STOCKS

News


లాభాలు ఒక్కరోజుకే పరిమితం.

Wednesday 26th September 2018
Markets_main1537957533.png-20606

  • మళ్లీ నష్టాల్లో ముగిసిన మార్కెట్‌

సూచీలు ఆరంభ లాభాలను నిలుపుకోవడంలో విఫలవడంతో మార్కెట్‌ లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. ఈ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టులు రేపటితో ముగియనుండటం, అమెరికాలో నిన్న, నేడు ఫెడ్‌రిజర్వ్‌ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాల నేఫథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా ప్రభుత్వరంగబ్యాంకు, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, అటో రంగ షేర్లలో అమ్మకాల కారణంగా బుధవారం మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 109 పాయింట్లు నష్టపోయి 36,542 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లు క్షీణించి 11054 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 46 పాయింట్ల లాభంతో 25,362 వద్ద ముగిసింది. అత్యధికంగా ప్రభుత్వరంగబ్యాంకు సూచీ నష్టపోగా వాటితో పాటు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, అటో, ఫైనాన్స్‌ రంగాలకు చెందిన సూచీలు పతమయ్యాయి. మరోవైపు మెటల్‌, ప్రైవేట్‌, ఫార్మా, రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సె‍క్స్‌ సూచీ 36,357.93 - 36,938.74(581 పాయింట్లు), నిఫ్టీ సూచీ 11,145.55 - 10,993.05(152 పాయింట్లు) రేంజ్‌లో ట్రేడయ్యాయి.
విప్రో, ఐటీసీ, ఇన్ఫ్రాటెల్‌, ఎస్‌బీఐ, టాటామోటర్స్‌ షేర్లు 2.50శాతం నుంచి 3శాతం నష్టపోగా, హిందాల్కో, టైటాన్‌, వేదాంత, యూపిఎల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 2.50శాతం నుంచి 7శాతం లాభపడ్డాయి.

 



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీ విభాగంపై సానుకూలంగా ఉన్నాం: మ్యాక్స్‌లైఫ్‌

Thursday 27th September 2018

ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌ గత కొన్ని సెషన్లలో తీవ్రంగా నష్టపోయినప్పటికీ పలువురు నిపుణులు మాత్రం ఆయా కంపెనీలపై దీర్ఘకాలానికి సానుకూల ద్పక్పథాన్నే వ్యక్తపరుస్తున్నారు. ‘‘నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల్లో (ఎన్‌బీఎఫ్‌సీ) కరెక్షన్‌ అన్నది కేవలం రేటింగ్‌ డౌన్‌ గ్రేడ్‌, విశ్వాసం కోల్పోవడం వల్ల జరిగిందే. అంతేకానీ, ఫండమెంటల్స్‌ పరంగా ఎన్‌బీఎఫ్‌సీ విభాగంపై మేం సానుకూలంగానే ఉన్నాం. అవి విస్తరించిన క్రమం, ప్రతీది తనకంటూ ప్రత్యేకమైన విభాగంలో కీలకంగా ఉండడంతో మార్జిన్లను నిలబెట్టుకోగలవు’’

నిఫ్టీలో షార్ప్‌ రికవరీకి ఛాన్స్‌!

Wednesday 26th September 2018

నిఫ్టీ ఈ నెలలో ఇప్పటి దాకా 5 శాతానికిపైగా కరెక‌్షన్‌కు గురైంది. ప్రస్తుతం ఇది బ్రాడెనింగ్‌ వెడ్జ్‌ ప్యాట్రన్‌ సపోర్ట్‌ లైన్‌కు దగ్గరిలో ట్రేడ్‌ అవుతోంది. ఇది 10,880-10,855 జోన్‌ వద్ద ఉందని యస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆదిత్య అగర్వాల్‌ తెలిపారు. ఈ మద్దతు స్థాయికి పైన స్థిరపడితే.. 11,205-11,410 వరకు షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీ జరగొచ్చని పేర్కొన్నారు. అదేసమయంలో ఈ జోన్‌ దిగువకు పడిపోతే.. అంటే 10,855

Most from this category