STOCKS

News


సెన్సెక్స్‌ రికార్డు ముగింపు

Thursday 12th July 2018
Markets_main1531392166.png-18248

  • 11 వేల పాయింట్ల పైన ముగిసిన నిఫ్టీ
  • రాణించిన రిలయన్స్‌ ఇండస్ట్రీ

అంతర్జాతీయంగా ముడి చమురు పతనంతో పాటు ఆయిల్‌ అండ్‌ గ్యాస్, బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీతో మార్కెట్‌ వరుసగా ఐదో రోజూ లాభాలతో ముగిసింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలకు నెలకొనడంతో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉండటంతో ట్రేడింగ్‌ ఆద్యంతం ఇన్వెస్టర్లు కొనుగోళ్ల మొగ్గుచూపారు. ముఖ్యంగా హెవీ వెయిట్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఎల్‌ అండ్‌ టీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్‌ ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సృష్టించింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 11 వేల ఎగువన ట్రేడ్‌ అయ్యింది. చివరికి సెన్సెక్స్‌ 282 పాయింట్లు లాభంతో 36,548 వద్ద, నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 11,023 వద్ద ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టీ 210 పాయింట్లు లాభపడి 27వేల ఎగువన 27,026 వద్ద ముగిసింది.
ట్రేడింగ్‌ ఆద్యంతం రిలీఫ్‌ ర్యాలీ..!
అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌ల కుప్పకూలడంతో పాటు, ఆసియా మార్కెట్లు నుంచి అందిన సానుకూల సంకేతాల నేపథ్యంలో నేడు మార్కెట్‌ రికార్డ్‌ ర్యాలీతో ప్రారంభమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సూచి 158 పాయింట్లు లాభంతో 36424 వద్ద, నిప్టీ 59 పాయింట్లు లాభంతో 11000 పాయింట్లపైన 11,007 వద్ద ట్రేడింగ్‌ను షూరూ చేశాయి. భారీ అరంభ ర్యాలీతో అందుకున్న సెన్సెక్స్‌ సూచీ ఇంట్రాడే ఆరంభంలోనే జనవరి 29న నమోదు చేసిన  36,444 పాయింట్ల రికార్డును అధిగమించి సరికొత్త రికార్డుల వైపు ర్యాలీ చేసింది. మిడ్‌ సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 433 పాయింట్ల లాభంతో 36699 వద్ద సరికొత్త రికార్డు నెలకొల్పింది. మరో ప్రధాన సూచీ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 11,078 ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6శాతం ర్యాలీతో సూచీలను మరింత పరుగులు పెట్టించింది.
స్వల్ప లాభాల స్వీకరణ:-
సూచీలు గరిష్టస్థాయికి చేరిన తరుణంలో చివరి గంటలో ఇన్వెస్టర్లు స్వల్పలాభాల స్వీకరణకు పూనుకున్నారు. ఫలితంగా సూచీల ర్యాలీకి బ్రేక్‌ పడింది. మిడ్‌ సెషన్‌లో సాధించిన సెన్సెక్స్‌ సాధించిన 400పాయింట్ల లాభాల నుంచి 151 పాయింట్ల లాభాలను కోల్పోయి 36,548 వద్ద ముగిసింది. మరోసూచీ నిఫ్టీ ఇంట్రాడే హై 11,078 నుంచి 55 పాయింట్లు కోల్పోయి 11,023 వద్ద ముగిసింది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ @ 100 బిలియన్‌ డాలర్లు
నేడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌  100 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకుంది. మన దేశంలో టీసీఎస్‌ కంపెనీ తరువాత 100 బిలియన్‌ డాలర్ల మార్కును చేరుకున్న రెండో కంపెనీగా రిలయన్స్‌ కంపెనీ రికార్డు సృష్టించింది. ఇవాళ ఉదయం బీఎస్‌ఈలో కంపెనీ షేరు రూ. 1090 దాటడంతో ఈ ఘనతను సాధించింది. వరుసగా ఐదు రోజూ ట్రేడింగ్‌లో లాభాల బాటలో పయనించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఇంట్రాడేలో 6శాతం లాభపడి రూ.1098.80 వద్ద సరికొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. జూలై 5న జరిగిన కంపెనీ 41వ వార్షిక సమావేశం సందర్భంగా అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించిన పలు వ్యూహాత్మక వాప్యార ప్రణాళికలు షేర్ల ర్యాలీకి కారణమవుతున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. షేరు ఆల్‌టైం హైకి చేరిన నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో గరిష్టలాభాన్ని కొంతవరకూ కోల్పోయిన  రిలయన్స్‌ షేరు గత  ముగింపు ధర రూ. 1036.35తో పోలిస్తే 4.42శాతం లాభంతో రూ.1082 వద్ద ముగిసింది. నేడు నిఫ్టీ సాధించిన 75 పాయింట్ల లాభాల్లో 37 పాయింట్ల ఒక్క రిలయన్స్‌ ఇండస్ట్రీ షేరువి కావడం విశేషం.
గ్రాసీం, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ అటో, వేదాంత, యూపీఎల్‌ షేర్లు 2నుంచి 4శాతం నష్టపోగా, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, బీపీసీఎల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 2నుంచి 4శాతం లాభపడ్డాయి.You may be interested

మార్కెట్‌ ర్యాలీకి ఈ 5 నాణ్యమైన షేర్లే కారణం..!

Thursday 12th July 2018

ముంబై: ప్రస్తుతం నిఫ్టీ 11,000 మార్కును అధిగమించినప్పటికీ.. నిజానికి ఈ సూచీ 10,000 వద్దనే ఉన్నట్లు లెక్కని యాక్సిస్‌ ఏఎమ్‌సీ ఈక్విటీస్‌ హెడ్‌ జినేష్‌ గోపానీ విశ్లేషించారు. 11,000 అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. సరిగ్గా గతేడాది ఇదే రోజు నుంచి ఇప్పటి వరకు చూస్తే స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 19 శాతం నష్టపోగా, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 24 శాతం

ఆల్‌టైమ్‌ హై సరే.. ఈ అంశాలతో జాగ్రత్త...

Thursday 12th July 2018

దేశీయ సూచీలు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నాయి. తాజాగా సెన్సెక్స్‌ రికార్డు స్థాయిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో సూచీల జోరుకు పగ్గాలు వేసే ఐదు రిస్కు అంశాలను జాగ్రత్తగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.. 1. క్రూడాయిల్‌ ధర పెరుగుదల, రూపాయి క్షీణత: చాలా రోజుల తర్వాత క్రూడాయిల్‌ ధర ఇటీవలే బ్యారెల్‌ 80 డాలర్లను తాకింది. అయితే అక్కడ నిలదొక్కుకోలేక ప్రస్తుతం 73-74 డాలర్ల రేంజ్‌లో కదలాడుతోంది. ఇకమీదట క్రూడ్‌ ధర

Most from this category