STOCKS

News


నిఫ్టీ లాభం 100 పాయింట్లు

Tuesday 13th November 2018
Markets_main1542104975.png-21960

35వేల ఎగువకు సెన్సెక్స్‌
10550 స్థాయిని అందుకున్న నిఫ్టీ
రాణించిన హెవీవెయిట్‌ షేర్లు

మిడ్‌సెషన్‌ నుంచి సాగిన కొనుగోళ్లతో మార్కెట్‌ మంగళవారం భారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ తిరిగి 35వేల మార్కును, నిఫ్టీ 10500 మార్కును తిరిగి అందుకున్నాయి. ప్రపంచమార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా సూచీలు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మిడ్‌ సెషన్‌ వరకు నష్టాల్లో ట్రేడయ్యాయి. మిడ్‌ సెషన్‌ తరువాత ప్రైవేట్‌ బ్యాంక్‌ రంగ బ్యాంక్‌, ఆర్థిక రంగ, అటో రంగ షేర్లలో కొనుగోళ్ల కారణంగా సూచీలు లాభాల్లో మళ్లాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడే కనిష్టం నుంచి 516 పాయింట్ల లాభపడగా, నిఫ్టీ సూచీ 156 పాయింట్ల రివకరి అయ్యింది. చివరకు సెన్సెక్స్‌ 331 పాయింట్ల లాభపడి 35,144 వద్ద ముగిసింది. నిఫ్టీ 100 పాయింట్ల పెరిగి 10,582 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ఎఫ్‌ఎంజీసీ, అటో, మెటల్‌, ఐటీ రంగాలకు చెందిన సూచీలు లాభపడ్డాయి. మరోవైపు ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్‌, రియల్టీ రంగాలకు చెందిన ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ లాంటి హెవీ వెయిట్‌ షేర్ల ర్యాలీ కూడా సూచీల భారీ లాభాల ముగింపునకు కారణమని చెప్పవచ్చు.
మిడ్‌సెషన్‌ వరకు అమ్మకాలు:-
ప్రపంచమార్కెట్ల నుంచి అందిన ప్రతికూలాంశాలతో పాటు దేశీయ రిటైల్‌ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంతంత మాత్రంగానే నమోదు కావడంతో నేడు దేశీయ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 34 పాయింట్ల లాభంతో 34,812 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 10,451 వద్ద ప్రారంభమయ్యాయి. ఆటో మొబైల్‌, బ్యాంక్స్‌, ఇంధన, వినిమయ, ఐటీ షేర్లలో తొలుత అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా నేటి ట్రేడింగ్‌లో ఫార్మా షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. రేపు బీఎస్‌ఈలో లిస్టైన దాదాపు 1400 కంపెనీలు క్యూ2 ఫలితాలను ప్రకటించినున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తత వహించారు. ఫలితంగా మిడ్‌ సెషన్‌ సమయానికి తీవ్ర అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో సెన్సెక్స్‌ 141 పాయింట్లను కోల్పోయి 34,672 వద్ద, నిప్టీ 42 పాయింట్ల నష్టపోయి 10440 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.
లాభాల్లోకి సూచీలు:-
మిడ్‌ సెషన్‌ సమయానికల్లా ఆసియా మార్కెట్లు నష్టాల్లోంచి తిరిగి కోలుకోవడం, వాల్‌స్ట్రీట్‌ ఫ్యూచర్స్‌ లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటం, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. మరోవైపు ముడి చమురు సరఫరాను తగ్గించవద్దని ఒపెక్‌ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఒత్తిడి తీసుకురావడంతో నేటి ట్రేడింగ్‌లో చమురు ధరలు 1శాతానికి పైగా దిగివచ్చాయి. ఈ సానుకూలాంశాల నేపథ్యంలో మిడ్‌ సెషన్‌ తరువాత ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్లకు తెరలేపారు. ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంక్‌ రంగ బ్యాంక్‌, ఆర్థిక రంగ, అటో రంగ షేర్లలో కొనుగోళ్ల వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్‌ సూచీ ఇంట్రాడే కనిష్టం నుంచి 34,672 కోలుకుని 516 పాయింట్ల లాభపడి  35,188 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సూచీ ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి 310,440.55 రివకరీ అయ్యి 156 పాయింట్ల పెరిగి  10,596.25 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.
దిగివచ్చిన చమురు ధరలు: ఆయిల్‌ షేర్ల ర్యాలీ:-
ముడి చమురు సరఫరాను తగ్గించవద్దని ఒపెక్‌ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఒత్తిడి తీసుకురావడంతో  నేటి ట్రేడింగ్‌లో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ర్యాలీ చేశాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి లాభాల బాట పట్టిన ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు... ట్రేడింగ్‌ చివరకి వరకు అంతే ఉత్సాహాంగా ర్యాలీ చేశాయి. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ 3నుంచి 4.50శాతం ర్యాలీ చేశాయి.
ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ, ఐచర్‌ మోటర్స్‌ షేర్లు 3నుంచి 6.50శాతం లాభపడ్డాయి. సిప్లా, పవర్‌ గ్రిడ్‌, ఇండియబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, టాటామోటర్స్‌, సన్‌ఫార్మా షేర్లు 1శాతం నుంచి 5శాతం నష్టపోయాయి.You may be interested

ఆకర్షిస్తున్న 5 బ్యాంకు స్టాక్స్‌!

Wednesday 14th November 2018

దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడిన బ్యాంకింగ్‌ రంగం చారిత్రకంగా చూస్తే ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతూ వస్తోంది. అయితే, ఎన్‌పీఏల సమస్యలతో ఇటీవలి కాలంలో బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కళ తప్పాయి. అయితే, ఇది స్వల్ప కాలం పాటు ఉండే సమస్యే. దీని కారణంగా బ్యాంకింగ్‌ స్టాక్స్‌ చాలా వరకు విలువల పరంగా ఆకర్షణీయ స్థా‍యికి దిగొచ్చాయి. ‘‘క్రెడిట్‌ వృద్ధి మోస్తరుగా ఉంది. పీఎస్‌యూ బ్యాంకులు తమ డిపాజిట్‌ బేస్‌ను పెంచుకున్నాయి. రుణ

రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇది సువర్ణ అవకాశం..!

Tuesday 13th November 2018

ముంబై: దేశీయంగా కొనసాగుతున్న ద్రవ్యలభ్యత కొరత కారణంగా స్టాక్‌ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈఓ అరుణ్‌ తుక్రాల్‌ వ్యాఖ్యానించారు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఇందుకు ప్రధాన కారణం కాగా, ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కార మార్గం దొరకలేదని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ విషయానికి వస్తే.. డోజోన్స్‌ ఇప్పటికే కరెక్ట్‌ అయ్యింది. అమెరికా ఫెడ్‌

Most from this category