల వెల్లువలో చివరకు సెన్సెక్స్‌ సూచీ 344 పాయింట్లు నష్టపోయి 33,690 వద్ద నిఫ్టీ సూచీ 100 పాయింట్ల నష్టపోయి 10,125 వద్ద ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ సైతం 25000ల మార్కును కోల్పోయి 24,817 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అత్యధికంగా బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ ఇండెక్స్‌ మాత్రం (0.25శాతం) స్వల్పంగా లాభపడింది. సెన్సెక్స్‌ సూచీ 33,553 - 33,838 రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ సూచీ 10,167 - 10,079 రేంజ్‌లో ట్రేడైంది.
హిందాల్కో, వేదాంత, యూపీఎల్‌, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, భారతీఎయిర్‌టెల్‌ షేర్లు 3నుంచి 6శాతం నష్టపోగా, కోటక్‌ బ్యాంక్‌, ఐఓసీ, హెచ్‌సీఎల్‌టెక్‌, కోల్‌ ఇండియా, విప్రో షేర్లు 1నుంచి3శాతం లాభపడ్డాయి.



You may be interested

కొనుగోళ్లకు ఇది కాలం కాదు!

Thursday 25th October 2018

ఇన్వెస్టర్లకు వివేక్‌ మవానీ సూచన నిఫ్టీలో వంద, నూటయాభై పాయింట్ల ఊగిసలాటి ఇవాళరేపు కామనయిపోయిందంటున్నాడు ప్రముఖ ఇన్వెస్టర్‌ వివేక్‌ మవానీ. సూచీలు ఎంత ప్రయత్నించినా బౌన్స్‌బ్యాక్‌ నిలవడంలేదన్నారు. యూఎస్‌ మార్కెట్లు పడకముందే మన మార్కెట్లలో కరెక‌్షన్‌ ఆరంభమైందని, ఇప్పుడు అమెరికా మార్కెట్లు కూడా ఢమాల్‌మనడం ఆరంభించినందున మన సూచీల్లో మరింత పతనం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందువల్ల బాటమ్‌అవుట్‌ అయ్యాయని భావించి హడావుడిగా కొనుగోళ్లు చేయవద్దని ఇన్వెస్టర్లకు ఆయన సూచించారు. కేవలం

అంచనాల్ని అందుకోని భెల్‌...షేరు 7 శాతం క్రాష్‌

Thursday 25th October 2018

ముంబై:- విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌(భెల్‌) నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయాయి.  బీహెచ్‌ఈఎల్‌ ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో రూ.185.17 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.115.42 కోట్లతో పోలిస్తే ఇది 60శాతం అధికం. అయితే విశ్లేషకులు మాత్రం ఈ క్యూ2లో భెల్‌ కంపెనీ రూ.218 కోట్ల

Most from this category