STOCKS

News


స్వల్ప నష్టంతో ముగింపు

Friday 9th November 2018
Markets_main1541758695.png-21829

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 79 పాయింట్లు నష్టంతో 35,158 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 10,585 వద్ద ముగిసింది. ప్రపంచ ప్రతికూలతల నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ సూచీలు లాభాలతో మొదలైనా,  వెంటనే వెనకడుగు వేశాయి. డాలర్‌ మారకంలో రూపాయి క్షీణతతో ఐటీ షేర్లు పతనం, హెవీవెయిట్‌ షేర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీలు క్షీణించడం నేడు సూచీల నష్టాల ముగింపునకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఎన్ఎస్‌ఈలోని నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 33 పాయింట్ల స్వల్పలాభంతో 25771 వద్ద ముగిసింది. ఐటీ, మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఎఫ్‌ఎంజీసీ, రియల్టీ రంగాలకు చెందిన సూచీలు నష్టాలతో ముగిశాయి. మరోవైపు నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 1.50శాతం లాభంతో ముగిసింది. వాటితో పాటు అటో, ఆర్థిక, ప్రైవేట్‌ రంగాలకు చెంది సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌ సూచీ 35,011 - 35,287.29 స్థాయిలో కదలాడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 10,545 -10,619 పాయింట్ల శ్రేణిలో కదలాడింది.
గెయిల్‌, డాక్టర్‌రెడ్డీస్‌, హిందాల్కో, ఇన్ఫోసిస్‌, భారతీఎయిర్‌టెల్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టపోగా, ఏషియన్‌ పేయింట్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, ఆదానీపోర్ట్స్‌, హెచ్‌పీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం నుంచి 5.50శాతం లాభపడ్డాయి.
ప్రపంచ మార్కెట్లో ప్రతికూలత:-
ఇటలీ బడ్జెట్‌ సంక్షోభం మరోసారి తెరపైకి రావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా  నేడు యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ముగిసాయి. అమెరికా ఇండెక్స్‌ ఫ్యూచర్లు కూడా మన మార్కెట్‌ ముగిసే సమయానికి తగ్గుదలతో ట్రేడవుతున్నాయి. ఈ ప్రతికూలాంశాలు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌కు విఘాతంగా మారాయి. 



You may be interested

దీర్ఘకాలానికి ఐఐఎఫ్‌ఎల్‌ సిఫార్సులు.!

Friday 9th November 2018

ముంబై: స్వల్పకాలనికి దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్యనే కొనసాగేందుకు ఆస్కారం ఉందని ఇండియ‌న్ ఇన్ఫోలైన్ లిమిటెడ్‌(ఐఐఎఫ్ఎల్‌) సీఈఓ అరిందం చందా అంచనావేశారు. అక్టోబర్‌, డిసెంబర్‌ భారీ పతనం నుంచి కోలుకుంటున్న సూచీలు.. పలు కార్పొరేట్‌ కంపెనీల ఎర్నింగ్స్‌ బాగుండడం, క్రమంగా సెంటిమెంట్‌ బలపడడం వంటి కారణాలతో ఆశాజనకంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రతికూల అంశాలు, ద్రవ్యలభ్యత అంశాల కారణంగా షార్ట్‌టెర్మ్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ.. వచ్చే ఏడాది దీపావళి నాటికి

ఇండియన్‌ బ్యాంక్‌పై మొండిబాకీల బండ..

Friday 9th November 2018

నికర లాభం 67 శాతం డౌన్‌ పెరిగిన ఎన్‌పీఏలు షేరు 12 శాతానికిపైగా క్రాష్‌ ఇండియన్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. బ్యాంక్‌ నికర లాభం 67 శాతంమేర క్షీణించింది. రూ.150 కోట్లుగా నమోదయ్యింది. మొండిబకాయిల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.451 కోట్లుగా నమోదయ్యింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.4,874

Most from this category