STOCKS

News


స్వల్ప లాభాలతో గట్టెక్కిన సూచీలు

Friday 7th June 2019
Markets_main1559904136.png-26162

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి అరగంట కొనుగోళ్లతో గట్టెక్కాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 39,615.90 వద్ద, నిఫ్టీ 26.90 పాయింట్లు పెరిగి 11,870.65 వద్ద ముగిశాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను పావుశాతం మేర తగ్గించినప్పటికీ.., నిన్న మార్కెట్‌ భారీ నష్టాలపాలైన నేపథ్యంలో నేటి ఇంట్రాడేలో ఆద్యంతం సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 19 పైసలు బలపహీనపడటం తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. నిఫ్టీ 132 పాయింట్ల రేంజ్‌లో 11,769.50 - 11,897.50 శ్రేణిలో కదలాడగా, సెన్సెక్స్‌ 424 పాయింట్ల స్థాయిలో 39,279.47 - 39,703.10 రేంజ్‌లో కదలాడాయి.  చివరి అరగంటలో ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టడంతో సూచీలు రెండు రోజుల పతనం తరువాత స్వల్పలాభాల్ని ఆర్జించగలిగాయి. ఇంట్రాడేలో ఐటీ, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఇక ఫార్మా షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు విరివిగా జరగడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 209 పాయింట్ల పెరిగి 31,066.55 వద్ద స్ధిరపడింది. ఈ వారంలో జరిగిన 4 ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 100 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయింది. ఇదే వారంలో సెన్సెక్స్‌ 40,309 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,103 పాయింట్ల వద్ద తమ కొత్త జీవిత కాల గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. 
బీపీసీఎల్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ఫైనాన్స్‌, ఇన్ఫ్రాటెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం లాభపడగా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌, సిప్లా, యస్‌బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. You may be interested

బ్యాంకులే బెటర్‌!

Friday 7th June 2019

అజయ్‌ శ్రీవాస్తవ అభిప్రాయం దేశీయ ఎకానమీ నిజంగా వృద్ధి సాధించాలనుకుంటే అన్ని రకాల రుణాలను ఆర్‌బీఐ రెపోరేట్‌కు అనుసంధానిస్తే చాలని డైమెన్షన్స్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సీఈఓ అజయ్‌ శ్రీవాస్తవ చెప్పారు.  ప్రస్తుతం ఎకానమీలో పీఎస్‌యూలు, బ్యాంకులే బాగున్నాయని, వీటిలో పెట్టుబడులను పరిశీలించవచ్చని సూచించారు. షైలాక్‌(షేక్స్సియర్‌ నాటకంలో పాత్ర)లాగా బ్యాంకులు సంపద సృష్టిస్తూనే ఉంటాయని, అందువల్ల వీటిలో పెట్టుబడులే మంచివని చెప్పారు. లిక్విడిటీతో కదిలే ఇలాంటి మార్కెట్లు పలు అవకాశాలను ఇస్తాయని, వాటిని

ఆర్‌ఐఎల్‌, అరామ్‌కో డీల్‌ ఆగినట్లేనా?

Friday 7th June 2019

భారత్‌కు చెందిన దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు, సౌదీకి చెందిన అరామ్‌కోకు మధ్య రిఫైనరీ వాటా విక్రయ డీల్‌కు అడ్డంకులు వచ్చాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జామ్‌నగర్‌ రిఫైనరీలో 25 శాతం వాటా చేతులు మారేందుకు ఇరు కంపెనీలు ఒక డీల్‌పై చర్చలు జరుపుతున్నాయి. కానీ తాజాగా వాల్యూషన్ల విషయంలో ఈ చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడిందని ఎకనమిక్‌ టైమ్స్‌ వెల్లడించింది. డీల్‌కు సంబంధిచిన కంపెనీ కోర్‌వ్యాపారాన్ని మార్కెట్‌ వర్గాలు దాదాపు

Most from this category