STOCKS

News


మిశ్రమంగా ముగిసిన మార్కెట్‌

Tuesday 7th August 2018
Markets_main1533638066.png-19021

  • 11400 దిగువకు నిఫ్టీ

ముంబై:- మార్కెట్‌ మంగళవారం మిశ్రమంగా ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్‌ 26 నష్టంతో 37,665 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 11389 వద్ద ముగిసింది. మెటల్‌, అటో షేర్లు అండగా మార్కెట్‌కు నిలువగా, ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు నష్టాల్లో ముగిశాయి. సూచీలు ఇంట్రాడే మరో సరికొత్త జీవితకాల గరిష్టాలను అధిరోహించాయి. సెన్సెక్స్‌ 290 పాయింట్ల రేంజ్‌లో ట్రేడ్‌ అవ్వగా, నిఫ్టీ 68 పాయింట్ల స్థాయిలో కదలాడింది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌, అటో, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ప్రైవేట్‌ రంగాలకు చెందిన సూచీలు లాభపడ్డాయి. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ రంగ సూచీలు నష్టాలో​ముగిశాయి. కీలకమైన బ్యాంకు నిఫ్టీ 22 పాయింట్ల నష్టపోయి 27,876 వద్ద ముగిసింది.
290 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌:-
వరుసగా రెండో రోజూ సూచీలు సరికొత్త రికార్డు స్థాయి వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 157 పాయింట్ల లాభంతో 37849 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 11,423 వద్ద ట్రేడింగ్‌ను షురూ చేశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సూచీలు కొత్త గరిష్టాలను అందుకోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ పూనుకున్నారు. ముఖ్యంగా ఇటీవల బాగా ర్యాలీ చేసి ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలకు దిగడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌ 105 పాయింట్ల నష్టపోయి 37587 వద్ద నిఫ్టీ 17 పాయింట్ల పతనమైన 11,360 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌ సెషన్‌ అనంతరం ఐటీ, మెటల్‌ షేర్ల అండతో సూచీలు మళ్లీ లాభాల బాట పట్టాయి. వీటికి తోడు యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు మరింత విశ్వాసాన్నిచ్చాయి. దీంతో  సెన్సెక్స్‌ 185 పాయింట్ల లాభంలో 37877 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 11,429 వద్ద మరో సరికొత్త జీవిత కాలగరిష్టాలను నమోదు చేశాయి.
సిప్లా, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, కోల్‌ ఇండియా, అదానీ పోర్ట్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 6శాతం నష్టపోగా, ఏషియన్‌ పేయింట్స్‌, ఐషన్‌ మోటర్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, టైటాన్‌, టాటా స్టీల్‌ షేర్లు 2నుంచి 4శాతం లాభపడ్డాయి.



You may be interested

క్రికెట్‌ మాదిరి ఇన్వె‍స్ట్‌మెంట్‌ ప్రణాళిక

Tuesday 7th August 2018

ఇన్వెస్టర్లకు సమయం చాలా కీలకమైనదిగా ప్రముఖ ఇన్వెస్టర్‌, కేడియా సెక్యూరిటీస్‌ ఎండీ విజయ్‌ కేడియా పేర్కొన్నారు. క్రికెట్‌లో మాదిరి వ్యూహాలను పెట్టుబడులకు అనుసరించాల్సి ఉంటుందంటూ, క్రికెట్‌ ఫార్మాట్‌ను బట్టి గేమ్‌ ప్లాన్‌ మార్చుకున్నట్టే... ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడుల కాల వ్యవధులకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఏ విధంగా నడుచుకోవాలన్నది ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.   ఉదాహరణకు టెస్ట్‌మ్యాచ్‌ అనేది ఐదు రోజుల

నెలరోజుల్లో ఎన్నికల కాక తగులుతుంది!

Tuesday 7th August 2018

మార్కెట్లపై సమీర్‌ అరోరా అంచనా ప్రస్తుతం దేశీయ సూచీల్లో రిలీఫ్‌ర్యాలీ నడుస్తోందని, కొంత కాలం పోతే కానీ సూచీలకు ఎన్నికల కాక తగిలి పతనాభిముఖంగా పయనిస్తాయని హీలియోస్‌ క్యాపిటల్‌ మేనేజర్‌, మార్కెట్‌ నిపుణుడు సమీర్‌ అరోరా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశీయ ఈక్విటీ సూచీలు ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు అటుఇటుగా తిరుగుతునానయి. ఎర్నింగ్స్‌పై ఆశలతో సూచీలు పాజిటివ్‌గా రియాక్టవుతున్నాయని సమీర్‌ చెప్పారు. క్రమంగా మరో నెల రోజుల్లో సూచీల చూపు ఎన్నికలపై పడుతుందన్నారు. ఎన్నికలంటేనే

Most from this category