STOCKS

News


ఆరంభలాభాలు ఆవిరి

Monday 3rd December 2018
Markets_main1543832350.png-22597

  • 10900 స్థాయిని నిలుపుకోలేకపోయిన నిఫ్టీ
  • మెరిసిన మెటల్‌ షేర్లు
  • ఫార్మాకు సన్‌ఫార్మాకు జ్వరం

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు... చివరి అరగంటలో హెచ్‌యూఎల్‌ షేర్ల ర్యాలీ అండతో స్వల్పలాభంతో గట్టెక్కాయి. అమెరికా-చైనా దేశాల మధ్య కుదరిన వాణిజ్య యుద్ధ సంధితో ట్రేడింగ్‌ ప్రారంభంలో ఆర్జించిన లాభాల్ని నిలుపుకోవడంతో సూచీలు విఫలయ్యాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభంలో నిఫ్టీ సూచి అందుకున్న 10900 మార్కును, సెన్సెక్స్‌ ఆర్జించిన 250 పాయింట్ల లాభాల్ని సూచీలు కోల్పోయాయి. చివరకు సెన్సెక్స్‌ 47పాయింట్ల లాభంతో 36,241 వద్ద, నిఫ్టీ 7పాయింట్లు స్వల్పంగా పెరిగి 10,884 వద్ద ముగిశాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 5.40 పాయింట్ల నష్టంతో 26,857.55 వద్ద ముగిసింది. అలాగే ఫార్మా, ఫైనాన్స్‌, అటో ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. మెటల్‌, ఎఫ్‌ఎంజీసీ, ఐటీ రంగాలకు చెందిన ఇండెక్స్‌లు లాభంతో ముగిశాయి. సెన్సెక్స్‌ 36,099.68 - 36,446.16 రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ సూచీ 10,845.35 - 10,941.20 స్థాయిలో కదలాడింది.
లాభాల స్వీకరణ:-
ఎట్టకేలకు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ సంధి కుదరడంతో నేడు మార్కెట్‌ భారీ లాభంతో ప్రారంభించింది. సెన్సెక్స్‌ 202 పాయింట్ల లాభంతో 36396 వద్ద, నిఫ్టీ సూచీ 54 పాయింట్ల లాభంతో 10900లపైన 10931 వద్ద ట్రేడింగ్‌ను ట్రేడింగ్‌ షురూచేశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో మెటల్‌ షేర్ల ర్యాలీతో సెన్సెక్స్‌ 250 పాయింట్లను, నిఫ్టీ 65 పాయింట్లను ఆర్జించాయి. అయితే సూచీలు గరిష్ట స్థాయిలో ట్రేడ్‌ అవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ పూనుకున్నారు. ఫలితంగా సూచీలు ట్రేడింగ్‌ ఆరంభంలో సాధించిన లాభాల్ని కోల్పోయాయి. ముఖ్యంగా సన్‌ఫార్మా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్ల పతనం సూచీల లాభాలను హరించి వేశాయి. మిడ్‌సెషన్‌లో ఫార్మా, అటో, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఎక్కువగా నష్టపోయాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ సూచి ఇంట్రాడే గరిష్టస్థాయి నుంచి 347 పాయింట్లను కోల్పోయి 36,099.68 వద్ద పతనమైంది. మరో సూచీ నిఫ్టీ ఇండెక్స్‌ సైతం ఇంట్రాడే గరిష్టస్థాయి(10,941.20) 96 పాయింట్లను నష్టపోయి 10,841.35 వద్ద చేరుకుంది. మిడ్‌ సెషన్‌ నుంచి ట్రేడింగ్‌ చివరి వరకు మార్కెట్‌ ప్రభావితం చేసే​అంశాలేవి లేకపోవడంతో సూచీలు లాభనష్టాలతో ఊగిసలాడాయి. అయితే చివరి అరగంటలో హెచ్‌యూఎల్‌ (హిందూస్థాన్‌ యూని లివర్‌) ర్యాలీతో సూచీలు స్వల్ప లాభంతో ముగిశాయి.
మార్కెట్‌ ఫ్లాట్‌ ముగింపునకు కారణాలివే..!
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా తిరిగి పుంజుకోవడంతో డాలర్‌ మారకంలో రూపాయి పతనమైంది. రెండో త్రైమాసికపు జీడీపీ, ద్రవ్యలోటు, నవంబర్‌లో వాహన విక్రయ, జీఎస్టీ వసూళ్ల గణాంకాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించలేకపోయాయి. నేడు ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశం ప్రారంభం కానుంది. ఇదే వారంలో జరిగే ఒపెక్‌ దేశాల సమావేశం కూడా జరగనుంది. ఈ పరిణమాలతో నేపథ్యంలో సూచీలు మిడ్‌సెషన్‌ నుంచి స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.
వేదాంత లిమిటెడ్‌, గెయిల్‌, హిందూస్థాన్‌యూనిలివర్‌, యస్‌బ్యాంక్‌, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 3.50శాతం నుంచి 10శాతం లాభపడ్డాయి. జీ లిమిటెడ్‌, యూపీఎల్‌, ఎంఅండ్‌ఎం, హెచ్‌పీసీఎల్‌, సన్‌ఫార్మా షేర్లు 2.50శాతం నుంచి 7.50శాతం నష్టపోయాయి.



You may be interested

డిసెంబర్‌లో అధిక ఒడిదుడుకులు వుండొచ్చు..!

Monday 3rd December 2018

ముంబై: ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆ తరువాత మేలో సాధారణ ఎన్నికలు అనేవి మార్కెట్‌ దిశకు అత్యంత కీలక అంశాలని చార్ట్‌వ్యూ ఇండియా డాట్‌ ఇన్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్‌ మజర్‌ మహ్మద్‌ అన్నారు. నిఫ్టీకి 11,000 పాయిం‍ట్లు అనేది ప్రస్తుతం ఏమంత పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించిన ఆయన ఈ స్థాయి కేవలం 2-3 శాతం దూరంలోనే ఉందన్నారు. ఇక్కడ అర్థం

నిఫ్టీ మిడ్‌క్యాప్‌... ర్యాలీకి ఛాన్స్‌..!

Monday 3rd December 2018

ముంబై: వచ్చే కొన్ని వారాల్లోనే మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 8-10 శాతం వరకు అవకాశం ఉందని కొటక్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్ చౌహాన్ విశ్లేషించారు. ప్రస్తుతం 4,780 పాయింట్ల స్థాయిలో ఉన్నటువంటి నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 50 త్వరలోనే 5,200 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉందని చార్టుల ఆధారంగా స్పష్టమవుతోందని వివరించారు. ఈ సూచీలోని షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆకర్షణీయ రాబడిని పొందవచ్చన్నారు. ఈ సూచీలోని

Most from this category