STOCKS

News


11300 దిగువన నిఫ్టీ ముగింపు

Tuesday 18th September 2018
Markets_main1537266193.png-20356

మార్కెట్‌ పతనం మంగళవారమూ కొనసాగింది. బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో, మెటల్‌ రంగ షేర్లలో చివరి గంటలో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా కేంద్రం మరో మూడు ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి తెరతీయడంతో బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్ల క్షీణత నేటి మార్కెట్‌ను నష్టాల బాట పట్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో తొలగని వాణిజ్య యుద్ధ భయాలు, మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు, రూపాయి క్షీణత కారణంగా మార్కెట్లో చివర గంటలో అ‍మ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 295 పాయింట్ల నష్టంతో 37,290 వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల నష్టంతో 11,279 పాయింట్ల వద్ద ముగిశాయి. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ 384.90 నష్టపోయి 26,435.40 వద్ద ముగిశసింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 342 పాయింట్ల నష్టపోయి 37243 -  37745 రేంజ్‌లో కదలాడింది. నిఫ్టీ  110 పాయింట్ల వరకు క్షీణించి 11,269 - 11,411 స్థాయిలో కదలాడింది. ఎన్‌ఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ రంగ సూచీ తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 5శాతం వరకు నష్టపోయింది.
బేర్‌మన్న బ్యాంకింగ్‌ షేర్లు:- ప్రపంచ ప్రతికూలతల నడుమ స్వల్ప లాభంతో ప్రారంభమైన సూచీలు మిడ్‌సెషన్‌ సెషన్‌ వరకు లాభనష్టాల మధ్య ట్రేడయ్యాయి. అయితే, ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లలో అ‍మ్మకాలు మొదలయ్యాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలోకి దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌లను విలీనం చేసి మరో మెగాబ్యాంక్‌ ఏర్పాటుకు కేంద్రం తెరతీయడంతో మంగళవారం బ్యాంకింగ్‌ రంగ షేర్లు బేరమన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగానికి బ్యాంకింగ్‌ షేర్లు నిట్టనిలువగా పతనమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలోని ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 5శాతం వరకు నష్టపోయింది. ఈ సూచీలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్యాంక్‌ షేరు 17శాతం నష్టపోయింది.
బజాజ్‌ అటో, హెచ్‌పీసీఎల్‌, టాటామోటర్స్‌, ఇండియన్‌బుల్స్‌హౌసింగ్స్‌, ఎస్‌బీఐ షేర్లు 3నుంచి 4శాతం నష్టపోగా, ఐటీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఓఎన్‌జీసీ, యస్‌బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనిలివర్‌ షేర్లు 1నుంచి 4శాతం లాభపడ్డాయి.



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీకి భారీనష్టం

Tuesday 18th September 2018

బ్యాంకింగ్‌ షేర్లలో పతనంలో భాగంగా నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌లో 1.50శాతం నష్టపోయింది. నేడు 26,407ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఈ సూచీలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 19శాతం నష్టపోగా, పీఎన్‌బీ, ఎస్‌బీఐ, ఫెడరల్‌ బ్యాంక్‌, యాక్సి్‌స్‌ బ్యాంక్‌, 4శాతం నుంచి 3శాతం క్షీణించాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంకు, కోటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు షేర్లు 2నుంచి 1శాతం వరకు పతనమయ్యాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ

ట్రేడింగ్‌ వేళల పొడిగింపు వాయిదా..!?

Tuesday 18th September 2018

మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ అక్టోబర్‌ 1నుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించే అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం 9:00 నుంచి రాత్రి 11.55 గంటల వరకూ ట్రేడింగ్‌ నిర్వహించే అంశంపై స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లు, బ్రోకర్లలు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం సెబీ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలో ఈక్విటీ డెరివేటివ్స్‌ విభాగంలో ఉదయం 9:00 నుంచి రాత్రి 11.55 గంటల వరకూ ట్రేడింగ్‌

Most from this category