STOCKS

News


కనిష్టస్థాయిల నుంచి రికవరీ

Thursday 13th June 2019
Markets_main1560422729.png-26275

మిడ్‌సెషన్‌ కొనుగోళ్లతో సూచీలు కనిష్టస్థాయి నుంచి రికవరీ సాధించి  గురువారాన్ని మిశ్రమంగా ముగించాయి. సెన్సెక్స్‌ 15 పాయింట్ల నష్టంతో 39,741.36 వద్ద, నిఫ్టీ 8 పాయింట్ల స్వల్ప లాభంతో 11,914.05 వద్ద ముగిసింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నడుమ నేడు మార్కెట్‌ నష్టాలతో మొదలైంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ట్రేడింగ్‌,  చైనాతో వాణిజ్య వివాద పరిష్కారంపై ట్రంప్‌ నిరుత్సాహకరంగా స్పందించడంతో అమెరికా, ఆసియా మార్కెట్లు నేలచూపులకు పరిమితంకావడంతో తదితర కారణాలతో మార్కెట్లో మిడ్‌సెషన్‌ వరుకు తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొం‍ది. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మెటల్‌, ఐటీ షేర్లలో విక్రయాలు అధికంగా జరిగాయి. ఒకదశంలో సెన్సెక్స్‌ 396 పాయింట్లు నష్టపోయి 39,461.27 వద్ద, నిఫ్టీ 109 పాయింట్లను నష్టపోయి 11,817.05 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసింది. అయితే మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్లో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకింగ్‌, రియల్టీ, పవర్‌ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ , నిఫ్టీ 109 పాయింట్ల నష్టాలను పూడ్చుకోగలిగాయి. గురువారం ట్రేడింగ్‌లో మారుతి, ఐఓసీ, యూపీఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 13.50శాతం నష్టపోగా, కోటక్‌ బ్యాంక్‌, గ్రాసీం, బీపీసీఎల్‌, జీ లిమిటెడ్‌,ఇండియాబుల్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 12శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఇవి... సూపర్‌ సిక్స్‌

Thursday 13th June 2019

ఈ ఏడాది ఇప్పటి వరకు సెన్సెక్స్‌ 10 శాతం రాబడులను ఇచ్చింది. అంతేకాదు ప్రతీ నెలలోనూ జనవరి నుంచి మే వరకు సానుకూల రాబడులను ఇవ్వడం గమనార్హం. మరి బీఎస్‌ఈ-500లో ఎన్ని ప్రధాన సూచీలను మించి రాబడులను ఇచ్చి ఉంటాయన్నది ఆలోచించండి. కేవలం ఆరు స్టాక్స్‌ మాత్రమే అని చెప్పక తప్పదు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ప్రతీ నెలలోనూ ఈ ఆరు స్టాక్స్‌ బెంచ్‌ మార్క్‌ను

చినుకు పడకపోతే చిక్కులే!

Thursday 13th June 2019

(SAKSHI BUSINESS EXCLUSIVE) థాంప్సన్‌ టీవీ ఇండియా సీఈఓ అవనీత్‌ సింగ్‌ న్యూఢిల్లీ, సాక్షి బిజినెస్‌: ఈ ఏడాది రుతుపవనాలు సరిగా వర్షించకపోతే అన్ని రంగాలకు గడ్డుకాలం వస్తుందని ఎస్‌పీపీఎల్‌ సీఈఓ అవనీత్‌ సింగ్‌ మార్వా హెచ్చరించారు. ఎకానమీ, ముఖ్యంగా రూరల్‌ ఎకానమీ మందగమన కోరల్లో ఉందని, సరైన వర్షపాతమే ఈ ఆపద నుంచి గట్టెక్కిస్తుందని చెప్పారు. స్వాతంత్రానంతరం ఇన్నేళ్లు గడిచినా, రుతుపవనాల కోసం ఎదురుచూడాల్సి రావడం బాధాకరమని, నదుల అనుసంధానమే ఇందుకు

Most from this category