STOCKS

News


ఆద్యంతం ఊగిసలాట.. ఆఖరులో ఫ్లాట్‌ ముగింపు

Wednesday 19th June 2019
Markets_main1560940723.png-26424

  • 554 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ 
  • కుప్పకూలిన మిడ్‌ క్యాప్‌ షేర్లు

ఆరంభ లాభాల్ని నిలుపుకోవడంలో సూచీలు విఫలమడంతో మార్కెట్‌ బుధవారం స్వల్ప లాభంతో సరిపెట్టుకుంది. సెన్సెక్స్‌ 66.40 పాయింట్ల లాభంతో 39,112 వద్ద ముగిసింది. నిఫ్టీ ఎలాంటి లాభ నష్టాలు లేకుండా ఫ్లాట్‌గా గత ముగింపు స్థాయి 11,691 వద్ద స్థిరపడింది. మిడ్‌ సెషన్‌ నుంచి అటో, బ్యాంకింగ్‌, ఫార్మా, ఐటీ షేర్లలో అమ్మకాలతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్‌ షేర్లు కుప్పకూలడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 554 పాయింట్ల రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ 177 పాయింట్ల స్థాయిలో ట్రేడయింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహకర సంకేతాలతో నేడు మార్కెట్‌ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు కట్టుబడ్డారు. మెటల్‌, బ్యాంక్స్‌, రియల్టీ రంగాలకు షేర్లకు భారీ కొనుగోళ్ల మద్ధతు లభించడంతో ట్రేడింగ్‌ ప్రారంభమైన గంటలోపే సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 389 పాయింట్లు పెరిగి 39,435.80 వద్ద, నిఫ్టీ 111 పాయింట్ల లాభపడి 11,802.50 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది. నిఫ్టీ 11800ల స్థాయిని తాకిన నేపథ్యంలో మార్కెట్లో మెల్లగా అమ్మకాలు మొదలయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, ఫార్మా, ఆటో రంగ షేర్లు లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. మన మార్కెట్‌ మిడ్‌సెషన్‌ అనంతరం ప్రారంభమైన యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని మరింత దెబ్బతీసింది. ఫలితంగా చివరి గంటలో సూచీలు తీవ్ర లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 165 పాయింట్లను కోల్పోయి 39000 మార్కును కోల్పోయి 38,881 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ సైతం 66 పాయింట్లు నష్టపోయి 11,625.10 వద్దకు చేరుకుంది. అయితే చివరి అరగంట కొనుగోళ్లు సూచీలు నష్టాలను కొంత మేర పూడ్చగలిగాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 66.40 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ గత ముగింపు స్థాయి 11,691 వద్ద ముగిసింది. 
ఇండస్‌ఇండ్‌, అదానీ పోర్ట్స్‌, యూపీఎల్‌, యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 3శాతం నుంచి 8.50శాతం నష్టపోగా, టైటాన్‌, ఎన్‌టీపీసీ, కోటక్‌ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌, టాటా స్టీల్‌ షేర్లు 1.50శాతం నుంచి 5.50శాతం లాభపడ్డాయి.



You may be interested

ఈ నెల 24న ఇండియా మార్ట్‌ ఐపీఓ

Wednesday 19th June 2019

బిజినెస్‌ ఉత్పత్తులను అందించే అతిపెద్ద ఆన్‌లైన బీటూబీ సంస్థ ఇండియా మార్ట్‌ ఇంటర్‌ మెస్‌ జూన్‌ 24న ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు(ఐపీఓ)కి రానుంది. ముఖవిలువ రూ.10గల 48.88 లక్షల షేర్లను ఐపీఓలో అందుబాటులో ఉంచనుంది. ఇష్యూ ధర శ్రేణి షేరు రూ.970-973గా నిర్ణయించింది. ఇష్యూ ప్రైస్‌బ్యాండ్‌లో పై అవధి రేటు రూ. 973 వద్ద రూ.475.59కోట్లను సమీకరించాలని సంస్థ భావిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లు జూన్‌ 21న బిడ్‌లు వేసుకునే అవకాశం

స్విగ్గీలో కార్లైల్‌ గ్రూప్‌ పెట్టుబడులు!

Wednesday 19th June 2019

అమెరికా కంపెనీ కార్లైల్‌, స్విగ్గీలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడుతోంది. స్విగ్గీలో కార్లైల్‌ గ్రూప్‌ 20 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. స్విగ్గీలో ఇన్వెస్ట్‌ చేస్తే కార్లైల్‌కు ఇది ఇండియాలో రెండో పెట్టుబడి కానుంది. బెంగుళూరు కంపెనీ డెలివరీలో కార్లైల్‌ 2017లో పెట్టుబడులు పెట్టింది. స్విగ్గీ 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను గత ఏడాది డిసెంబర్‌లో సాధించింది. స్విగ్గీలో పెట్టుబడి దారుగా ఉన్న నస్పర్స్‌ లిమిటెడ్‌ నాయకత్వంలో

Most from this category