STOCKS

News


స్వల్ప నష్టంతో ముగింపు

Thursday 1st November 2018
Markets_main1541067124.png-21640

10400 దిగువకు నిఫ్టీ

ఫ్లాట్‌గా ముగిసిన సెన్సెక్స్‌

సూచీలు ప్రారంభ లాభాలను నిలుపులేకపోవడంతో మార్కెట్‌ గురువారం స్వల్ప నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 10 పాయింట్లు కోల్పోయి 34,432 వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టపోయి10,380 వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌లోని మరో కీలకమైన సూచీ నిఫ్టీ బ్యాంక్‌ 155పాయింట్లు పెరిగి 25,323.6 వద్ద ముగిసింది.  మెటల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు ర్యాలీ చేయగా, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ, అటో రంగాలకు చెందిన సూచీలు నష్టాలతో ముగిశాయి. అత్యధికంగా మెటల్‌ షేర్లు లాభపడగా, ఐటీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
అదిరిపోయే అరంభం:-
దేశీయ మార్కెట్‌ నవంబర్‌ నెలను ఘనమైన లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు ‘‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’’లో భారత్‌ తన ర్యాంకును 77స్థానానికి మెరుగుపరుచుకోవడం, డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం, ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు... తదితర కారణాలతో బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 206 పాయింట్ల పెరుగుదలతో 34,650  వద్ద, నిఫ్టీ సూచీ 55 పాయింట్ల లాభంతో 10,442 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఎల్‌ అండ్‌ టీ, టాటా మోటర్స్‌, యస్‌ బ్యాంక్‌,  యాక్సి్‌స్‌ బ్యాంక్‌ తదితర హెవీవెయిట్‌ షేర్ల ర్యాలీ కూడా మార్కెట్‌ భారీ లాభాల ప్రారంభానికి మరో కారణమయ్యాయి.
ఆరంభలాభాలు ఆవిరి:-
ఉదయం లభించిన లాభాల ట్రేడింగ్‌ను నిలుపుకోవడంతో సూచీలు విఫలయ్యాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎస్‌సీజీ రంగాల్లో అమ్మకాలు జరగడంతో సూచీలు ప్రారంభలాభాల్ని క్రమంగా కొల్పోతూ వచ్చాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలపడటంతో ఐటీ, ఫార్మా షేర్లు నష్టపోయాయి. ఇక ఎఫ్‌ఎంజీసీ షేర్లలో ఐటీసీ, హిందూస్థాన్‌ యూనీలివర్‌ నష్టపోయాయి. ఫలితంగా సెన్సెక్స్‌ మిడ్‌ సెషన్‌ సమయానికి 139 పాయింట్లను కోల్పోయి 34,303.38 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల నష్టపోయి 10,342 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసింది.
మిడ్‌ సెషన్‌ నుంచి స్తబ్దుగా:-
మిడ్‌సెషన్‌ నుంచి కొన్ని హెవీవెయిట్‌ షేర్లు పెరగడంతో సూచీలు నష్టాలను తగ్గించుకున్నాయి. మార్కెట్‌ ప్రభావితం చేసే అంశాలేవి లేకపోవడంతో మిడ్‌ సెషన్‌ నుంచి సూచీలు స్తబ్దుగా ట్రేడ్‌ అయ్యాయి. చివరకు సెన్సెక్స్‌ 34,432 వద్ద, నిఫ్టీ 10380 వద్ద ముగిసింది.

సిప్లా, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ షేర్లు 2నుంచి 4శాతం నష్టపోగా, యూపీఎల్‌, బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హిందాల్కో, యస్‌ బ్యాంక్‌ షేర్లు 3.50శాతం నుంచి 9శాతం లాభపడ్డాయి.



You may be interested

పునరుద్ధణకు సిద్ధమైన ఎస్‌బీఐ..!

Thursday 1st November 2018

- టార్గెట్‌ ధర రూ.365 ముంబై: దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) పునరుద్ధణకు సిద్దమైందని డాయిష్ బ్యాంక్ విశ్లేషించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవ్యలభ్యత కట్టడిలో అత్యధిక ప్రయోజనం పొందనున్నది ఈ బ్యాంకేనని అంచనాను వెల్లడించింది. అనుబంధ సంస్థల విలీనాల అనంతరం సవాళ్లను ఎదుర్కొంటున్న బ్యాంకులో 2019-20 నుంచి ఎర్నింగ్స్‌ వృద్ధిరేటు నమోదుకానుందని పేర్కొంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎస్‌బీఐ షేరు ధర 8 శాతం

మార్కెట్‌కు అండగా మెటల్‌ షేర్లు

Thursday 1st November 2018

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ అనంతంరం స్తబ్దుగా ట్రేడ్‌ అవుతోంది. మెటల్‌ షేర్ల ర్యాలీ మార్కెట్‌ పతనాన్ని అడ్డుకుంటుంది. నేటి ఇంట్రాడేలో ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ 2.50శాతం ర్యాలీ చేసి 3,351.65 గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యహ్నం గం.2:45ని.లకు 2శాతం లాభంతో 3,341.95 ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి మెటల్‌ సూచీలో భాగమైన మొత్తం 13 షేర్లలో 11 షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా 2 షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

Most from this category