STOCKS

News


స్వల్ప లాభంతో ముగిసిన మార్కెట్‌

Thursday 11th April 2019
Markets_main1554979286.png-25075

తొలి దశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైన నేపథ్యంలో గురువారం దేశీయ మార్కెట్‌  స్వల్ప లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 22 పాయింట్లు బలపడి 38,607 వద్ద,  నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 11,597 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 18పాయింట్లు నష్టపోయి 29,786 వద్ద ముగిసింది. అటో, ఎఫ్‌ఎంజీసీ, ఆర్థిక రంగ షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, మెటల్‌, మెటల్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ దిగ్గజ కంపెనీలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ క్యూ4 ఫలితాలు వెల్లడి కానుండంతో పాటు, తొలిదశ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. వీటికి తోడు మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు ఇన్వెస్టర్లను అప్రమత్తత చేయడంతో సూచీలు స్వల్ప లాభాలను సరిపెట్టుకున్నాయి. 
డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ అటో, బజాజ్‌ఫైనాన్స్‌, భారతీఎయిర్‌టెల్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 2.50శాతం లాభపడగా, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, సన్‌ ఫార్మా, వేదాంత షేర్లు 4శాతం నష్టపోయాయి. 



You may be interested

ఒక్కటవుతున్న బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు!

Friday 12th April 2019

గత రెండు సంవత్సరాల్లో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల వ్యాపారంలో చక్కని వృద్ధి నెలకొంది. మార్కెట్‌ నుంచి నిధుల సమీకరణ వ్యయాలు తక్కువగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. కానీ, గతేడాది ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ చెల్లింపుల వైఫల్య సంక్షోభం అనంతరం మార్కెట్లో నిధులకు కటకట ఏర్పడింది. నిధుల సమీకరణ వ్యయాలు ఎన్‌బీఎఫ్‌సీలకు పెరిగిపోయాయి. ఎన్‌బీఎఫ్‌సీలకు ఏర్పడిన ఈ గడ్డు పరిస్థితులు బ్యాంకులకు అనుకూలంగా మారాయి. వీటికి తక్కువ వ్యయాలతో కూడిన డిపాజిట్లు భారీగా ఉండడమే

ఆ నాలుగు!

Thursday 11th April 2019

బ్యాంకు షేర్లపై అనిలిస్టులు పాజిటివ్‌ నాలుగు బ్యాంకు షేర్లు రాబోయే రోజుల్లో ప్రధాన మార్కెట్‌ కన్నా అధిక రాబడులు అందిస్తాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. 1. ఐసీఐసీఐ బ్యాంక్‌: రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 470. బ్యాంకుకు సంబంధించిన పలు పాజిటివ్‌ అంశాలు ఇంకా మార్కెట్లో ప్రైస్‌ఇన్‌ కాలేదు. బ్యాంకు డిపాజిట్‌ విభాగం అత్యంత బలంగా తయారైంది. రిటైల్‌ లోన్‌బుక్‌పై ఎక్కువ ఫోకస్‌ పెడుతోంది. ప్రస్తుతం ఇతర ప్రైవేట్‌ బ్యాంకు

Most from this category