STOCKS

News


సెన్సెక్స్‌ మరో కొత్త రికార్డు

Tuesday 2nd April 2019
Markets_main1554201237.png-24932

11700పైన ముగిసిన నిఫ్టీ
నాలుగోరోజూ లాభాలే.

స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం రికార్డు ర్యాలీ కొనసాగింది. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో  39,121.69 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 185 పాయింట్లు లాభపడి తొలిసారిగా 39వేల పైన 39,056.65 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 44 పాయింట్లు లాభపడి 11700పైన 11,713 వద్ద స్థిరపడింది. సూచీలకు ఇది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు కావడం విశేషం. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ మంగళవారం లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 116 పాయింట్ల లాభంతో 38,986 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 11,700ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లలో , ఇటు దేశీయంగా మార్కెట్‌లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేకపోవడంతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే కొనుగోళ్లు మొగ్గుచూపారు. ముఖ్యంగా అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌, ఆర్థిక రంగ, ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో సూచీలు స్థిరమైన ర్యాలీ సాగింది. ఈ క్రమంలో సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 350 పాయింట్లు లాభపడి 39,121.69 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 11,729.35ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అనంతరం మార్కెట్లో కొంతమేర లాభాల స్వీకరణకు పూనుకున్నారు. అయితే చివరి అరగంట కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్‌ 39వేల పైన, నిఫ్టీ 11700ల పైన ముగిశాయి.  
బజాజ్‌ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఐషర్‌మోటర్స్‌, భారతీఎయిర్‌టెల్‌, టాటామోటర్స్‌ షేర్లు 2.50శాతం నుంచి 8.50శాతం లాభపడగా, సన్‌ఫార్మా బ్రిటానియా, బజాజ్‌-అటో, బీపీసీఎల్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 2శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

ఎస్‌బీఐ టార్గెట్‌ ధర పెంచిన మోర్గాన్‌స్టాన్లీ

Tuesday 2nd April 2019

మంగళవారం ట్రేడింగ్‌లో ఎస్‌బీఐ షేరు దాదాపు రెండున్నర శాతం లాభపడి రూ. 330పైన క్లోజయింది. అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తాజాగా ఎస్‌బీఐ టార్గెట్‌ ధరను పెంచడంతో షేరు కౌంటర్లో జోరు పెరిగింది. ఎస్‌బీఐ టార్గెట్‌ ధరను మోర్గాన్‌ స్టాన్లీ రూ. 375 నుంచి రూ. 425కు పెంచింది. దీంతో పాటు షేరుపై ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఆర్థిక సంవత్సర ఎస్‌బీఐ లోన్‌ గ్రోత్‌లో మంచి

సైయంట్‌ 12 శాతం క్రాష్‌

Tuesday 2nd April 2019

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజ కంపెనీ సైయంట్‌  లిమిటెడ్‌ షేర్లు మంగళవారం 12శాతం పతనమయ్యాయి. కంపెనీకి ఇటీవల దక్కిన ఆర్డర్లు వాయిదా పడటం షేర్ల పతనానికి కారణమైంది. నేడు  సైయంట్‌  షేర్లు బీఎస్‌ఈలో రూ.645.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రెగ్యూలేటరీ క్లియరెన్సీ ఇవ్వకపోవడంతో సుమారు 5మిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు వాయిదా పడినట్లు కంపెనీ తెలిపింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సం‍వత్సరంలో కంపెనీ ఆదాయాలు తగ్గవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా చేయడం కూడా

Most from this category