News


10750 పైన నిఫ్టీ ముగింపు

Monday 19th November 2018
news_main1542623697.png-22190

  • 300 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్‌

సానుకూల అంతర్జాతీయ సంకేతాలు మరోసారి దేశీయ మార్కెట్‌ను ముందుండి నడిపించాయి. ఫలితంగా మార్కెట్‌ వరుసగా 3రోజూ లాభాల్లో ముగిసింది.  ఆసియా మార్కెట్ల లాభాల ముగింపు, ఐరోపా మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్లు లాభాల ట్రేడింగ్‌ సూచీలకు కలిసొచ్చాయి. ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌, ఫార్మా, అటో, రియల్టీ రంగ షేర్ల కొనుగోళ్ల మద్దతు లభించింది. పలితంగా సెన్సెక్స్‌ 300 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 10750 పాయింట్ల మార్కును అందుకుంది. ఆర్‌బీఐతో  కేంద్రం చర్చలు నేపథ్యంలో సూచీలు మిడ్‌సెషన్‌ వరకు స్తబ్దుగా ట్రేడయ్యాయి. మిడ్‌సెషన్‌ నుంచి  సూచీలు క్రమంగా లాభాల్ని ఆర్జిస్తూ వచ్చాయి. ముఖ్యంగా స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లోని హెవీ వెయిట్‌ షేర్లైన ఐటీసీ(3 శాతం), రిలయన్స్‌ ఇండస్ట్రీస్(2 శాతం),హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌( 0.60 శాతం)సూచీలకు అధిక లాభాలను సమకూర్చాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 35,511 - 35,819 మధ్య కదలాడి చివరికి 318 పాయింట్ల లాభంతో 35,775 వద్ద ముగిసింది. నిఫ్టీ 81 పాయింట్ల లాభపడి 10650 పైన 10763 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈసూచీ 10,689 - 10,774.70 మధ్య ట్రేడైంది. ఎన్‌ఎస్‌ఈలో మరో ప్రధాన సూచీ బ్యాంక్‌ నిఫ్టీ 90.80 పాయింట్లు లాభపడి 26,300 వద్ద ముగిసింది. ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన ఇండెక్స్‌లు తప్ప అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ రంగానికి చెందిన ఇండెక్స్‌ అత్యధికంగా 2శాతం లాభపడింది.   
వేదాంత, ఇండస్‌ ఇండ్‌, టాటామోటర్స్‌, ఐటీసీ యస్‌ బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 8శాతం లాభపడ్డాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్‌, గెయిల్‌, ఇండియబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 1శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి



You may be interested

హార్లిక్స్‌ కోసం నెస్లే, యూనిలీవర్‌ మధ్య పోటీ

Monday 19th November 2018

భారత మార్కెట్లో హార్లిక్స్‌, బూస్ట్‌ తదితర ఉత్పత్తులతో కూడిన గ్లాక్సో స్మిత్‌క్లయిన్‌ (జీఎస్‌కే) కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ వ్యాపారం కోసం యూనిలీవర్‌తో నెస్లే తీవ్రంగా తలపడనుంది. ఎందుకంటే ఈ పోటీ నుంచి ప్రధాన ‍ప్రత్యర్థి కోకో కోలా తప్పుకున్నట్టు సమాచారం. జీఎస్‌కే కన్జ్యూమర్‌లో జీఎక్‌కే వాటా కొనుగోలు ధర 3.1 బిలియన్‌ డాలర్ల నుంచి 3.5 బిలియన్‌ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. విజయవంతంగా బిడ్‌లో గెలిచిన కంపెనీ ఓపెన్‌ ఆఫర్‌

3 వారాల్లో లాభాలందించే 10 స్టాక్స్‌

Monday 19th November 2018

బ్రోకరజ్‌ సంస్థలు వచ్చే మూడు వారాల్లో లాభాలను అందించగలిగే 10 స్టాక్స్‌ను సిఫార్సు చేశాయి. సిఫార్సుల వివరాలు.... ఆనంద్‌రాఠి అపోలో హాస్పిటల్‌: ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. టార్గెట్‌ ప్రైస్‌ రూ.1,350. స్టాప్‌ లాస్‌ రూ.1,190. టెక్నికల్‌గా చూస్తే ఈ స్టాక్‌ ఇన్‌వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచింది. బుల్లిష్‌ ట్రెండ్‌ను సూచిస్తోంది. వేవ్‌-4 పూర్తయ్యింది. వేవ్‌-5 ప్రారంభం కావొచ్చు.  కెనరా బ్యాంక్‌: ఈ స్టాక్‌ గత వారపు నిరోధ స్థాయి నుంచి

Most from this category